Begin typing your search above and press return to search.

హైదరాబాద్ లో ఇళ్లు అమ్ముడుపోని ప్రాంతాలివే!

By:  Tupaki Desk   |   11 March 2022 11:30 PM GMT
హైదరాబాద్ లో ఇళ్లు అమ్ముడుపోని ప్రాంతాలివే!
X
సొంతిళ్లు అనేది అందరి కల. దాన్ని నెరవేర్చుకునేందుకు చాలా మంది కష్టపడుతుంటారు. అయితే కరోనా వైరస్ మహమ్మారి ప్రభావం.. రిజిస్ట్రేషన్ ఖర్చులు పెరగడం వంటి కారణాలతో హైదరాబాద్ లో రిజిస్ట్రేషన్ల సంఖ్య భారీగా తగ్గిందని నైట్ ఫ్రాంక్ ఇండియా విశ్లేషించింది. హైదరాబాద్ లో ఇండ్ల కొనుగోలు బాగా తగ్గిందని లెక్కలు చెబుతున్నాయి.

హైదరాబాద్ లో మంత్లీ రెసిడెన్షియల్ ప్రాపర్టీ రిజిస్ట్రేషన్లు 2022 ఫిబ్రవరిలో 5146 యూనిట్లు మాత్రమే. రూ.2722 కోట్ల విలువైన రిజిస్ట్రేషన్లు జరిగాయి. 2022 ఫిబ్రవరి 1న రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెరిగిన సంగతి తెలిసిందే. దీంతో ఇయర్ ఆన్ ఇయర్ లెక్కన చూస్తే ఇళ్ల అమ్మకాలు మందగించాయని.. అపార్ట్ మెంట్ల అమ్మకాల రిజిస్ట్రేషన్ల సంఖ్య ఈనెలలో 25 శాతం తగ్గనున్నాయని నైట్ ఫ్రాంక్ ఇండియా విశ్లేషణలో తేలింది. హైదరాబాద్ రెసిడెన్షియల్ మార్కెట్ లో హైదరాబాద్, మేడ్చల్, మల్కాజ్ గిరి, రంగారెడ్డి, సంగారెడ్డి జిల్లాలు ఉన్నాయి.

పెరిగిన రిజిస్ట్రేషన్ ఖర్చులు రూ.25 లక్షల లోపు కేటగిరిపై ఎక్కువ ప్రభావం చూపించింది. ఈ కేటగిరిలో 2021 ఫిబ్రవరిలో 2888 యూనిట్స్ రిజిస్టర్ అయితే 2022 ఫిబ్రవరిలో కేవలం 844 యూనిట్లు మాత్రమే రిజిస్టర్ అయ్యాయి. ఇక 50 లక్షలలోపు కేటగిరిలో 2021 ఫిబ్రవరిలో 76 శాతం రెసిడెన్షియల్ సేల్స్ జరిగితే 2022 ఫిబ్రవరిలో 69 శాతం రెసిడెన్షియల్ సేల్స్ మాత్రమే రిజిస్టర్ అయ్యాయి.

ఇక 2021 ఫిబ్రవరిలో రూ.25 లక్షలలోపు కేటగిరిలో ప్రాపర్టీకి 42శాతం డిమాండ్ ఉంటే.. 2022 ఫిబ్రవరిలో 16 శాతానికి పడిపోయింది. సాధారణంగా ఈ కేటగిరిలో ఎక్కువసేల్స్ రిజిస్ట్రేషన్స్ జరుగుతుంటాయి. 2022 ఫిబ్రవరిలో జరిగిన సేల్స్ రిజిస్ట్రేషన్ సంఖ్య భారీగా తగ్గిపోయింది. జరిగిన రిజిస్ట్రేషన్లలో రూ.25 లక్షల నుంచి రూ.50లక్షల సెగ్మెంట్ లో కాస్త వృద్ధి కనిపించింది.

కరోనా వైరస్ మహమ్మారి కారణంగా ఇళ్లు కొనేవారు పెద్ద నివాసాలకు వెళ్లడం.. అప్ గ్రేడ్ చేయడం లాంటి ధోరణి 2022 ఫిబ్రవరిలో కూడా కనిపించిందని ఈ విశ్లేషణ తెలిపింది. నాలుగు జిల్లాల్లో ఇళ్ల అమ్మకాలు 25శాతం పడిపోతే.. జిల్లా వారీగా చూస్తే హైదరాబాద్ జిల్లాలో సేల్స్ రిజిస్ట్రేషన్ 64శాతం పడిపోయింది. మొత్తం సేల్స్ లో కూడా ఫిబ్రవరిలో నమోదైన రెసిడెన్షియల్ యూనిట్లలో జిల్లా 10 శాతంవాటాను కలిగి ఉంది. ఇది ఒక సంవత్సరం క్రితం 20శాతంగా ఉంది.

రిజిస్ట్రేషన్ డేటా ద్వారా ప్రతిబింబించే విధంగా రెసిడెన్షియల్ ప్రాపర్టీల సగటు లావాదేవీ ధర ఫిబ్రవరి 2022లో 21శాతం పెరిగింది. హైదరాబాద్ మార్కెట్ లో ఇటీవలి కాలంలో ధరల పెరుగుదల బలంగా ఉన్నప్పటికీ ఫిబ్రవరిలో ఈ అసాధారణ వృద్ధికి రూ.25 లక్షల విభాగంలో నమోదైన అమ్మకాల వాటాలో భారీ పతనం కారణంగా తెలుస్తోంది.