Begin typing your search above and press return to search.
డీఆర్ఎస్.. సూపర్ ఓవర్.. కొవిడ్ రూల్స్ మారనున్న ఐపీఎల్
By: Tupaki Desk | 15 March 2022 1:30 PM GMTప్రపంచంలో ఎన్ని లీగ్ లు ఉన్నా క్రికెట్ లో ఇండియన్ ప్రీమియర్ లీగ్ స్థాయే వేరు. డబ్బుకు డబ్బు.. పేరుకు పేరు.. ఐపీఎల్ ను ఉన్నత స్థానంలో నిలిపాయి. వీటన్నిటికీ తోడు మంచి పోటీతత్వం, నాణ్యమైన క్రికెట్ మన లీగ్ సొంతం. అందుకనే ఎంతటి అంచనాలతో మొదలైందో అంతకుమించి ఆదరణతో ముందుకుసాగుతోంది. పదిహేనో సీజన్ కు వచ్చినా ఫ్యాన్ బేస్ ఏమాత్రం తగ్గలేదు సరికదా? ఇంకా పెరిగింది. దీనికోసమే అన్నట్లు ఈ ఏడాది లీగ్ లో జట్ల సంఖ్యను ఆడే పద్ధతిని మార్చారు.
ఆటగాళ్లు చాలావరకు జట్లు మారారు కాబట్టి ఈసారి లీగ్ మరింత రంజుగా సాగడం ఖాయం. కాగా, కొత్తగా వచ్చిన రెండు జట్లు లఖ్ నవూ, గుజరాత్ టైటాన్స్ కు మంచి సారథులు దొరకడంతో లీగ్ హోరెత్తడం ఖాయంగా కనిపిస్తోంది. మరోవైపు కొవిడ్ కారణంగా 2020, 2021 సీజన్లు అనుకున్నంత ఆదరణ పొందలేదు. ఎంతలేదన్నా.. రూ.50 వేల కోట్ల విలువచేసే ఐపీఎల్ ను కొవిడ్ దారుణంగా దెబ్బతీసింది. "మైదానాల్లో ప్రేక్షకులు" అనేది కనుమరుగైంది. లీగ్ కు అందం, మజా, నిండుదన తెచ్చే ప్రేక్షకులు లేకపోవడంతో లీగ్ ఓ దశలో బోరింగ్ గానూ అనిపించింది. యూఏఈలో నిరుడు మరీ తక్కువ స్కోర్లు నమోదు కావడం విసుగెత్తించింది. ఈ నేపథ్యంలో 2022 లో లీగ్ మన దేశంలో జరుగనుండడం అభిమానులకు కిక్కు ఇస్తుందనడంలో సందేహమే లేదు.
దీన్నిబట్టి ఐపీఎల్ 2022 సీజన్ కు సంబంధించి బీసీసీఐ కొత్త రూల్స్ తీసుకొచ్చేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా డీఆర్ ఎస్ తో పాటు సూపర్ ఓవర్, ఏదైనా టీంలో కరోనా పాజిటివ్ ల సంఖ్య ఎక్కువగా ఉంటే ఎం చెయ్యాలనే విషయాలపై బీసీసీఐ కొన్ని కీలక నిబంధనలను రూపొందించినట్లు తెలుస్తోంది. ఐపీఎల్ 15వ సీజన్ మార్చి 26 నుంచి ఐపీఎల్ ఆరంభం కానున్న సంగతి తెలిసిందే. 65 రోజుల పాటు క్రికెట్ అభిమానులను అలరించేందుకు ఐపీఎల్ సిద్ధంగా ఉంది. అదే సమయంలో ఐపీఎల్ 2022 సీజన్ కు సంబంధించి బీసీసీఐ కొత్త రూల్స్ తీసుకొచ్చేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా డీఆర్ ఎస్ తో పాటు సూపర్ ఓవర్, ఏదైనా టీంలో కరోనా పాజిటివ్ ల సంఖ్య ఎక్కువగా ఉంటే ఎం చెయ్యాలనే విషయాలపై బీసీసీఐ కొన్ని కీలక నిబంధనలను రూపొందించినట్లు తెలుస్తోంది.
