Begin typing your search above and press return to search.
ప్రపంచ దేశాల్లో భారీగా కేసులు.. కేంద్రం కీలక నిర్ణయం
By: Tupaki Desk | 18 March 2022 7:28 AM GMTప్రపంచం వ్యాప్తంగా మరో సారి కొవిడ్ కేసులు భారీగా పెరుగుతున్నాయి. ఇప్పటికే కోవిడ్ వేరియంట్ అయిన ఒమిక్రాన్ తో వేగంగా విస్తరించిన వైరస్ మరోసారి తన ప్రభావాన్ని చూపిస్తుంది. ఈ క్రమంలోనే పక్క దేశమైన చైనా లో వైరస్ కేసులు విపరీతంగా నమోదు అవుతున్నాయి. కేవలం చైనాలో మాత్రమే కాకుండా పక్కనున్న హాంకాంగ్ లో కూడా భారీగా కేసులు నమోదు అవుతున్నట్లు అధికారులు చెబుతున్నారు.
గతంలో ఎన్నడూ లేని విధంగా కేసుల సంఖ్య ఒక్క సారిగా పెరిగినట్లు చైనా ఆరోగ్య శాఖ ఇప్పటికే తెలిపింది. ఈ కారణంగా చాలా ప్రావిన్స్ లో లాక్ డౌన్ విధించినట్లు పేర్కొంది. ఇదిలా ఉంటే కరోనా కు పుట్టినిల్లు అయిన చైనాలో వైరస్ మరోసారి ఓ రేంజ్ లో వ్యాప్తి చెందడం పై పక్కన ఉన్న దేశాల్లో కంగారు మొదలైంది. ఇప్పటికే వివిధ దశల్లో వివిధ వేరియంట్ల తో భారీగానే ప్రాణాలు తీసిన కోవిడ్ మరోసారి ప్రపంచ దేశాల పై విరుచుకు పడితే పరిస్థితి చేయి దాటే అవకాశం లేకపోలేదు అని అభిప్రాయపడుతున్నాయి.
ఇదిలా ఉంటే ఒక వైపు మన దేశంలో కొవిడ్ కేసులు తగ్గుముఖం పట్టిన గానీ చైనాలో కేసులు పెరగడాన్ని కేంద్ర ఆరోగ్య శాఖ చాలా సీరియస్ గా పరిగణిస్తుంది. చివరిగా విజృంభించిన ఒమిక్రాన్ తోనే కోవిడ్ ముప్పు పోయింది అని అందరూ భావించినా... చైనాలో పక్కన ఉన్న దేశాల్లో కొవిడ్ కేసులు పెరగడం ఆందోళన కలిగిస్తుంది. దీనికి తోడు అతి త్వరలోనే కరోనా నాలుగో వేవ్ రానుంది అనే వార్తలు ఇటు ప్రజల్లో, అటు వైద్య ఆరోగ్య శాఖ అధికారుల్లో ఇద్దరిలోనూ వణుకు పుట్టిస్తున్నాయి. వస్తుందా రాదా అనే దానిపై స్పష్టత లేకపోయినా కానీ సూచనలు ఎక్కువ అవకాశాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. త్వరలోనే కరోనా మరోసారి కరాళ నృత్యం చేస్తుందని అంటున్నారు.
ఇతర దేశాల్లో పెరుగుతున్న కేసుల కారణంగా కేంద్ర అలర్ట్ అయ్యింది. ప్రస్తుతం దేశంలో ఉన్న పరిస్థితులపై కేంద్ర ఆరోగ్య శాఖ అధికారులు దృష్టి సారించారు. దేశంలో కూడా వైరస్ కేసులు పెరిగితే నాలుగో వేవ్ వస్తుందని భావిస్తున్నారు. ఇందుకు ముందస్తు జాగ్రత్తలు పాటించాల్సిన అవసరం ఉందని అంటున్నారు. ఈ మేరకు కొన్ని రాష్ట్రాల్లో కేంద్ర ప్రభుత్వం హై అలర్ట్ ప్రకటించింది. ఒమిక్రాన్ కేసులు తగ్గు ముఖం పట్టిన తర్వాత చాలా ప్రాంతాల్లో పాఠశాలలు ఓపెన్ చేయడం, కోవిడ్ ప్రోటోకాల్ను పాటించడంపై మౌఖిక ఉత్తర్వులు జారీ చేసింది. దీనిలో భాగంగా కేంద్ర మంత్రి మన్ సుఖ్ మాండవీయ ఆరోగ్య శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలను కచ్చితంగా అమలు చేయాలని అధికారులకు సూచించారు.
అంతేగాకుండా వైరస్ వ్యాప్తి, కేసుల వృద్ధి, జీనోమ్ సీక్వెన్సీ, వంటి మూడు అంశాలపై దృష్టి పెట్టాలని అధికారులకు సూచించారు. దీనితో పాటు కరోనా వైరస్ వ్యాప్తి పెరిగిపోతున్న నేపథ్యంలో తగు చర్యలు చేపట్టేందుకు తీసుకోవాల్సి అన్ని చర్యలను ఎప్పటికప్పుడు చేపట్టాలని కోరారు. మరో వైపు వైరస్ వ్యాప్తి కారణం అయ్యే అంతర్జాతీయ ప్రయాణాలపై కూడా నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ఇప్పటికే ఉన్న నిషేధాన్ని కొనసాగించాలా లేదా అనే విషయంపై కూడా త్వరలోనే ప్రకటించే అవకాశం ఉందని పేర్కొన్నారు.
భారత్ లో శుక్రవారం కొత్తగా 2,528 మందిలో వైరస్ నిర్ధారణ అయ్యింది. గడిచిన 24 గంటల్లో 149 మందికి పైగా వైరస్ కు బలి అయ్యారు . నాలుగు వేల మంది వైరస్ ను జయించినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు. 5,16,281 మంది మొదటి మూడు వేవ్ ల నుంచి ఇప్పటి వరకు చనిపోయినట్లు గణాంకాలు చెబుతున్నాయి.