Begin typing your search above and press return to search.
పవన్ను సీఎం చేసేందుకు బాబు సై అంటారా?
By: Tupaki Desk | 15 March 2022 7:29 AM GMTఆంధ్రప్రదేశ్‌లో వచ్చే ఎన్నికల్లో వైసీపీకి వ్యతిరేకంగా మిగతా పార్టీలన్నీ ఏకం కావాలి.. ఇవి జనసేన ఆవిర్భావ సభలో పవన్ కల్యాణ్ చెప్పిన మాటలు. సొంత ప్రయోజనాలను పక్కనపెట్టి రాష్ట్రం కోసం కలిసి వచ్చే పార్టీలతో పొత్తుల గురించి ఆలోచిస్తామని ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో ఈ వ్యాఖ్యలపై చర్చ మొదలైంది.
పవన్ వ్యాఖ్యల వెనక అంతరార్థం ఏమై ఉంటుందా? అని విశ్లేషకులు అంచనాలు వేయడం మొదలెట్టారు. చంద్రబాబు సీఎం రేసు నుంచి తప్పుకుని పవన్‌ను ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఒప్పుకుంటేనే జనసేన పొత్తులకు సిద్ధంగా ఉంటుందని ఆయన పరోక్షంగా హింట్ ఇచ్చారని అనుకుంటున్నారు.
ఆ ఓట్లు చీలొద్దని..
వచ్చే ఎన్నికల్లో వైసీపీ వ్యతిరేక ఓట్లు చీలితే జగన్‌ను ఓడించడం సాధ్యం కాదనే యోచనలో ప్రతిపక్షాలు ఉన్నాయి. అందుకే విపక్షాలన్నీ కలిసి ఒక్కతాటిపైకి వస్తే వ్యతిరేక ఓట్లు చీలే అవకాశం ఉండదు అప్పుడు వైసీపీని దెబ్బకొట్టొచ్చని పవన్ చెబుతున్నారు. ఏపీలో సీపీఐ, సీపీఎం, కాంగ్రెస్, టీడీపీ, బీజేపీ, జనసేన.. వైసీపీకి వ్యతిరేక పార్టీలుగా ఉన్నాయి. ఇప్పటికే జనసేన, బీజేపీ పొత్తులో ఉన్నాయి.
ఈ నేపథ్యంలో మిగతా పార్టీలతోనూ కలిసి పని చేసేందుకు జనసేన సిద్ధంగా ఉందని పవన్ అంటున్నారు. కానీ వ్యక్తిగత ప్రయోజనాలను పక్కనపెట్టి రాష్ట్ర భవిష్యత్ కోసం కలిసి వస్తేనే పొత్తులుంటాయని స్పష్టం చేశారు. మరోవైపు జనసేనకు ప్రజల్లో ఆదరణ పెరుగుతుందని, వచ్చే ఎన్నికల్లో మెరుగైన ఫలితాలు సాధిస్తామని పవన్ ఆశాభావం వ్యక్తం చేశారు.
బాబు ఏమంటారో?
ఇప్పటికే జనసేనతో పొత్తు కోసం టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే పొత్తు కోసం ప్రపోజల్ పెట్టామని పవన్ నుంచి రిప్లే రావడమే ఆలస్యం అన్నట్లు బాబు మాట్లాడారు. ఇప్పుడేమో రాష్ట్ర భవిష్యత్ కోసం పనిచేసే పార్టీలతోనే పొత్తు పెట్టుకుంటామని పవన్ స్పష్టం చేస్తున్నారు. అంటే సీఎం పదవిపై బాబు ఆశలు వదులుకుంటేనే టీడీపీతో పొత్తుకు జనసేన ఒకే అంటుందని పవన్ వ్యాఖ్యలు స్పష్టం చేస్తున్నాయని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
పవన్ స్పీచ్ అనంతరం వైసీపీ నేత అంబటి రాయుడు స్పందిస్తూ.. జనసేన క్యాడర్ మరోసారి బాబు కోసం పని చేసేందుకు సిద్ధంగా ఉండాలని ఎద్దేవా చేస్తూ ట్వీట్ చేశారు. అయితే పవన్ కోసం బాబు సీఎం రేసు నుంచి తప్పుకునే ప్రసక్తే ఉండదని మరో వర్గం విశ్లేషకులు అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు టీడీపీతో పొత్తుకు బీజేపీ ససేమిరా ఒప్పుకోదని ఆ పార్టీ నాయకులు ఇప్పటికే చాలా సార్లు చెప్పారు. ఈ నేపథ్యంలో రాబోయే ఎన్నికల నేపథ్యంలో పొత్తుల రాజకీయాలు ఎలాంటి మలుపు తీసుకుంటాయో చూడాలి.