Begin typing your search above and press return to search.
జగన్ ఫోబియా వీడితేనే .... ?
By: Tupaki Desk | 8 March 2022 9:15 AM GMTరాజకీయ పార్టీలకు టార్గెట్ అన్నది స్పష్టంగా ఉండాలి. అదే విధంగా వ్యక్తిగతానికి ప్రజా హితానికి మధ్య ఉన్న సన్నని రేఖలను దాటే నైపుణ్యం ఉండాలి. అపుడే అవి అధికారంలోకి రాగలుతాయి. ఒక విశాల ప్రయోజనాలను కాంక్షించి రాజకీయాలు చేస్తే కచ్చితంగా ఏదో నాడు అధికారం వరించక తప్పదు. సంకుచిత ధోరణులకు ఎవరైనా స్వస్తివాచకం పలికితేనే భవిష్యత్తు బంగారం అవుతుంది.
ఇదంతా ఎందుకంటే ఏపీలో రాజకీయ పార్టీలూ, వాటి పరిస్థితులను చూసినపుడు రాజకీయాలు పూర్తిగా ప్రజా అజెండా నుంచి తప్పుకుంటున్నాయా అన్న చర్చ అయితే వస్తోంది. వైసీపీ రాజకీయం ఈ రోజుకీ చంద్రబాబును కేంద్ర బిందువుగా చేసుకుని సాగుతుంది. ఆయన ఫోబియా నిండా నింపుకుని ఆ పార్టీ సాగుతుంది. దీని వల్ల విజయాలు కొన్ని దక్కినా అపజయాలు కూడా వెనకనే ఉంటూ వస్తున్నాయి.
ఇపుడు మరో పార్టీ పవన్ కళ్యాణ్ జనసేన గురించి చెప్పుకుంటే ఆయన ఎంతసేపూ జగన్ని అజెండాగా చేసుకుంటూ ముందుకు సాగుతున్నారని చెబుతారు. తానూ తన పార్టీ గెలుపు కంటే కూడా జగన్ ఓటమిని పవన్ గట్టిగా కోరుకుంటున్నారని అంటారు.
దాంతో ఆయన ఎనిమిదేళ్ళు గడచినా పెద్దగా అధికార దిశగా అడుగులు వేయలేకపోతున్నారు అన్న విశ్లేషణలు ఉన్నాయి.
ఇక పవన్ పార్టీ మరి కొద్ది రోజులలో ఎనిమిదవ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు జరగనున్నాయి. ఈ సందర్భంగా సంచలన ప్రకటనలు ఉంటాయని ఆ పార్టీ వర్గాలు తెలియచేస్తున్నారు. భవిష్యత్తు కార్యాచరణ మీద కూడా క్లారిటీ ఇస్తామని అంటున్నారు. అయితే దీని మీదనే పెద్ద ఎత్తున చర్చ సాగుతోంది. ప్రస్తుతం బీజేపీతో పవన్ పొత్తులో ఉన్నారు. అలాగే టీడీపీ కూడా జనసేనతో స్నేహాన్ని కోరుకుంటోంది.
ఈ నేపధ్యంలో పవన్ బీజేపీకి దూరం జరిగి టీడీపీతో దోస్తీ చేస్తారా అన్న చర్చ కూదా ఉంది. దీని మీద అయితే బీజేపీ పెద్దలు మాత్రం జనసేనతో చెలిమిని ఎట్టి పరిస్థితులలోనూ వదులుకోకూడదు అని భావిస్తున్నారు. ఏపీలో జనసేన, బీజేపీలకు మంచి భవిష్యత్తు ఉంటుందని కూడా వారు చెబుతున్నారు. ఏపీలో రెండు బలమైన పార్టీలలో ఒక పార్టీ తగ్గితేనే రాజకీయ శూన్యత వస్తుందని, దాంతోనే కూటమి ముందుకు సాగే వీలుంటుందని కూడా లెక్కలు వేస్తున్నారు.
ఇక టీడీపీ ఓటు బ్యాంకే ఎక్కువగా బీజేపీ జనసేన కూటమిని టర్న్ అయ్యే చాన్స్ ఉన్నందువల్ల ఆ పార్టీని బలోపేతం చేసే చర్యలకు ఎట్టి పరిస్థితుల్లోనూ పవన్ కానీ జనసేన కానీ ఊతం ఇవ్వరాదు అన్నదే బీజేపీ మాస్టర్ ప్లాన్ గా చెబుతున్నారు. ఏపీలో 2024 కాకపోతే 2029 నాటికి అయినా ఈ కూటమికి కచ్చితంగా అధికారం సాధ్యమని కూడా బీజేపీ వ్యూహకర్తలు లెక్కలు వేస్తున్నారు.
ఇక బీజేపీకి జాతీయ స్థాయిలో తిరుగులేదని, మరోమారు ప్రధానిగా నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చేస్తారు అని చెబుతున్నారు. అందువల్ల జనసేన నాయకులు కేవలం ఏపీలో మాత్రమే పరిమితమై రాజకీయం చేయకూడదని వారు కోరుకుంటున్నారు. అలాగే జగన్ ఫోబియాను పక్కన పెట్టి ఏపీలో రియాలిటీని కూడా చూడాలని, కూటమి అధికారంలోకి వచ్చేలా జనసేన అడుగులు వేయాలని సూచిస్తున్నారు.
మొత్తానికి చూస్తే పవన్ టీడీపీ చంద్రబాబుల పట్ల మక్కువ కనబరచి ఆ వైపు సాగకుండా కమలనాధులు అయితే తెర వెనక చేయాల్సినది చేస్తున్నారు అంటున్నారు. బీజేపీ ఆలోచనలు పక్కన పెట్టి చూసినా లేక ఏపీ రాజకీయాన్ని చూసుకున్నా కూడా టీడీపీ బలహీనపడితేనే బీజేపీ జనసేన కూటమికి చాన్స్ ఉంటుంది.
ఎటూ బీజేపీ పవన్ని ముఖ్యమంత్రి అభ్యర్ధిగా ప్రకటిస్తామని అంటోంది కాబట్టి మరి జనసేన ఈ కూటమిని ఇంకా పరిపుష్టం చేసే విధంగా ఆలోచనలు చేస్తారా లేక కొత్త నిర్ణయాలు తీసుకుంటారా అన్నది ఈ నెల 14న జరిగే జనసేన ఆవిర్భావ సభలో తేలిపోతుందని అంటున్నారు. చూడాలి మరి ఏం జరుగుతుందో.