Begin typing your search above and press return to search.

అనుకున్న విధంగా జ‌ర‌గ‌దా.. జ‌గ‌న్ త‌ర్జ‌న భ‌ర్జ‌న‌

By:  Tupaki Desk   |   28 March 2022 12:30 PM GMT
అనుకున్న విధంగా జ‌ర‌గ‌దా.. జ‌గ‌న్ త‌ర్జ‌న భ‌ర్జ‌న‌
X
రాష్ట్రంలో జిల్లాల ఏర్పాటు ప్ర‌హ‌సంగా మారుతోందా? సీఎం జ‌గ‌న్ ఆలోచ‌న మేర‌కు జ‌ర‌గ‌డం లేదా? అంటే. ఔన‌నే అంటున్నారు వైసీపీ సీనియ‌ర్లు. జిల్లాల ఏర్పాటును ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసుకున్న వైసీపీ అధినేత‌.. రాజ‌కీయంగా ఈ కోణంలో ల‌బ్ధి పొందాల‌ని నిర్ణ‌యించుకున్నారు. వాస్త‌వానికి ఏ నాయ‌కుడు అయినా.. కూడా.. ఏం చేసినా.. దానిలో త‌న‌కు వ‌చ్చే ప్ర‌తిఫ‌లాన్ని ఆపేక్షిస్తారు. ఇలానే.. జిల్లాలను విభ‌జించ‌డం ద్వారా.. ప్ర‌జ‌ల‌ను త‌న‌వైపు తిప్పుకునేందుకు సీఎం జ‌గ‌న్ కూడా ప్ర‌య‌త్నించాల‌ని అనుకున్నారు.

దీనివ‌ల్ల‌.. కీల‌క‌మైన టీడీపీ ఓటు బ్యాంకును బ‌దాబ‌ద‌లు చేసి.. వైసీపీని మ‌రింత కొత్త పుత్త‌లు తొక్కించేం దుకు నిర్ణ‌యించారు. కానీ, అనుకున్న విధంగా మాత్రం క్షేత్ర‌స్థాయిలో ప‌నులు జ‌ర‌గ‌డం లేదు. ఆదిలోనే సొంత పార్టీ నుంచి తీవ్ర వ్య‌తిరేక‌త వ‌చ్చింది. ముఖ్యంగా సీఎం జ‌గ‌న్ సొంత జిల్లా క‌డ‌ప‌లోనే రాయ‌చోటి వివాదం ప్ర‌భుత్వాన్ని కుదిపేసింది. రాయ‌చోటిని జిల్లా కేంద్రంగా చేస్తూ.. ఏర్పాటు చేస్తున్న అన్న‌మయ్య జిల్లాను ప్ర‌జ‌లు వ్య‌తిరేకించారు. చారిత్ర‌కంగా చూసుకున్నా.. అన్న‌మయ్య స్వ‌స్థ‌లం .. రాజం పేట‌.

దీనిని కాద‌ని జిల్లా ఏర్పాటు ఎలా చేస్తార‌నేది ఇక్క‌డి ప్ర‌జ‌ల గ‌గ్గోలు. ఇక‌, టీడీపీకి.. జ‌న‌సేన‌కు గ‌ట్టి ప‌ట్టున్న న‌ర‌సాపురంలోనూ భీమవ‌రం కేంద్రంగా ఏర్పాటు చేస్తున్న జిల్లాపై ప్ర‌జ‌లు నిప్పులు చెరిగారు.

అదేస‌మ యం మ‌న్యం జిల్లాపై అక్క‌డి ప్ర‌జ‌లు క‌దం తొక్కారు. చిత్తూరులోనూ.. మ‌ద‌న‌ప‌ల్లిని జిల్లా చేయాల‌ని అంటున్నారు. నిన్న మొన్న‌టి వ‌ర‌కు కూడా చాలా తీవ్రంగా ఈ ప‌రిస్థితులు ప్ర‌భుత్వాన్ని ఇర‌కాటంలో పెట్టాయి. ఇక‌, మ‌రోవైపు ప‌ల్నాడులోనూ.. ఇదే త‌ర‌హా వివాదాలు న‌డుస్తున్నాయి.

ఎంతో కీల‌క‌మైన కందుకూరు డివిజ‌న్‌ర‌ద్దును ప్ర‌జ‌లు వ్య‌తిరేకించారు. వెర‌సిచూస్తే.. ఈ నెల 31న విడుద‌ల కానున్న కొత్త జిల్లాల ఏర్పాటుపై తుది నివేదిక కోసం .. అంద‌రూ ఎదురు చూస్తున్నారు. ఇది క‌నుక‌.. ప్రజాభీష్టానికి వ్య‌తిరేకంగా ఉంటే.. జ‌గ‌న్ అనుకున్న విధంగా ఉగాది నుంచి కొత్త జిల్లాల్లో పాల‌న క‌ష్ట‌త‌రం కానుంది.

ఎందుకంటే. త‌మ త‌మ ఆకాంక్ష‌ల‌కు అనుగుణంగా లేక‌పోతే.. ఆయా నోటిఫికేష‌న్ల‌పై.. ప్ర‌జ‌లు హైకోర్టును ఆశ్ర‌యించేందుకు రెడీగా ఉన్నారు.. ఇప్ప‌టికే మ‌ద‌న‌ప‌ల్లిపై కోర్టులో పిల్ దాఖ‌లైంది. ఇలా.. ఏవిధంగా చూసినా.. జ‌గ‌న్ అనుకున్న‌ది సాధించ‌డం ఇప్ప‌ట్లో సాధ్యం కాద‌నే సంకేతాలు వ‌స్తున్నాయి.