Begin typing your search above and press return to search.
కేసీయార్ దూకుడుతో జగన్ పరేషాన్...?
By: Tupaki Desk | 9 March 2022 9:52 AM GMTరెండు తెలుగు రాష్ట్రాల విషయంలో చాలా పోలికలు ఉంటాయి. అక్కడ ఏం జరిగితే ఇక్కడ అదే జరగాలని కోరుకుంటారు. ఇక ఎనిమిదేళ్ల ముందు వరకూ రెండు రాష్ట్రాలూ ఒక్కటే. దాంతో ఒక చోట మంచి జరిగితే రెండవ చోట ఆటోమేటిక్ గా డిమాండ్ రాజుకుంటుంది. ఇపుడు తెలంగాణాలో అతి పెద్ద మేలు నిరుద్యోగులకు జరగబోతోంది. పెద్ద ఎత్తున దాదాపుగా లక్ష ఉద్యోగాలకు కేసీయార్ సర్కార్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది.
ఒక విధంగా తెలనాణాలోని నిరుద్యోగులకు ఇది పండుగ. ఏళ్లకు ఏళ్ళు విసిగి వేసారిన వారికి వేసవిలో పన్నీరు జల్లు మాదిరిగా కేసీయార్ భారీ ఎత్తున ఉద్యోగ ప్రకటన చేశారు. అందరికీ జాబ్స్ అంటూ ఆయన అత్యంత శుభకరమైన వార్త చెప్పేశారు.
శాసనసభ వేదికగా చేసుకుని కేసీయార్ 91,142 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నట్లుగా తెలియచేశారు. టీవీల ముందు ఉగ్గబట్టి చూస్తున్న నిరుద్యోగ యువతకు ఇది ఆనందకరమైన వార్త. నిజంగా వారి జీవితాలకు శాశ్వతమైన ఆనందాన్ని కేసీయార్ కలిగించారు. 11,103 కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమబద్దీకరణతో పాటు, మిగిలిన 80,039 ఉద్యోగాలను డైరెక్ట్ గా తీస్తున్నారు.
ఇక వీటితో పాటు ప్రతీ ఏటా జాబ్ క్యాలండర్ ని కూడా ప్రకటించి ఆ ఏటికి ఏర్పడిన ఖాళీలను భర్తీ చేస్తామని మరింత సంబరం కలిగించే వార్తను కేసీయార్ సార్ చెప్పారు. తెలంగాణాలో ఇక కాంట్రాక్టు పోస్టులు అన్న మాటే ఉండరాదు అని కూడా ఆయన అంటున్నారు. టోటల్ గా చూస్తే తెలంగాణాలో కొలువుల మేళాయే అన్న సీన్ ఉంది. మరి అదే ఏపీలో చూస్తే ఏముంది గర్వకారణం అన్నట్లుగా పరిస్థితి తయారైంది.
ఇక్కడ కూడా జగన్ పాదయాత్ర వేళ అతి పెద్ద హామీ ఇచ్చారు. తాను ముఖ్యమంత్రి అయ్యాక ప్రతీ ఏటా జాబ్ క్యాలండర్ ని విడుదల చేస్తామని లక్షలాది ఖాళీలను భర్తీ చేస్తామని కూడా చెప్పారు. కానీ జగన్ అధికారంలోకి వచ్చాక రెండేళ్లు దాటాక విడుదల చేసిన జాబ్ క్యాలండర్ లో పదివేల ఉద్యోగాలు కూడా లేవు. దాంతో అది జాబ్ లెస్ క్యాలండర్ అని నిరుద్యోగ యువత మండిపోయింది.
ఇక ఇంకోవైపు చూస్తే పదవీవిరమణ వయసు దేశంలోనే ఎక్కడా లేని విధంగా అరవై రెండేళ్లకు పెంచేసి జగన్ యువత ఆశల మీద ఒక్కసారిగా నీళ్ళు చల్లేశారు. నిజానికి రిటైర్మెంట్ వయసు పెంపుని ప్రభుత్వ ఉద్యోగులు కోరుకోలేదు. కానీ ఆర్ధిక పరిస్థితుల కారణంతోనే జగన్ సర్కార్ ఈ నిర్ణయం తీసుకుంది. ఈ విధంగా రానున్న కాలంలో ఖాళీ అవాల్సిన లక్షలాది పోస్టులు అయితే లాక్ అయిపోయాయి.
అయినా సరే ఇప్పటిదాక చూసుకున్నా ఏపీలో రెండున్నర లక్షల పోస్టుల దాకా ఖాళీలు ఉన్నాయని అంటున్నారు. ఇందులో కనీసం సగం అయినా భర్తీ చేస్తే నిరుద్యోగులు శాంతిస్తారు. కానీ జగన్ సర్కార్ తీవ్రమైన ఆర్ధిక సంక్షోభంలో చిక్కుకుని పోయింది. ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు చెల్లించడానికే ఖజానాను చూసుకోవాల్సి వస్తోంది.
మరి ఈ సమయంలో కొత్తగా జాబ్స్ తీయడం అంటే కుదిరే పని కానే కాదు. నిజానికి జగన్ ఈ పరిస్థితుల్లో కొత్త ఉద్యోగాల విషయాన్ని కూడా ఆలోచించలేరని అంటునారు. అయితే తెలంగాణాలో దాదాపుగా లక్ష దాకా పోస్టులు తీయడం అంటే సామాన్య విషయం కాదు, ఇది తప్పనిసరిగా ఏపీరాకీయల మీద తీవ్ర ప్రభావం చూపిస్తుంది.
దీన్ని విపక్షాలు గట్టిగానే వాడుకుంటాయి. ఇప్పటికే నిరుద్యోగ సంఘాలు పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తున్నాయి. దాంతో జగన్ కి ఇది రాజకీయ ఇరకాటమే అని చెప్పాలి. ఉద్యోగాలు భర్తీ చేస్తే ఒక తంటా లేకపోతే మరో తంటా అన్నట్లుగా సీన్ ఉంటుంది. మొత్తానికి కేసీయార్ దూకుడు జగన్ పాలిట శాపంగా మారుతోందా అంటే జవాబు అవును అనే అనాలేమో.