Begin typing your search above and press return to search.
చింత చచ్చినా పులుపు చావదే!
By: Tupaki Desk | 11 March 2022 4:31 AM GMTచింత చచ్చినా పులుపు చావదన్న సామెతకు తగ్గట్లే కాంగ్రెస్ పార్టీ నేతల మాటలు ఉన్నాయని చెప్పాలి. ఐదు రాష్ట్రాల అసెంబ్లీలకు జరిగిన ఎన్నికల్లో ఉత్తరాఖండ్.. గోవా రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఉందని.. ఆ పార్టీ విజయం సాధిస్తుందన్న మాటను కాంగ్రెస్ నేతలు చాలా ధీమాను వ్యక్తం చేశారు కూడా. గోవాలో అయితే.. భారీ అంచనాలు వేసుకొని.. ఎన్నికల ఫలితాలకు ముందే రిసార్టు రాజకీయాల్ని షురూచేసిన ఆ పార్టీకి.. ఇప్పుడు వచ్చిన ఫలితాల్ని చూసుకున్న తర్వాత తలకొట్టేసినంత పరిస్థితి.
గోవా రాష్ట్రంలో మొత్తం 40 అసెంబ్లీ స్థానాలు ఉంటే గత ఎన్నికల్లో 13 స్థానాల్లో మాత్రమే విజయం సాధించిన బీజేపీ.. ఈసారి ఏకంగా 20స్థానాల్లో విజయం సాధించటం గమనార్హం. 2017లో జరిగిన ఎన్నికల్లో 13 సీట్లకు పరిమితమైనప్పటికీ.. అప్పటి కాంగ్రెస్ చేతకానితనంతో అధికారాన్ని సొంతం చేసుకోవటంతో వేసిన తప్పటడుగులు.. ఆ రాష్ట్రంలో అధికారాన్ని చేజార్చుకుంది.
తాజా ఎన్నికల ఫలితాలు వెలువడిన వెంటనే.. అలాంటి తప్పులు జరగకూడదన్న ఉద్దేశంతో.. పోలింగ్ పూర్తై.. ఫలితాలు వెల్లడి కావటానికి రెండు.. మూడురోజుల ముందు నుంచే పార్టీ అభ్యర్థులను రిసార్టులకు తరలించిన వైనం అందరిని ఆశ్చర్యానికి గురి చేసింది.
సాధారణంగా ఎన్నికల ఫలితాలు వెలువడి.. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం ఉన్నప్పటికీ.. వేరే పార్టీ ఆకర్ష్ దెబ్బకు షాకులు తగిలే పరిస్థితి లేకుండా ఉండటం కోసం రిసార్టులకు ఎమ్మెల్యేలను తరలించటం తెలిసిందే. గోవా ఎపిసోడ్ లో.. ఈసారి ఎన్నికల్లో తాము అధికారాన్ని చేపట్టే పరిస్థితి ఉంటుందని బలంగా భావించిన కాంగ్రెస్.. తమ పార్టీకి చెందిన ఇద్దరు సీనియర్ నేతల్ని గోవాకు పంపి.. పార్టీ అభ్యర్థులను రిసార్టుకు తరలించారు.
ఇన్నిజాగ్రత్తలు తీసుకున్నప్పటికీ పార్టీకి ఓటర్లు ఇచ్చిన షాకు మామూలుగా లేదు. 2017లో ఆ పార్టీకి మొత్తం 20 స్థానాల్లో విజయం సాధిస్తే.. ఈసారి కేవలం 12 స్థానాలకే పరిమితం కావాల్సి వచ్చింది. దీంతో ముందే కూసిన కోయిల మాదిరి కాంగ్రెస్ పరిస్థితి మారింది. అధికారంలోకి రావటం ఖాయమన్నట్లుగా బిల్డప్ ఇచ్చి.. హడావుడి చేసినా.. అలాంటిదేమీ లేకపోగా.. విజయానికి చాలా దూరంలోనే నిలిచిపోయిన వేళ.. ఆచితూచి మాట్లాడాల్సిన అవసరం ఉంది.
కానీ.. ఆ విషయాన్నికాంగ్రెస్ పార్టీ సీనియర్లు కూడా గుర్తించినట్లుగా కనిపించటం లేదు. కాంగ్రెస్ సీనియర్ నేత చిదంబరం మాటల్నే తీసుకుంటే.. ఆయన తమ పార్టీ ఓటమిని అంగీకరిస్తూనే.. బీజేపీకి పెద్దగా ఓట్లు రావటం లేదన్న మాటల్ని మాట్లాడారు. బీజేపీకి ఓట్లు రాకుంటే.. వారికొచ్చిన సీట్లు.. రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుండటాన్ని ఏమనాలి? ఇలాంటి మాటల్ని విన్నప్పుడు ఎన్నికల్లో ఓడినప్పటికీ ఇంకా బుద్ది రాలేదన్న భావన కలుగక మానదు. ఇన్ని ఎదురుదెబ్బలు తిన్న తర్వాత కూడా కాంగ్రెస్ లో మార్పు రాదా? ఆ పార్టీ మారదా? అన్నది అసలు ప్రశ్న.