Begin typing your search above and press return to search.
కూర్చున్న కొమ్మనే నరుక్కున్నారా ?
By: Tupaki Desk | 10 March 2022 3:30 PM GMTకూర్చున్న కొమ్మనే నరుక్కోవటమనే సామెత తెలుగులో చాల పాపులర్. పంజాబ్ లో కాంగ్రెస్ పార్టీ పరిస్దితికి పై సామెత చక్కగా అతికినట్లు సరిపోతుంది. అధికారంలో ఉన్న పార్టీ ఓడిపోవటమంటే చిన్న విషయంకాదు.
ఆమ్ ఆద్మీపార్టీ దెబ్బకు ఒకవైపు కాంగ్రెస్, మరోవైపు బీజేపీ పూర్తిగా దెబ్బతినేశాయి. ఆప్ కొట్టిన దెబ్బకు కాంగ్రెస్ కు అంతో ఇంతో ఊపిరి ఆడుతోంది కానీ బీజేపీకైతే కళ్ళు బైర్లు కమ్మేసి కళ్ళు తేలేసింది.
కడపటి వార్తలు అందేసరికి 117 సీట్ల అసెంబ్లలో ఆప్ 92 సీట్ల ఆధిక్యంలో ఉంది. కాంగ్రెస్ 17 సీట్లలో మాత్రమే ఆధిక్యంలో ఉంది. ఇంతటి ఘోర వైఫల్యానికి ప్రధాన కారణం నేతల మధ్య కీచులాటలనే చెప్పాలి.
థ్యాంక్స్ టు పీసీసీ అధ్యక్షుడు నవ్ జోత్ సింగ్ సిద్ధూ అనే చెప్పాలి. ఎందుకంటే పార్టీలోను ప్రభుత్వంలోను సిద్ధు పెట్టిన చిచ్చు అంతా ఇంతాకాదు. ముందుగా కెప్టెన్ అమరీందర్ సింగ్ ను సీఎంగా రాజీనామా చేసేంతవరకు ర్యాంగింగ్ చేశాడు.
సిద్ధూ పోరుపడలేక చివరకు కెప్టెన్ సీఎంగా రాజీనామా చేసేసి చివరకు పార్టీ కూడా వదిలేశాడు. తర్వాత సీఎం అయిన చరణ్ జీత్ సింగ్ చన్నీని కూడా సిద్ధూ ఎంతగా వేధించాలో అంతా వేధించాడు.
ముందు అధికారంలో ఉంటేనే ఎన్ని ఆటలైనా సాగుతుందన్న కనీసపు ఆలోచన కూడా లేకుండానే పార్టీలోని నేతలందరినీ కంపు కంపు చేసేశాడు. దాంతో కాంగ్రెస్ పార్టీలో జరుగుతున్న గొడవలతో జనాలు విసిగిపోయారు. అప్పటికే ఆప్ చాపకింద నీరులాగ బాగా చొచ్చుకుపోయింది.
కాంగ్రెస్ అంటే అసహ్యం వేసి ఓట్లు వేయలేక అదే సమయంలో బీజేపీకీ ఓట్లు వేయటం ఇష్టంలేక చివరకు అంతా కలిసి ఆప్ కు ఓట్లు గుద్దేశారు. ఢిల్లీ మోడల్ తో క్లీన్ ఇమేజి తెచ్చుకున్న కేజ్రీవాల్ అంటే జనాలకు గురికుదిరి, ఆప్ పంజాబ్ అద్యక్షుడు భగవంత్ మాన్ పై అభిమానంతో జనాలు ఆప్ కు మంచి విజయాన్ని అందిచారు. ఇకిపుడు సిద్ధూ తన ప్రత్యర్ధులతో తీరిగ్గా ఐదేళ్ళు కొట్టకుంటునే ఉండచ్చు.