Begin typing your search above and press return to search.
ఇమ్రాన్ కు పదవీ గండం ?
By: Tupaki Desk | 18 March 2022 9:31 AM GMTపాకిస్ధాన్ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ కు పదవీ గండం తప్పేట్లు లేదు. ఇమ్రాన్ పార్టీ పాకిస్తాన్- తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్ కు చెందిన 23 మంది ఎంపీలు తిరుగుబాటు లేవదీశారు. వీళ్ళంతా ప్రతిపక్షాలతో చేతులు కలిపారు. అలాగే ఇమ్రాన్ మంత్రివర్గం నుంచి ముగ్గురు మంత్రులు రాజీనామాలు చేశారు. దాంతో ప్రభుత్వం ఒక్కసారిగా సంక్షోభంలోకి కూరుకుపోతోంది.
దాదాపు నాలుగు రోజుల క్రితమే ఇమ్రాన్ కు మద్దతు ఉపసంహరించుకోబోతున్నట్లు మిత్రపక్షాలు హెచ్చరించిన విషయం తెలిసిందే. దాంతోనే ప్రభుత్వం సంక్షోభంలో పడిపోతుందా అనే అనుమానాలు మొదలైపోయాయి. అలాంటిది ఇంత తొందరగా సంక్షోభంలోకి పడిపోతుందని బహుశా ఇమ్రాన్ కూడా ఊహించి ఉండరు. తిరుగుబాటు చేసిన ఎంపీలందరూ సింధ్ ప్రావిన్స్ లోని ఇస్లామాబాద్ లోని సింథ్ హౌస్ లో దాక్కున్నారు. తాము ప్రభుత్వానికి దొరికితే ఇమ్రాన్ ఏమి చేస్తారో అన్న భయంతో సింథ్ హౌస్ లో దాక్కున్నారు.
సింధ్ ప్రావిన్స్ లోని సింధ్ హౌస్ కే వీళ్ళంతా ఎందుకెళ్ళారంటే ఇక్కడ మాజీ ప్రధానమంత్రి నవాజ్ షరీఫ్ కు చెందిన ప్రభుత్వం ఉంది. తాము తలదాచుకునేందుకు ఇంతకన్నా సురక్షితమైన ప్రాంతం మరోటి లేదని ఎంపీలు అనుకున్నారు. అంటే ఎంపీలదరికీ ప్రభుత్వం అంటే ఎంత భయమో అర్ధమైపోతోంది. అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టే రోజు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓట్లు వేసే ఎంపీలపై ఎలాంటి చర్యలు తీసుకోబోమని ఇమ్రాన్ హామీ ఇవ్వాలట.
తమకు ఇమ్రాన్ అలాంటి హామీ ఇస్తే తామంతా తిరిగి ఇస్లామాబాద్ కు తిరిగొస్తామంటు రెబల్ ఎంపీల్లో ఒకరైన రాజా రియాజ్ ప్రకటించటమే విచిత్రంగా ఉంది. ఒకవైపేమో ప్రభుత్వం నుండి ప్రాణహాని ఉందని భయపడుతునే మరోవైపు తమ జోలికి రామని హామీ ఇస్తే ఇస్లామాబాద్ కు వస్తామని చెప్పటం విడ్డూరమే. ఇప్పటికి 24 మంది ఎంపీలు, ముగ్గురు మంత్రులు మాత్రమే ఉన్నా ముందు ముందు మరింత మంది తమతో చేతులు కలపబోతున్నట్లు రియాజ్ పెద్ద బాంబే పేల్చారు. మరి ఇమ్రాన్ ప్రభుత్వం చివరకు ఏమవుతుందో చూడాల్సిందే.