Begin typing your search above and press return to search.
రీల్ లో కనిపించే సీన్ రియల్ గా.. నాగేశ్వరరావు సుడే సుడి బాస్!
By: Tupaki Desk | 4 April 2022 4:28 AM GMTరాత్రికి రాత్రే హీరో అయిపోవటం.. అది పోలీసు డిపార్ట్ మెంట్ లో అంటే మామూలు విషయం కాదు. సినిమాల్లో మాత్రమే కనిపించే సీన్. అంతేకాదు.. తనిఖీ చేసిన అధికారిని ఆగమేఘాల మీద కీలక సీట్లో కూర్చోబెట్టటం అంత సులువుగా జరిగింది.
కానీ.. సంచలనంగా మారిన రాడిసన్ బ్లూ లోని పబ్ లో చోటు చేసుకున్న ఘటన.. దానికి సంబంధించి చోటు చేసుకున్న పరిణామాల్ని చూసినప్పుడు మాత్రం ఔరా అనుకోకుండా ఉండలేం.
పబ్ లో డ్రగ్స్ తీసుకున్నారన్న సమాచారంతో స్పెషల్ ఆపరేషన్ నిర్వహించటాన్ని అభినందించాల్సిందే. అందులో వేరే మాటే లేదు. కానీ.. ఈ తనిఖీల సందర్భంగా చోటు చేసుకున్న పరిణామాల్ని చూసినప్పుడు.. ఇదెక్కడి పోలీసింగ్? అన్న భావన కలుగక మానదు.
తనికీలు చేయాల్సిందే.. తప్పు చేస్తున్న వారి తాట తీయాల్సిందే. అదే సమయంలో తప్పు చేయని వారికి ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా చూడాల్సిన బాధ్యత పోలీసుల మీద ఉంటుంది కదా? ఇలాంటి తనిఖీల్ని మీడియా ఎలా అయితే సంచలనంగా మారుస్తుందో.. అదే విధంగా పోలీసులు కూడా దీన్ని హైలెట్ చేసిన తీరు చూస్తే.. ఇదెక్కడి పద్దతి అనిపించకమానదు.
ఇదంతా ఒక ఎత్తు అయితే.. పబ్ లో డ్రగ్స్ ఉన్నాయన్న సమాచారంతో దాడులు నిర్వహించటంలో కీలక భూమిక పోషించారు నార్గ్ జోన్ పోలీసు అధికారి కె. నాగేశ్వరరావు. పబ్ తనిఖీల అనంతరం.. ఇదో సంచలనంగా మారటం.. బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ సీఐగా వ్యవహరిస్తున్న అధికారిని సస్పెండ్ చేసి.. తనిఖీల్లో కీలక భూమిక పోషించిన కె. నాగేశ్వరరావును బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ ఇన్ స్పెక్టర్ గా నియమిస్తూ నిర్ణయం తీసుకున్నారు.
తనిఖీలు చేసిన గంటల వ్యవధిలోనే కీలక స్టేషన్ ఇన్ స్పెక్టర్ గా నియమించటం చూసినప్పుడు.. సుడి అంటే నాగేశ్వరరావుదే అన్న మాట పోలీసు శాఖకు చెందిన పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. ఎన్నో కేసుల్ని చేధించినా రాని అవకాశం.. ఒక్క పబ్ తనిఖీతో అవకాశం వచ్చిందన్న వ్యాఖ్య వినిపిస్తోంది.