Begin typing your search above and press return to search.
కోర్టు బోనులో బాలయ్య ? డైలాగులు కాదు కదా కావాల్సింది !
By: Tupaki Desk | 28 March 2022 11:35 AM GMTసినిమాలో డైలాగులు చెప్పినంత సులువుగా ప్రజా క్షేత్రంలో సమస్యలు అయితే పరిష్కారం కావు అనే తేలిపోయింది. ముఖ్యంగా హిందూపురం వివాదం విషయమై బాలయ్య బాబు మొన్నటి వరకూ స్పీడుగానే ఉన్నా కూడా ఇప్పుడు ఎందుకనో సైలెంట్ అయిపోయారు.
శాసన సభలో కూడా పెగాసస్ దుమారం రేగినంతగా కొత్త జిల్లాల ఏర్పాటుపై ఎవ్వరూ మాట్లాడకపోవడం, ప్రజాభీష్టంపై చర్చించకపోవడం విచారకరం.
కొత్త జిల్లాల ఏర్పాటుకు యువ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి సన్నద్ధం అవుతున్నారు.కానీ బాలయ్య ప్రతిపాదన మాత్రం అమలుకు నోచుకోలేదు. హిందూపురం కేంద్రంగా శ్రీ సత్యసాయి జిల్లాను ప్రకటించాలని కోరినా ఫలితం లేకపోయింది. దీంతో హిందూపురం ప్రజలు తమ ప్రాంత ఎమ్మెల్యే బాలయ్యను నమ్ముకున్నా ఫలితం లేదన్న వాదనలో ఉన్నారు.
మొదట్లో తీవ్ర స్థాయిలో నిరసనలు తెలిపిన బాలయ్య తరువాత మాత్రం ఎందుకనో వ్యూహాత్మక నిశ్శబ్దానికే పరిమితం అయి ఉన్నారు. ప్రస్తుతం ఆయన మనసంతా గోపీచంద్ మలినేనితో చేస్తున్న కొత్త సినిమాపైనే! కానీ ప్రజా సమస్యలపై మళ్లీ ఎప్పుడు మాట్లాడతారో, ఎప్పుడు పోరాడతారో కూడా చెప్పలేం.
ఇక ఇదే వివాదం నేపథ్యంలో హిందూపురం అఖిల పక్ష కమిటీ హై కోర్టును ఆశ్రయించి ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేసింది. గత ఎన్నికల సమయంలో పాదయాత్ర చేసిన వైఎస్ జగన్ తమ ప్రాంతాన్ని జిల్లాగా ప్రకటిస్తామని చెప్పి మాట తప్పారని కూడా అంటోంది.
దీంతో కోర్టులోనే ఈవిషయమై తాడోపేడో తేల్చుకుంటామని కూడా అంటోంది. ఇక జగన్ కూడా కొత్త జిల్లాల అభ్యంతరాలేవీ ఒప్పుకోలేదు. పరిశీలించలేదు. కనీసం పరిష్కరిస్తాం అని కూడా చెప్పలేదు.