Begin typing your search above and press return to search.

నై జ‌గ‌న్ : బొత్స అంటే భ‌యం భ‌యం..ఆనం అంటే కూడా !

By:  Tupaki Desk   |   8 April 2022 7:30 AM GMT
నై జ‌గ‌న్ : బొత్స అంటే భ‌యం భ‌యం..ఆనం అంటే కూడా !
X
ఆంధ్రావ‌ని రాజ‌కీయాల్లో పెను మార్పులు రానున్నాయి. ఇప్ప‌టిదాకా ఒక ఎత్తు ఇక‌పై మ‌రో ఎత్తు అన్న విధంగా రాజ‌కీయాల స‌ర‌ళి మార‌నుంది. ఆ విధంగా పాల‌క ప‌క్షంలో వ‌చ్చే మార్పులు అన్న‌వి రేప‌టి వేళ ఏ విధంగా ఉండ‌నున్నాయో అన్నది ఓ చ‌ర్చ. స‌ర్వ‌త్రా న‌డుస్తున్న చ‌ర్చ అని రాయాలి. ఈ నేప‌థ్యంలో జ‌గ‌న్ త‌న వంతుగా సీనియ‌ర్ల‌ను పూర్తిగా త‌ప్పించి కొత్త‌వారికి ఇవ్వ‌డం ఓ ప్ర‌యోగం. ప్ర‌యోజ‌నం మాట ఎలా ఉన్నా ప్ర‌స్తుతానికి ఇదొక ప్ర‌యోగం మాత్ర‌మే! గ‌తంలో ఎవ్వ‌రూ చేయ‌ని సాహ‌సం కూడా ! అసంతృప్త మంత్రులు తిరుగుబాటు చేసే వీలు ఉన్నా కూడా జ‌గ‌న్ ఎందుక‌నో ముందు నిర్ణ‌యించిన ప్ర‌కార‌మే త‌న ప్ర‌ణాళిక ను ప‌క‌డ్బంధీగా అమలు చేస్తుండ‌డం విశేషం.

ఇక ఉత్త‌రాంధ్ర‌లో కీల‌క కాపు నేత బొత్స స‌త్య‌నారాయ‌ణ‌కు ప‌ద‌వీ యోగం లేద‌ని ఖ‌రార‌యిందా? అంటే కొన్ని వ‌ర్గాలు మాత్రం ఔన‌నే అంటున్నాయి. మా లీడ‌ర్ కు ప‌ద‌వి ఉన్నా లేక‌పోయినా ఆయ‌న చెప్పిన వ్య‌క్తుల‌కే ప‌ద‌వి ఇవ్వాల‌న్న‌ది ఇదే స‌మ‌యంలో బొత్స వ‌ర్గీయులు చెబుతున్న మాట. ఆవిధంగా బొత్స ఇంట ఉన్న‌మ‌రో ఎమ్మెల్యే బొత్స అప్ప‌ల న‌ర్స‌య్య (గ‌జ‌ప‌తి న‌గ‌రం ఎమ్మెల్యే) కు అవ‌కాశం ఇవ్వాల‌ని కోరుతున్నారు. 2009 లో ఓ సారి ఎమ్మెల్యేగా ఇదే నియోజ‌క‌వ‌ర్గం నుంచి గెలిచారు. అప్ప‌ట్లో ఆయ‌న కాంగ్రెస్ త‌ర‌ఫున పోటీ చేసి అన్న దిశా నిర్దేశ‌క‌త్వంలో గెలుపు ప‌తాకం ఎగుర‌వేశారు. త‌రువాత అన్న బాట‌లోనే న‌డిచి 2019లో మ‌ళ్లీ గెలుపు సాధించారు.

