Begin typing your search above and press return to search.

క్రిస్మస్ తాతకు ఏమైంది?

By:  Tupaki Desk   |   25 Dec 2022 10:54 AM GMT
క్రిస్మస్ తాతకు ఏమైంది?
X
క్రిస్టియన్లకు పండుగలు అతి తక్కువ. అందులోనూ క్రిస్మస్ అంటే ఇక ఇంటింటికే కాదు. క్రైస్తవ సంఘాలకే ఒక పండుగ అని చెప్పవచ్చు. హిందువుల్లోనూ, కొంత వరకు ముస్లింలలోనూ పండుగ అంటే ఇంటికే పరిమితమవుతుంది. కానీ క్రిస్మస్ పండుగ కుటుంబాలతో పాటు ఆయా క్రైస్తవ సంఘాలకూ పండుగే.. అయితే అసలు విషయం ఏమిటంటే! ఈ సారి క్రిస్మస్ తాత చాలా డీలాపడిపోయాడు. ఏపీలో పండుగను అంతగా ఎంజాయ్ చేయలేకపోయాడు. దీనికంతటికీ ఆర్థిక లోటే కారణమని తెలుస్తోంది. గత కరోనా ఆనవాళ్లు, భయాలు కూడా ఇంకా వెంటాడుతూనే ఉన్నాయి..

-మార్కెట్ వెల వెల...

క్రిస్టియన్లకు ఏకైక పెద్దపండుగ క్రిస్మస్ కాబట్టి ప్రతి ఒక్కరూ నూతన వస్త్రాలతో పాటు కావాల్సిన వస్తువుల షాపింగ్ తప్పకుండా ఉంటుంది. మరి ఈ ఏడాది ఏపీలోని పలు జిల్లాల్లో మార్కెట్ వెలవెలబోయింది. ప్రముఖ పట్టణాలైన విశాఖ, విజయవాడ, తిరుపతి, రాజమండ్రి, కాకినాడలోని దుకాణాల్లో, బేకరీల్లో కేక్ ల కొనుగోళ్లు ఒక రకంగా శూన్యమనే చెప్పాలి. కారణాలు ఏమైనప్పటికీ పండుగ సందడి మాత్రం ఏమీ లేదనే చెప్పుకోవచ్చు..

-వ్యాపారులు డీలా..

క్రిస్మస్ పండుగకు క్రిస్టియన్లు నూతన వస్త్రాలు కొనుగోలు చేయడం అనేది తప్పకుండా ఉంటుంది. ఎదుకంటే ఏడాదిలో వచ్చేది ఒకే ఒక పడుగ కాబట్టి కొనుగోళ్లు భారీగా సాగుతాయి. పట్టణాల్లో అయితే బిజినెస్ కోట్లలోనే ఉంటుంది. ఎన్నో ఆశలు పెట్టుకున్న వీరికి కిస్మస్ నిరాశనే మిగిల్చింది. వీరి రాకకోసం ఎదురు చూసిన వస్త్ర దుకాణాల వ్యాపారులకు నిరాశే మిగిలింది.. ఈ దుకాణాల్లో పని చేస్తూ జీవనం సాగించే వారిలోనూ ఉత్సాహం అనేది ఏమాత్రం కనిపించడం లేదు. కొనుగోళ్లు ఉంటే తమకూ కొంత ఏదో ఉపాధి లభిస్తుందనేది వాళ్ల ఆశ. అయితే ఆశలపై కూడా ఈ ఏడాది నీళ్లు చల్లినట్టయింది. ఇక టైలర్ల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనే లేదు. ఏదో ఉన్న కొద్దిపాటి పనితో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. సంవత్సరం పొడవునా వీళ్లకు అరకొరగానే పని సాగుతోంది.

ఇలాంటి పడుగల సమయాల్లోనూ పనులు లేకపోవడంతో మరింత డీలా పడుతున్నారు. అటు రెడీ మేడ్ వస్త్రాల కొనుగోళ్లు లేక వ్యాపారులు, ఇటు కుట్టు పనులు లేక టైలర్లు దిగాలు చెందుతున్నారు. కేవలం వాట్సాప్ గ్రూపుల్లో మాత్రం గ్రీటింగ్స్ చెప్పుకుని పండగను సరిపెట్టేశారు.