Begin typing your search above and press return to search.
టీడీపీ స్పీక్స్ : ఏపీ మద్యంలో సైనైడ్ ఆనవాళ్లు ?
By: Tupaki Desk | 23 March 2022 4:29 AM GMTరాష్ట్రంలో మద్యం ఏరులై ప్రవహిస్తోంది. పక్క రాష్ట్రం నుంచి వచ్చే నాటు సారా ను అడ్డుకుంటే బాగుండు. ఇదే సమయంలో కొన్ని పరిశోధనలు ఇక్కడే తయారయి, ఇక్కడే అమ్మడవుతున్న మద్యం బ్రాండ్ల పై దృష్టి సారించగా.. అవన్నీ స్లో పాయిజన్లు అని తేలింది. అంటే జీవన ప్రమాణాలను తగ్గించే విధంగా వీటిలో హానికర లేదా ప్రాణాంతక విష తుల్య పదార్థాలు లేదా ఆనవాళ్లు ఉన్నాయని చెన్నయ్ వర్గాలు తేల్చాయి. పొరుగింటి పరిశీలనలో లేదా పరిశోధనలో తేలిన విషయాలు చాలా విస్తుబోయే విధంగా ఉన్నాయి. అయినా ఈ విషయమై అసెంబ్లీ సాక్షిగా తాము మాట్లాడాలంటే ఎన్నో అవమానాలు ఎదుర్కోవాల్సి వస్తోందని టీడీపీ ఆవేదన చెందుతోంది.
హానికర రసాయనాల కారణంగానే రాష్ట్రంలో సారా మరణాలు విపరీతంగా నమోదవుతున్నాయి అన్నది పరిశోధనలు చెబుతున్న విషయం. కానీ పోస్ట్ కోవిడ్ ఎఫెక్ట్ పేరిట సహజ మరణాలు ఇవి అని చెప్పడం సమంజసంగా లేదు. వీటిపై మరోసారి దృష్టి సారిస్తే నిజానిజాలు వెలుగులోకి వస్తాయి. రాష్ట్రంలో అమ్ముడవుతున్న మద్యం రకాలను కొన్నింటిని చెన్నయ్ ఎస్‌జీఎస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ ల్యాబ్‌లలో పరీక్షించగా విస్తుబోయే నిజాలు వెలుగు చూశాయి. రాష్ట్రంలో అమ్ముడవుతున్న ఓల్డ్ టైమర్, ఛాంపియన్, రాయల్ సింహ, గ్రీన్ ఛాయిస్, సెలబ్రిటీ విస్కీ- బ్రాందీ అన్నవి స్లో పాయిజన్ తో సమానమని పరిశోధనలు తేల్చాయి. ఇవన్నీ ఓ సామాజిక కార్యకర్త చొరవ కారణంగా వెలుగు చూసిన నమ్మలేని నిజాలు..అని చెబుతోంది టీడీపీ.
మద్యపాన నిషేధం అంటూ అప్పుడెప్పుడో వైసీపీ ఒక స్టేట్మెంట్ ఇచ్చింది. పాద యాత్రలో జగన్ ఇచ్చిన హామీ ఎందుకనో ఈ నాటికీ అమలు కాలేదు కానీ వైసీపీ పెద్దలు పెద్దిరెడ్డి మిధున్ రెడ్డి రూపొందింపజేస్తున్న మద్యంలో హానికర రసాయనాల ఆనవాళ్లు ఉన్నాయని టీడీపీ గగ్గోలు పెడుతోంది. దీనిపై న్యాయ విచారణకు పట్టుబడుతోంది. ఇప్పటికే ఈ విషయాన్ని సభ దృష్టికి తీసుకుని రావాలని పదే పదే ప్రయత్నించి సస్పెన్షన్ కు గురై, నిరాశతో వెనుదిరిగింది.
విషంతో సమానమైన సైనైడ్ కెమికల్స్ ఉన్న బ్రాండ్లు (ఓల్డ్ టైమర్, చాంపియన్, రాయల్‌సింహ, గ్రీన్ చాయిస్, సెలబ్రిటీ) యథేచ్ఛగా మార్కెట్లో అమ్ముడవుతున్నాయని కింజరాపు యువ సేన పేరిట సోషల్ మీడియాలో ఓ పోస్టు వైరల్ అవుతోంది.
ఏపీలో లిక్కర్ అమ్మకాలు తరుచూ వివాదాలకు తావిస్తున్నాయి. నాణ్యమైన మద్యం రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడా దొరకడం లేదు అన్న వాదనను తరుచూ వింటూనే ఉన్నాం. ఇందుకు ఆధారాలు కొన్ని టీడీపీ మీడియా ముంగిటకు తీసుకువచ్చింది. గతంలో కన్నా మంచి నాణ్యత ఉన్న మందు అన్నది లభ్యం కాక చాలా మంది జీవన ప్రమాణాలే పోతున్నాయి అని ఇదొక ఆందోళనకర రీతి అని టీడీపీ అంటోంది. తమ దగ్గర శాస్త్ర సంబంధ పరిశోధనలు తరువాత వాటి ఫలితాలు ఇవన్నీ కూడా సేకరించి ఉన్నాయని కనుక వైసీపీ అబద్ధం చెబితే నమ్మేందుకు ఇక్కడ ఎవ్వరూ సిద్ధంగా లేరని అంటోంది.
ఏపీ లో కొనుగోలు చేసే విస్కీ, బ్రాందీలలో సైనైడ్ ఉందని ఇది ఆందోళనకర స్థాయిలో ఉందని అంటోంది. మరో ముఖ్య విషయం ఏంటంటే ఎక్స్‌టర్నల్ యూజ్ మెడిసిన్స్ కోసం వాడే కెమికల్స్‌తోనే జగన్ లిక్కర్ తయారు చేస్తున్నారన్నది టీడీపీ ప్రధాన ఆరోపణ. ఇది ఎంతో ప్రమాదకరం అని అయినా కూడా అస్సలు అధికార పార్టీ వెనక్కు తగ్గడం లేదని అంటోంది. తాము ఉద్యమాలు చేస్తున్నా వాటిని వినిపించుకునే లేదా పట్టించుకునే స్థాయిలో ఇవాళ వైసీపీ లేదని, త్వరలో ఏపీ మద్యం పాలసీ పై మరియు అమ్మకాలు తదనంతర పరిణామాలపై మరింత తీవ్ర స్థాయిలో పోరాడేందుకు తాము సిద్ధం అవుతున్నామని చెబుతోంది టీడీపీ.