Begin typing your search above and press return to search.

కూన పై కఠిన చర్యలు తప్పవా ?

By:  Tupaki Desk   |   18 March 2022 8:26 AM GMT
కూన పై కఠిన చర్యలు తప్పవా ?
X
తెలుగుదేశం పార్టీ మాజీ ఎంఎల్ఏ కూన రవికుమార్ పై కఠిన చర్యలు తప్పేట్లు లేదు. అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం పై నోటికొచ్చినట్లు మాట్లాడిన ఫలితం ఇపుడు ప్రివిలేజ్ కమిటీ విచారణ రూపంలో కూన మెడకు చుట్టుకుంది. మామూలుగానే కూనకు నోరు చాలా ఎక్కువ. ఎవరిని పడితే వాళ్ళని కొట్టడానికి రెడీ అయిపోతారు. కాబట్టి సహజంగానే బూతులు వచ్చేస్తుంటాయి. ప్రభుత్వ యంత్రాంగంపై కూన ఎన్నిసార్లు బూతులు తిడుతు కొట్టడానికి వెళ్ళారో సోషల్ మీడియాలో ఉన్న వీడియోలు చూస్తే తెలిసిపోతుంది.

అదే పద్దతిలో స్పీకర్ పైన కూడా నోటికొచ్చినట్లు మాట్లాడారు. దాంతో స్పీకర్ కూనపై అసెంబ్లీ ప్రివిలేజ్ కమిటికి ఫిర్యాదు చేశారు. ఆ కమిటి ఇప్పటికి రెండుసార్లు విచారణ హాజరుకావాలని నోటీసులిస్తే లెక్కచేయలేదు. ఫైనల్ గా మూడోసారి ఇచ్చిన నోటీసుకు గురువారం హాజరయ్యారు. స్పీకర్ ను ఉద్దేశించి కూన చేసిన వ్యాఖ్యల వీడియో క్లిప్పింగులను, పేపర్ కట్టింగులను కమిటి చూపించి వివరణ అడిగింది.

అసెంబ్లీలో ఉంటేనే తాను స్పీకర్ ను అని బయటకొస్తే తాను వైసీపీ ఎంఎల్ఏనే అని గతంలో తమ్మినేని చేసిన ప్రకటనను కూన కమిటికి చూపించారు. తాను తమ్మినేని వ్యక్తిగతంగానే విమర్శించాను కానీ స్పీకర్ గా ఏమీ మాట్లాడలేదన్నారు.

కూన వాదన విన్న కమిటీ సభ్యులు మాజీ ఎంఎల్ఏ చాలా అతితెలివి చూపిస్తున్నట్లు నిర్ధారణకు వచ్చారు. దాంతో కూనతో మాట్లాడి లాభం లేదని అర్థం చేసుకుని పంపేశారు. తర్వాత కూనపై జైలుకు పంపాలనేంత కఠిన చర్యలకు సిఫారసు చేయాలని కూడా కమిటీ డిసైడ్ అయ్యింది.

కమిటీ తన సిఫారసుని వెంటనే స్పీకర్ కు అందచేయబోతోంది. కమిటీ ఇచ్చే సిఫారసులను స్పీకర్ అసెంబ్లీలో చర్చకు పెడతారు. అప్పుడు ఏమి చేయాలో సభే డిసైడ్ చేస్తుంది. ఒకసారి అసెంబ్లీ నిర్ణయం తీసుకున్నదంటే దానిపై కోర్టులు కూడా జోక్యం చేసుకునే అవకాశం లేదని కమిటి సభ్యులంటున్నారు.

ఇదే విధంగా స్టేట్ ఎలక్షన్ కమీషన్ మాజీ కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ వ్యవహారంపై ఈనెలాఖరులో సమావేశమై నిర్ణయం తీసుకోవాలని కమిటీ అనుకున్నది.