Begin typing your search above and press return to search.

కడప కోటను కొట్టే మాస్టర్ ప్లాన్ లో బాబు

By:  Tupaki Desk   |   16 Oct 2022 3:30 AM GMT
కడప కోటను కొట్టే మాస్టర్ ప్లాన్ లో బాబు
X
కడప అంటే వైసీపీ అడ్డా అని చెబుతారు. కడప జిల్లా వైఎస్సార్ హయాం నుంచి కూడా ఆ కుటుంబానికి అలా కట్టుబడిపోయి ఉంది. జగన్ కి బలమంతా కూడా రాయలసీమలో ఎక్కువ ఉంటే అందునా కడప ఆయనకు పెట్టని కోట. అయితే అలాంటి కడపలో కూడా ఇపుడు సామాజిక సమీకరణలు మారుతున్నాయని అంటున్నారు. బలమైన సామాజికవర్గాలు ఉన్న చోట ఎంతసేపూ మైనారిటీలకు టికెట్లు ఇస్తూ వైసీపీ తమకు పక్కన పెడుతోంది అన్న బాధ వారికి ఉంది.

ఉదాహరణకు కడప పట్టణంలో వైసీపీ టికెట్ గత రెండు ఎన్నికల నుంచి అంజద్ భాషాకే ఇస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో కూడా ఏమీ తేడా ఉండదు. ఆయనకే సీటు కన్ ఫర్మ్ అంటున్నారు. పైగా ఆయన ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఆయన్ని పక్కన పెడితే మైనారిటీలు దూరం అవుతారు అన్న లెక్కలేవో ఆ పార్టీకి ఉన్నాయట. సో వైసీపీ విషయం తీసుకుంటే మైనారిటీలకు ఆ సీటు దాదాపుగా రిజర్వ్ చేసి పారేసింది అనుకోవాలి.

అదే ఇపుడు టీడీపీకి అడ్వాంటేజ్ గా కనిపిస్తోంది. కడప అసెంబ్లీ సీటును కొట్టాలని మాస్టర్ ప్లాన్ వేస్తోంది. ఇక్కడ సామాజికవర్గం పరంగా తీసుకుంటే బలిజ కులస్థులు నలభై నుంచి యాభై వేల పై చిలుకు ఉన్నారని అంటున్నారు. అంటే మొత్తం ఓట్లలో పాతిక శాతం పై మాటే అన్న మాట. వారిలో చాలా మందికి అసంతృప్తి తీవ్రంగా ఉంది.

తాము ఎపుడూ రాజకీయంగా ప్రాతినిధ్యం వహించలేకపోతున్నామని. అందుకే ఈసారి ఎటూ వైసీపీలో చాన్స్ ఉండదు కాబట్టి టీడీపీ నుంచి నరుక్కురావాలని చూస్తున్నారుట. ఈ మధ్యనే బలిజలు అంతా కలసి ఒక మీటింగ్ పెట్టుకుని మరీ తమకు టికెట్ ఇవ్వాల్సిందే అని వైసీపీ సహా రాజకీయ పార్టీలు అన్నింటికీ వినతి చేశాయి.

ఇపుడు టీడీపీ వైపు ఆ సామాజికవర్గం ఆశగా ఎదురుచూస్తోంది అంటున్నారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీ నుంచి పోటీ చేయడానికి ఆ సామాజిక వర్గం నుంచి బాలిశెట్టి హరిప్రసాద్‌ ముందుకు వచ్చారు. ఆయన లోకల్ గా ఉన్న టీడీపీ నేత. ఆయన నేరుగా చంద్రబాబుని కలసి తన వినతిపత్రం కూడా ఇచ్చారు. తనకు కనుక టికెట్ ఇస్తే కచ్చితంగా గెలిచి వస్తానని కూడా చెప్పినట్లుగా తెలుస్తోంది.

పైగా బలిజలకు టికెట్ ఇస్తే బీసీలు, మైనారిటీల సపోర్ట్ కూడా ఉంటుంది అని వివరించినట్లుగా ఆయన బాబుకు వివరించినట్లుగా చెబుతున్నారు. ఇక ఇదే నియోజకవర్గంలో ఉన్న ఎస్టీలు కూడా మద్దతుగా నిలుస్తారు అని చెప్పుకున్నారుట. మరి చంద్రబాబు జగన్ ఇలాకాలో పాగా వేయడానికే చూస్తారు. ఇపుడు సామాజిక ఈక్వేషన్స్ కూడా కలసి వస్తున్నాయి.

దాంతో బాలిశెట్టి హరిప్రసాద్‌ కి టికెట్ ఇస్తారని ప్రచారం జరుగుతోంది. టీడీపీ కనుక ఆ స్టెప్ తీసుకుంటే వైసీపీ పాత రూట్లో రొటీన్ టైప్ లో మైనారిటీలకే టికె ట్ ఇచ్చిబిగ్  రిస్క్ చేస్తుందా లేక తన వైఖరి మార్చుకుంటుందా అన్నది కూడా అసక్తికరమైన చర్చగా ఉంది మరి.