ఈ నేప‌థ్యంలో ఆయ‌నకు మంత్రి ప‌ద‌వి ఇస్తే బాగుంటుంది అన్న‌ది బొత్స స‌త్య‌నారాయ‌ణ ఆలోచ‌న కూడా ! త‌న‌ను కాద‌ని కోమ‌టి సామాజిక‌వ‌ర్గానికి చెందిన విజ‌య‌న‌గ‌రం ఎమ్మెల్యే కోల‌గ‌ట్ల వీర‌భ‌ద్ర‌స్వామి కి క‌నుక ప‌ద‌వి ఇస్తే బొత్స‌కు కోపం రావ‌డం ఖాయం. అప్పుడు ఆయ‌న అసంతృప్తిని దాచుకోలేక తిరుగుబాటు చేయ‌డం కూడా ఖాయం.ఇదే త‌రుణంలో జ‌గ‌న్ కు కూడా బొత్స అంటే భ‌యం ఉంద‌ని కొంద‌రు వినిపించే మాట. ఎందుకంటే తండ్రి వైఎస్సార్ హ‌యాంలో మంత్రిగా ప‌నిచేసినా ఆయ‌న‌కు కూడా ప‌ద‌వుల విష‌య‌మై చుక్క‌లు చూపించారు. అదేవిధంగా ఉత్త‌రాంధ్ర రాజకీయాల్లో తిరుగులేని నేత‌గా పేరు ఉంది.

సొంత సామాజిక వ‌ర్గం అయిన కాపుల‌లో ఆధిప‌త్యం చెలాయించేది కూడా ఆయ‌నే! రాజ‌కీయంగానే కాదు ఆర్థికంగా కూడా బ‌ల‌మైన ఉత్త‌రాంధ్ర నేత కూడా! అందుకే ఆయ‌నంటే జ‌గ‌న్ కు భ‌యం. ఓ సంద‌ర్భంలో జ‌గ‌న్ ను, సాయిరెడ్డిని, రామ‌కృష్ణా రెడ్డిని, ఏక కాలంలో ఢీ అంటే ఢీ అన్న విధంగా ఎదుర్కొన్నారు. నేరుగానే వారిపై విమ‌ర్శ‌లు చేసిన దాఖ‌లాలు ఉన్నాయ‌ని స‌చివాల‌య ఉద్యోగ వ‌ర్గాలు వ్యాఖ్యానించాయి అప్ప‌ట్లో ! త‌రువాత ఎందుక‌నో త‌గ్గిపోయారు.

కుమారుడు బొత్స సందీప్ ను రాజ‌కీయాల్లోకి తీసుకుని రావాల‌ని అనుకున్న‌దే త‌డ‌వుగా ఇటుగా తెచ్చారు. కొడుకు భ‌విత‌వ్యం కూడా బాగుండాల‌న్న ఉద్దేశంతో కాస్త వెన‌క్కు త‌గ్గార‌ని అంటారు. కానీ జ‌గ‌న్ అంటే ఆయ‌న‌కు భ‌యం లేదు. అలా అని త‌న మాట నెగ్గ‌కుంటే తిరుగుబాటు చేయ‌కుండా ఉండ‌లేరు. ఈ నేప‌థ్యంలో కొత్త మంత్రి ప‌ద‌వి విజ‌య‌న‌గ‌రం జిల్లాలో ఎవ‌రికి ద‌గ్గ‌నుందో మ‌రి! ఇప్ప‌టికే సాలూరు ఎమ్మెల్యే పీడిక రాజ‌న్న దొర ను స్పీక‌ర్ చేయాల‌న్న ఆలోచ‌న‌లో ఉన్నందున మంత్రి ప‌ద‌వి పైనే ఏదో ఒక స్ప‌ష్ట‌త రావాల్సి ఉంది.

అందుకే ఆయ‌న త‌న‌ను కొన‌సాగిస్తారో లేదో చెప్ప‌లేన‌ని దేవుడిపైనే భారం వేశాన‌ని అత్యంత న‌ర్మ‌గ‌ర్భంగా మాట్లాడారు నిన్న‌టి వేళ..మీడియా ఎదుట! ఇక మ‌రో కీల‌క నేత ఆనం రామ నారాయ‌ణ రెడ్డి (నెల్లూరు రెడ్డి) కూడా తీవ్ర అసంతృప్తితోనే ఉన్నారు.ఇక్క‌డున్న అనీల్ ను త‌ప్పిస్తున్నారు క‌నుక త‌న‌కు ఛాన్స్ ద‌క్క‌వ‌చ్చ‌ని అనుకుంటున్నారు.ఒక‌వేళ ఆయ‌న‌కు ప‌ద‌వి రాకుంటే లేదా ద‌క్క‌కుంటే జ‌గ‌న్ కు కొత్త త‌ల‌నొప్పులు ఖాయం. ఆయ‌న త‌ర‌ఫు మ‌నుషుల నుంచి కూడా తిరుగుబాటు త‌థ్యం.