Begin typing your search above and press return to search.
మొదటి ట్రిప్పు వరకు బాగానే జరిగిందా ?
By: Tupaki Desk | 21 Feb 2022 6:30 AM GMTకేసీయార్ మొట్టమొదటి రిసెప్షన్ వరకు బాగానే ఉంది. రిసెప్షన్ అంటే ఏదో పెళ్ళి రిసెప్షన్ అనుకునేరు. ఇక్కడ రిసెప్షన్ అంటే అర్థం రిసీవింగ్ అని. జాతీయ రాజకీయాలను మార్చేసే ఉద్దేశ్యంతో కేసీయార్ పెద్ద పోరాటమే మొదలుపెట్టారు. ఇందులో భాగంగా మొదటి పర్యటన ముంబాయి తో మొదలుపెట్టారు. ముంబాయ్ లో ముందుగా సీఎం ఉధ్ధవ్ ఠాక్రే లంచ్ మీటింగ్ జరిగింది. లోపల ఏమి మాట్లాడుకున్నారనే విషయం బయటకు పొక్కే అవకాశం లేదు.
అయితే చర్చలు మాత్రం బ్రహ్మాండంగా జరిగినట్లు ఇద్దరు సీఎంలు చెప్పుకున్నారు. మీటింగ్ తర్వాత ఠాక్రే మీడియాతో మాట్లాడుతూ నరేంద్ర మోడీ వ్యతిరేక పోరాటంలో కేసీయార్ కు పూర్తి మద్దతిస్తామని హామీ ఇచ్చారు. అలాగే సాయంత్రం ఎన్సీపీ అధినేత శరద్ పవార్ తో కేసీయార్ భేటీ అయ్యారు. ఈ సమావేశం కూడా బాగా జరిగినట్లే అనుకోవాలి. ఎందుకంటే పవార్ కూడా కేసీయార్ కు మద్దతు ప్రకటించారు.
ఇద్దరితోనూ కేసీయార్ మీటింగ్ సంతృప్తిగా ముగిసింది కాబట్టే మొదటి రిసెప్షన్ బాగా జరిగిందని చెప్పింది. నిజానికి ముగ్గురి వ్యవహారాలను గమనిస్తే మోడితో డైరెక్టు ఫైటింగ్ చేస్తున్నది కేసీయార్ మాత్రమే. ఠాక్రే ఇంతవరకు మోడీకి వ్యతిరేకంగా పెద్దగా చేసిన ప్రకటనలు కూడా ఏమీ లేవు. అలాగే శరద్ పవార్ అయితే అసలు మోడీ గురించి నోరు విప్పలేదు.
పవార్ దృష్టంతా రాబోయే రాష్ట్రపతి ఎన్నికల మీదే ఉంది. ఒకపుడు ప్రధానమంత్రి అవుదామని కలలు కన్న పవార్ తాజాగా రాష్ట్రపతి అయితే చాలన్నట్లుగా సరిపెట్టుకుంటున్నారు.
ఇందులో భాగంగానే పవార్ జాగ్రత్తగా పావులు కదుపుతున్నారు. ఎవరినీ దూరం చేసుకోకుండా అలాగే ఎవరినీ నెత్తికెక్కించుకోకుండా అందరితోను కలివిడిగా ఉంటున్నారు. కాబట్టి పవార్ ను కేసీయార్ టేకిట్ ఫర్ గ్రాంటెడ్ గా తీసుకునేందుకు లేదు. ఎందుకంటే రేపటి రోజున స్వయంగా నరేంద్రమోడీనే పవార్ కు ఆఫర్ ఇస్తే వెంటనే ఏమాత్రం ఆలోచించకుండా ఎన్డీయే వైపు వెళ్ళిపోయేందుకే ఎక్కువ అవకాశాలున్నాయి. సరే భవిష్యత్తులో ఏమి జరుగుతుందో చెప్పలేం కానీ ఇప్పటికైతే కేసీయార్ హ్యాపీనే.