డీఆర్ ఎస్
డెసిషన్ రివ్యూ సిస్టం... ప్రతి ఇన్నింగ్స్‌లో ఒక్కో జట్టుకు రెండు రివ్యూలు కోరే అవకాశం. ఇంతకుముందు ప్రతి ఇన్నింగ్స్‌లో ఒక్కో జట్టుకు ఒక్కో సమీక్ష కోరే వెసులుబాటు మాత్రమే ఉండేది. దాన్ని ఇప్పుడు రెండుకు పెంచారు. దీంతో ఒక్కో జట్టు ఒక్కో ఇన్నింగ్స్‌లో రెండేసి రివ్యూలు ఉపయోగించుకోవచ్చు.వాస్తవానికి అంపైర్ల పొరపాటు నిర్ణయాలకు సంజీవని లాంటిది. అంపైర్ నిర్ణయం తప్పని అనిపిస్తే వ్యతిరేకంగా వచ్చిన ప్లేయర్ కానీ లేదా టీం కెప్టెన్ కానీ డీఆర్ ఎస్ కు వెళ్లొచ్చు. దాంతో కచ్చితమైన నిర్ణయాన్ని పొందే అవకాశం ఉంటుంది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ లోనూ డీఆర్ ఎస్ అమలులో ఉంది. అయితే ఐపీఎల్ 15వ సీజన్ నుంచి ఇందులో స్వల్ప మార్పు ఉండబోతుంది. గత సీజన్ వరకు ప్రతి టీం కూడా ఇన్నింగ్స్ కు ఒకసారి మాత్రమే డీఆర్ ఎస్ ను ఉపయోగించే వీలు ఉండేది. ఒక వేళ అది తప్పని తేలితే.. ఆ టీం డీఆర్ ఎస్ ను కోల్పోతుంది. తాజాగా బీసీసీఐ డీఆర్ ఎస్ సంఖ్యను పెంచినట్లు తెలుస్తోంది.
ప్లే ఆఫ్స్ లో సూపర్ ఓవర్ సాధ్య పడకపోతే గ్రూప్ దశ ముగిసిన తర్వాత టాప్ 4లో నిలిచిన నాలుగు జట్లు నాకౌట్ దశకు చేరుకుంటాయి. అప్పుడు ఎప్పటిలానే టాప్ 2 జట్ల మధ్య ఫైనల్ క్యాలిఫయర్ మ్యాచ్... మూడు నాలుగు స్థానాల్లో మిగిలిన జట్ల మధ్య ఎలిమినేటర్ 1 మ్యాచ్ జరుగుతుంది. అనంతరం క్వాలిఫయర్ 1లో ఓడిన టీం మధ్య... ఎలిమినేటర్ 1 టీం విజేత మధ్య మరో మ్యాచ్ జరుగుతుంది. ఇందులో గెలిచిన జట్టుతో క్వాలిఫయర్ 1లో గెలిచిన టీంతో ఫైనల్ మ్యాచ్ జరుగుతుంది. అయితే తాజాగా ప్లే ఆఫ్స్ విషయంలో బీసీసీఐ ఓ కొత్త రూల్ ను తీసుకురానుంది.
అదేంటంటే.. ఇప్పుడు టీం 'ఎ', టీం 'బి' మధ్య ఓ ప్లే ఆఫ్ మ్యాచ్ జరిగిందనుకోండి. ఆ మ్యాచ్ చివరకు టైగా ముగిసింది. విజేతను నిర్ణయించేందుకు సూపర్ ఓవర్ అవసరం కాగా... వర్షంతో అది సాధ్యపడలేదు. అప్పుడు గ్రూప్ దశలో ఈ రెండు జట్ల మధ్య ఏ జట్టు అత్యధిక పాయింట్లు సాధించాయో ఆ జట్టును విజేతగా ప్రకటిస్తారు. మూడో రూల్ ఎంటంటే... ఏదైనా జట్టు మ్యాచ్‌కు ముందు కరోనా బారినపడితే.. ఆరోజు మ్యాచ్‌లో దిగేందుకు 11 మంది సరైన ఆటగాళ్లు లేకపోతే ఏం చేయాలనేదానిపైనే కచ్చితమైన ప్రణాళిక రూపొందించారని తెలిసింది. కాగా, ఇదివరకు అలాంటి పరిస్థితుల్లో ఆరోజు జరగాల్సిన మ్యాచ్‌ను రీషెడ్యూల్ చేసేవారు. ఇప్పుడు కూడా అలా రీషెడ్యూల్ చేసేందుకే చూస్తారు. ఒకవేళ అది కూడా సాధ్యంకాని పరిస్థితుల్లో ఆ విషయాన్ని ఐపీఎల్ టెక్నికల్ టీమ్ దృష్టికి తీసుకెళ్తారు. వాళ్లు తీసుకునే నిర్ణయమే అంతిమం..
తాజా ఎంసీసీ నిబంధనలూ..
ఇటీవల మెరిల్‌బోర్న్ క్రికెట్ క్లబ్ తీసుకొచ్చిన కొత్త నిబంధన.. ఎవరైనా బ్యాట్స్‌మన్ క్యాచ్ ఔటైన సందర్భాల్లో.. క్రీజులోకి వచ్చే ఆటగాడే స్ట్రైకింగ్ చేయడం. దాన్ని ఈ సీజన్‌లోనే అమలు చేయాలనుకుంటున్నారు. ఇక ప్లేఆఫ్స్ లేదా ఫైనల్ లాంటి కీలక మ్యాచ్‌ల్లో ఏదైనా ఫలితం తేలకుండా టైగా మారితే.. నిర్ణీత సమయంలో సూపర్ ఓవర్ నిర్వహిస్తారు. అది కూడా కుదరని పక్షంలో లీగ్ స్టేజ్‌లో పాయింట్ల పట్టికలో మెరుగ్గా ఉన్న జట్టునే విజేతగా ప్రకటిస్తారు.