Begin typing your search above and press return to search.

అఖిలేష్ ఓట‌మి.. బాబు త‌ర్జ‌న భ‌ర్జ‌న‌...!

By:  Tupaki Desk   |   11 March 2022 6:54 AM GMT
అఖిలేష్ ఓట‌మి.. బాబు త‌ర్జ‌న భ‌ర్జ‌న‌...!
X
యూపీలో జ‌రిగిన ఎన్నిక‌ల ఫ‌లితం.. ఏపీలో ప్ర‌భావం చూపుతుందా? అక్క‌డ వ‌చ్చిన రిజ‌ల్ట్ ఇక్క‌డ ప్ర‌తిప‌క్ష టీడీపీలో చ‌ర్చ‌గా మారిందా? అంటే.. ఔన‌నే అంటున్నారు ప‌రిశీల‌కులు. వాస్త‌వానికి ఐదు రాష్ట్రాల ఎన్నిక‌ల్లో నాలుగు చోట్ల అధికార పార్టీ బీజేపీకే.. ప్ర‌జ‌లు జై కొట్టారు. అంటే.. అధికార పార్టీవైపే.. ప్ర‌జ‌లు మొగ్గు చూపిం చారు. నిజానికి ఆయా రాష్ట్రాల్లో ప్ర‌జ‌ల‌కు ఏపీలో జ‌రుగుతున్న విధంగా సంక్షేమ కార్య‌క్ర‌మాలు అమ‌లు కావ డం లేదు. పైగా.. ప్ర‌జ‌ల చేతికి డ‌బ్బులు కూడా ఇవ్వ‌డం లేదు. సో.. ఇవ‌న్నీ చూస్తే.. అక్క‌డ ఉన్న ప్ర‌జాద‌రణ క‌న్నా.. ఏపీలో అధికార పార్టీకి ఎక్కువ‌గా ఉంటుంద‌ని అంచ‌నాలు వ‌స్తున్నాయి.

అదే స‌మ‌యంలో ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షంగా యూపీలో ఉన్న అఖిలేష్ యాద‌వ్‌కు ప్ర‌జ‌లు గ‌ట్టి ఎదురు దెబ్బ కొట్టారు. దీనికి ప్ర‌ధాన కార‌ణం.. ఎన్నిక‌ల‌కు ముందు.. అఖిలేష్ వివిధ పార్టీల‌తో పొత్తులు పెట్టుకోవ‌డం.. మ‌ళ్లీ విడిపోవ‌డం.. ఇలా ఆయ‌న ప్ర‌యాణంలో ఒక క్లారిటీ లేకుండా పోయింది. దీంతో పాటు యూపీలో 102 నియోజ‌క‌వ‌ర్గాల్లో పోటీ చేసిన ఎంఐఎం వ‌ల్లే ఎస్పీ ఎక్కువ స్థానాల్లో ఓడిపోయింది. ఇది కూడా అఖిలేష్ ముఖ్య‌మంత్రి కాకుండా ఉండ‌డానికి ప్ర‌ధాన కార‌ణ‌మైంది.

క‌ట్ చేస్తే.. ఇప్పుడు.. ఇదే త‌ర‌హాలో ఏపీలోని టీడీపీ కూడా అనుస‌రిస్తోంద‌నే వాద‌న వినిపిస్తోంది. అంటే... పొత్తులు కావాల్సి వ‌చ్చిన ప్పుడు.. ఆ పార్టీముందుగానే.. ఏదో ఒక పార్టీతో ముందుకు సాగాలి. ఎన్నిక‌ల‌కు ముందు పొత్తు పెట్టుకోవడం..త‌ర్వాత విడిపోవడం వంటివి ప్ర‌జ‌లు స‌హిస్తారా ? అనేది ప్ర‌శ్న‌.

చంద్ర‌బాబు పొత్తుల విష‌యంలో అవ‌స‌రం ఉన్న‌ప్పుడు ఒక‌లా.. లేన‌ప్పుడు మ‌రోలా వ్య‌వ‌హ‌రిస్తూ ఉంటార‌న్న‌ది తెలిసిందే. యూపీలో జ‌రిగింది ఇదే! సో.. ఎట్టి ప‌రిస్థితిలో టీడీపీ అనుస‌రించే పొత్తు వ్యూహాల్లో క్లారిటీ లేక పోతే.. క‌ష్ట‌మ నే భావన వ్య‌క్తం అవుతోంది.

దీనిని బ‌ట్టే.. ప్ర‌జ‌ల‌నిర్ణ‌యం ఉంటుందని అంటున్నారు. అదేస‌మ‌యంలో అధికార పార్టీపై వ్య‌తిరేక‌త లేక‌పోవ‌డం కూడా.. టీడీపీకి ఇబ్బందిగా మారింద‌ని చెబుతున్నారు ప‌రిశీల‌కు లు.

ఈ నేప‌థ్యంలో టీడీపీ అధినేత ఇప్పుడే స‌రైన నిర్ణ‌యం తీసుకుని.. ప్ర‌జ‌ల్లోకి వెళ్తే.. ఖ‌చ్చితంగా ఆయ‌నకు ప్ర‌జ‌లు జై కొట్టే అవ‌కాశం ఉంటుంద‌ని.. లేక‌పోతే... ఎన్నిక‌ల‌కు ముందు పొత్తు పెట్టుకుని సాగితే.. ప్ర‌జ‌ల్లో వ్య‌తిరేక‌త పెరిగే అవ‌కాశం ఉంటుంద‌ని ప‌రిశీల‌కులు అంచ‌నా వేస్తున్నారు.