Begin typing your search above and press return to search.
ఉక్రెయిన్ లో చదివిన భారత విద్యార్థులు సుప్రీంకోర్టుకు..
By: Tupaki Desk | 14 March 2022 3:30 PM GMTఉక్రెయిన్ పై రష్యా యుద్ధంతో వందలాది మంది భారతీయ విద్యార్థులు పొట్ట చేతపట్టుకొని చావుభయంతో భారత్ తిరిగి వచ్చేశారు. మోడీ ప్రభుత్వం 'ఆపరేషన్ గంగ'లో విమానాలు పెట్టడంతో వారంతా తిరిగి రాగలిగారు. దీంతో భారత విద్యార్థులు వైద్యవిద్య మధ్యలోనే ఆగిపోయింది.
రష్యా బాంబులతో ఉక్రెయిన్ మొత్తం చిన్నాభిన్నం కావడంతో ఇప్పుడక్కడ చదివే పరిస్థితులు లేవు. ఈక్రమంలోనే స్వదేశానికి తిరిగివచ్చిన భారత విద్యార్థులు తమ భవిష్యత్తుపై ఆందోళనతో సుప్రీంకోర్టులో పిల్ దాఖలు చేశారు. విద్యార్థులు ఇండియాలో తమ చదువును కొనసాగించేలా చర్యలు తీసుకోవాలంటూ కేంద్రప్రభుత్వాన్ని ఆదేశించాలని పిల్ లో పేర్కొన్నారు.
ఉక్రెయిన్-రష్యా మధ్య గతనెల 24న యుద్ధం ప్రారంభమైంది. ఈ నేపథ్యంలో సుమారు 20వేల మంది భారతీయ విద్యార్థులు అక్కడే చదువుకుంటూ చిక్కుకున్నాడు. దీంతో ప్రభుత్వం 'ఆపరేషన్ గంగా' చేపట్టింది. విద్యార్థులను ఇండియాకు తీసుకొచ్చింది. విద్యార్థులు క్షేమంగా ఇండియాకు తిరిగి వచ్చినా కూడా వారి భవిష్యత్తు గందరగోళంలో పడిపోయింది. ముఖ్యంగా వైద్య విద్యార్థులు నిబంధనల ప్రకారం ఇండియాలో తమ కోర్సు పూర్తి చేయడానికి ఇక్కడ అవకాశం లేదు. దీంతో సదురు విద్యార్థుల భవిష్యత్తు అగమ్యగోచరంగా మారింది.
ఈ నేపథ్యంలో వైద్య విద్యార్థులు భారత్ లో తమ చదువు పూర్తి చేసేలా నిబంధనల్లో మార్పులు చేయాలని.. ఇందుకోసం చర్యలు తీసుకునేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ రాణా సందీప్ బుస్సా అనే న్యాయవాది సుప్రీంకోర్టులో పిల్ దాఖలు చేశారు.
ఓరియేంటేషన్ ప్రోగ్రామ్ ద్వారా విద్యార్థులు తమ చదువు కొనసాగించేలా అవకాశం కల్పించాలని అభ్యర్థించారు. ఇక కొన్ని రోజులక్రితమే ఇదే విషయంపై ప్రవాసీ లీగల్ సెల్ కూడా ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించింది.
రష్యా, ఉక్రెయిన్‌ల మధ్య గత కొద్ది రోజులుగా తీవ్ర వివాదం కొనసాగుతోంది. ఉక్రెయిన్ లో రష్యా సైన్యం యుద్ధాన్ని తీవ్రతరం చేసింది. ఉక్రెయిన్‌లోని భారత రాయబార కార్యాలయం ద్వారా భారతీయ విద్యార్థులందరూ ఇండియాకు సురక్షితంగా చేసుకున్నారు. ఒక విద్యార్థి మరణించారు. ఇప్పుడు వారి వైద్య చదువులు ఏం కానున్నాయన్నది ప్రశ్నార్థకంగా మారింది.