Begin typing your search above and press return to search.

కరోనాతో ఎంతమంది చనిపోయారో తెలుసా ?

By:  Tupaki Desk   |   9 March 2022 5:43 AM GMT
కరోనాతో ఎంతమంది చనిపోయారో తెలుసా ?
X
ప్రపంచవ్యాప్తంగా గడచిన మూడేళ్ళల్లో కరోనా వైరస్ కారణంగా ఎంతమంది చనిపోయారో ఊహించగలరా ? 60 లక్షల మందిని కరోనా వైరస్ పొట్టన పెట్టుకుంది. ఇప్పటికీ వైరస్ తీవ్రత కారణంగా ఎన్నో దేశాలు రకరకాల వేరియంట్ల కారణంగా అల్లాడిపోతున్నాయి. ఒకవైపు కరోనా వైరస్ ను లెక్కచేయకుండా జనాలు బయట తిరుగుతున్నది వాస్తవం. ఇదే సమయంలో కరోనా వైరస్ భూతానికి జనాలు బలైపోతున్నదీ వాస్తవమే.

ప్రపంచవ్యాప్తంగా కరోనాతో ఎంత మంది చనిపోయారనే విషయంలో ప్రపంచ ప్రఖ్యాతి చెందిన యూనివర్సిటీ జాన్స్ హాప్కిన్స్ యూనివర్సిటీ వివరాలు సేకరించింది. ఈ వివరాల ప్రకారమే గడచిన మూడేళ్ళల్లో 60 లక్షలమంది చనిపోయినట్లు బయటపడింది. బాధాకరం ఏమిటంటే గడచిన నాలుగు నెలల్లోనే 10 లక్షల కోవిడ్ మరణాలు నమోదవ్వడం. కోవిడ్ దెబ్బకు ఈ నెలలలోనే మొత్తం 75 లక్షల మందికి మూడు సార్లు కోవిడ్ టెస్టులు చేయించింది.

ఒకవైపు పరీక్షలు చేయిస్తోంది మరోవైపు బాధితులకు వైద్య సేవలు అందిస్తోంది. అయినా హాంకాంగ్ లో ప్రతిరోజు కేసుల ఉధృతి పెరిగిపోతోందట. దాంతో పెరిగిపోతున్న కేసులను ఎలా నియంత్రించాలో అర్ధంకాక హాంకాంగ్ ప్రభుత్వం తలపట్టుకుంటున్నదట. ప్రపంచం మొత్తం మీద అత్యధికంగా 10 లక్షలమంది మరణించింది 10 అమెరికాలోనే అని యూనివర్సిటీ ప్రకటించింది. మొత్తం మీద 45 కోట్ల మంది కరోనా బారిన పడినట్లు లెక్కలు తేలింది.

ఇదే సమయంలో ప్రపంచం మొత్తం మీద 1.25 కోట్ల నుంచి 2.35 కోట్ల మంది చనిపోయారని ప్రముఖ మీడియా ‘ది ఎకనామిస్ట్’ ప్రకటించింది. మరీ ఈ మీడియా చెప్పిన లెక్కలకు ఆధారం ఏమిటో తెలీదు. మనదేశంతో పాటు చైనా, హాంకాంగ్, అమెరికా, బ్రిటన్, బ్రెజిల్, జర్మనీ, ఇటలీ లాంటి చాలా దేశాల్లో ఇంకా కోవిడ్ ఆనవాళ్ళు బయటపడుతూనే ఉన్నాయి. ఇదే సమయంలో ఆఫ్రికా దేశాల్లో కొత్త కొత్త వేరియంట్లు బయటపడి యావత్ ప్రపంచాన్ని వణికించేస్తోంది.