Begin typing your search above and press return to search.
గడగడపకూ పవన్ ..జగన్ దారిలోనే జనసేన !
By: Tupaki Desk | 16 March 2022 7:30 AM GMTజనసేన వేరు..జగన్ వేరు.అవును ఇద్దరూ వేర్వేరు.పార్టీలే కాదు రాజకీయంలో నడుచుకునే శైలి కూడా వేరు.ప్రజలను ఆకట్టుకునే విధానం కూడా వేరు.అయినా కూడా కొన్ని విషయాల్లో పవన్ ను జగన్ అనుసరిస్తారు.జగన్ ను జనసేన ఫాలోఅవుతుంది.
ఇదేం తప్పేం కాకున్నా సైద్ధాంతిక వైరుధ్యాలున్న పార్టీలు కొన్ని విషయాల్లో ఒకే దారిలో నడిచేందుకు ఇష్టపడడం ఓ విధంగా ఆశ్చర్యకరమే! అధికారంలో ఉన్నా లేకపోయినా పార్టీ కన్నా ప్రజలే పరమావధి అని భావించడం పవన్ వంతు అని, అధికారంలో ఉంటూ కూడా ప్రజల మధ్య కు వెళ్లేందుకు తటపటాయిస్తున్న వైనం వైసీపీది అని పలువురు జనసేన కార్యకర్తలు ఎద్దేవా చేస్తున్నారు. వీటిలో వాస్తవ మరియు అవాస్తవ రీతులు ఎలా ఉన్నా ఇప్పుడీ రెండు పార్టీలు త్వరలోనే జనం మధ్యకు వెళ్లి తమ జాతకాలు తేల్చుకోనున్నారు.
ఏప్రిల్ రెండు నుంచి గడప గడపకు వైసీపీ కార్యక్రమాన్ని నిర్వహించాలని చూస్తున్నారు యువ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి.ఆ విధంగా జనం మధ్యకు వెళ్లాలని,వారి బాధలూ,ఇబ్బందులూ తెలుసుకోవాలని ప్రయత్నిస్తున్నారు.ఈ క్రమంలో మంత్రులకు,ఎమ్మెల్యేలకు నిన్నటి వేళ నిర్వహించిన వైఎస్సార్సీపీ శాసన సభా పక్షం సమావేశంలో దిశా నిర్దేశం చేశారు.
పార్టీ తరఫున ఎన్నికైన ఎమ్మెల్యేలలో ప్రతి ఒక్కరూ డోర్ టు డోర్ సర్వే చేయాల్సిందేనని, సర్వేలలో పేర్లుండకపోతే టిక్కెట్లు ఉండవని అన్నారు.ఈ విషయం వెంటనే గ్రహించి చాలా మంది అప్రమత్తం అయ్యారు.ఇదే సమయంలో విపక్ష పార్టీ జనసేన కూడా అప్రమత్తం అవ్వడం విశేషం.
ఆవిర్భావ సమావేశం తరువాత జనసైనికులు ఇకపై పూర్తిగా గ్రామ స్థాయిలో, పట్టణ స్థాయిలో పనిచేసేందుకు సమాయత్తం అవుతున్నారు.ఇందులో భాగంగా ఇంటింటికీ వెళ్లి పార్టీ సిద్ధాంతాలను వివరించనున్నారు.అదేవిధంగా జనసేన అధికారం చేపట్టేందుకు క్షేత్ర స్థాయిలో ఏం అవసరమో వాటిని గుర్తించి సంబంధిత సమస్యల పరిష్కారం కోసం ప్రయత్నిస్తున్నారు.
ముఖ్యంగా ఉద్యోగాల్లో తలమునకలై తిరుగాడే జనసైనికులు సైతం పార్టీ కోసం సాయంత్రం ఐదు నుంచి ఏడు గంటల వరకూ రోజుకు రెండు గంటల పాటు కాలాన్ని వెచ్చించేందుకు తాము సిద్ధమేనని,పవన్ పై అభిమానాన్ని ఓటు బ్యాంకు ద్వారా తీసుకువచ్చేందుకు కృషి చేయాల్సిన సమయం రానే వచ్చిందని అంటున్నారు.