Begin typing your search above and press return to search.

ఫిరాయింపు దారులకు ఇక్కడా ఎదురుదెబ్బేనా ?

By:  Tupaki Desk   |   12 March 2022 8:33 AM GMT
ఫిరాయింపు దారులకు ఇక్కడా ఎదురుదెబ్బేనా ?
X
అన్నీ పార్టీలకు ఫిరాయింపు దారుల సమస్య పెరిగిపోతోంది. ఈ రాష్ట్రం ఆ రాష్ట్రమని లేకుండా తమ వ్యక్తిగత లబ్ది మాత్రమే ముఖ్యమన్న పద్దతిలో కొందరు నేతలు చివరి నిముషంలో ఇతర పార్టీల్లోకి ఫిరాయిస్తున్న విషయం అందరికీ తెలిసిందే. పార్టీలు కూడా తమ అవసరాలను దృష్టిలో పెట్టుకుని ఫిరాయింపుదారులను ప్రోత్సహించి టికెట్లిస్తున్నారు. అయితే వీళ్ళల్లో ఎంతమంది గెలుస్తున్నారు ?

తాజా ఎన్నికల్లో యూపీలో తామున్న పార్టీల నుండి ఇతర పార్టీల్లోకి ఫిరాయించిన ఎంఎల్ఏల సంఖ్య 21. ఇలా ఫిరాయించిన మంత్రులు, ఎంఎల్ఏలు 21 మంది పోటీ చేశారు. అయితే వీరిలో గెలిచింది కేవలం నలుగురు మాత్రమే. అంటే మిగిలిన 17 మంది ఓడిపోయారు. అది కూడా మరీ అన్యాయంగా ఓడిపోయారు. ఇలా ఓడిపోయిన వారు అన్ని పార్టీల్లోనూ ఉన్నారు. అంటే ఫిరాయింపుదారులను జనాలు యాక్సెప్ట్ చేయటం లేదనే విషయం మరోసారి నిర్ధారణైంది.

ఇంతకుముందు పశ్చిమబెంగాల్లో కూడా ఇదే పరిస్దితిని చూశాము. అధికార తృణమూల్ కాంగ్రెస్ నుంచి మంత్రులు, ఎంఎల్ఏలు కలిపి 31 మంది బీజేపీలోకి ఫిరాయించారు. తమ పదవులకు రాజీనామాలు చేయకుండానే వీరంతా బీజేపీలో చేరారు.

ఎన్నికల్లో చాలామంది టికెట్లు తీసుకుని బీజేపీ అభ్యర్ధులుగా పోటీ చేశారు. అయితే అలా పోటీ చేసిన వారిలో చాలా మంది ఓడిపోయారు. అంటే బెంగాల్లో కూడా ఫిరాయింపుదారులను జనాలు తిరస్కరించారు.

అంతకుముందు ఏపీలో కూడా ఇలాగే జరిగింది. వైసీపీ తరపున గెలిచిన 23 మంది ఎంఎల్ఏలు తెలుగుదేశం పార్టీలోకి ఫిరాయించారు. వీరిలో 18 మంది టికెట్లు తీసుకుని పోటీ చేశారు. అయితే వీరిలో గెలిచింది కేవలం ఒకే ఒక్కరు మాత్రమే.

అంటే మిగిలిన 17 మందిని జనాలు తిరస్కరించారని అర్ధమైపోతోంది. మధ్యలో తెలంగాణలో కూడా 2014లో టీడీపీ నుంచి గెలిచిన కొందరు టీఆర్ఎస్ లోకి ఫిరాయించారు. అయితే వీరిలో అత్యధికులు గెలిచారు. మొత్తానికి ఫిరాయింపులను చాలా చోట్ల జనాలు యాక్సెప్ట్ చేయడం లేదని అర్థమైపోతోంది.