Begin typing your search above and press return to search.
భార్య మటన్ వండలేదని పోలీసులకు ఫోన్..
By: Tupaki Desk | 21 March 2022 7:31 AM GMTహోలీ పూట భార్య మటన్ వండలేదని పోలీసులకు ఫిర్యాదు చేశాడో భర్త. నల్గొండ జిల్లాలో జరిగిన ఈ వింత ఘటన వైరల్ అయ్యింది. భార్య మటన్ వండమంటే నిరాకరించిందనే కోపంతో ఓ భర్త ఊగిపోయాడు. ఆవేశానికి గురయ్యాడు. వెంటనే జేబులో ఉన్న ఫోన్ తీసి డయల్ 100కు కాల్ చేశాడు. అతడి ఫిర్యాదు విన్న పోలీసులు సీరియస్ అయ్యారు.
నల్గొండ జిల్లా కనగల్ మండలం చెర్ల గౌరారం గ్రామానికి చెందిన నవీన్ హోలీ రోజూ మద్యం తాగి ఇంటికి వచ్చాడు. భార్యను మటన్ వండాలని కోరాడు. అయితే అందుకు ఆమె నిరాకరించింది. అప్పటికే మద్యం మత్తులో ఉన్న నవీన్ ఊగిపోయాడు. అవమానంగా ఫీల్ అయ్యాడు.
జేబులో ఉన్న ఫోన్ తీసి డయల్ 100కు ఫోన్ చేశాడు. ఫిర్యాదు చేశాడు. ఇది సిల్లీ విషయం అని మొదట పోలీసులు లైట్ తీసుకున్నారు.
కానీ నవీన్ వదలకుండా ఆరు సార్లు పోలీస్ కంట్రోల్ రూంకు ఫోన్ చేసి విసిగించాడు. దీంతో నవీన్ కు బుద్దిచెప్పాలని పోలీసులు డిసైడ్ అయ్యారు. పెట్రోలింగ్ పోలీసులు అతడి ఇంటికి చేరుకున్నారు. మద్యం మత్తులో ఉన్న నవీన్ నుచూసి వెనుదిరిగారు.
మరుసటి రోజు నవీన్ ఇంటికి వచ్చి అతడిని అదుపులోకి తీసుకున్నారు. అతడిపై కేసులు నమోదు చేశారు.
ఆపదలో, అత్యవసర పరిస్థితుల్లో ప్రజలను ఆదుకునేందుకు ఉద్దేశించిన డయల్ 100 సౌకర్యాన్ని దుర్వినియోగం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరిస్తున్నారు. సంబంధం లేని విషయాలపై డయల్ 100కు ఫోన్ చేసి విలువైన సమాయాన్ని వృథా చేయవద్దని కోరుతున్నారు. చేస్తే కేసులు పెడుతామని హెచ్చరిస్తున్నారు.