Begin typing your search above and press return to search.
లఖీంపూర్ ఖేరి: ప్రభుత్వం డబ్బు తిరిగి తీసుకున్నా కానీ.. న్యాయం కావాలి
By: Tupaki Desk | 22 Feb 2022 8:30 AM GMTఉత్తరప్రదేశ్ లోని లఖీంపూర్ ఖేరీలో రైతులపైకి బీజేపీ నేతలు కారుతో దూసుకెళ్లి చంపిన ఘటన దేశవ్యాప్తంగా సంచలనమైంది. గత ఏడాది అక్టోబర్ 3న జరిగిన ఈ దుర్ఘటనలో పలువురు రైతులు చనిపోయారు. లఖీంపూర్ ఖేరి తికునియాలో థార్ జీపు కింద నలిగిపోయి ఒక జర్నలిస్టు, నలుగురు రైతులు ప్రాణాలు కోల్పోయారు. అందులో రైతు ఉద్యమంలో యాక్టివ్ గా పాల్గొన్న ‘నక్షత్రసింగ్’ కూడా ఒకరు.
నక్షత్రసింగ్ కుటుంబం ఇప్పటికీ ఈ విషాదం నుంచి కోలుకోవడం లేదు. ఈ కేసులో కేంద్రహోంశాఖ సహాయ మంత్రి, లఖీంపూర్ ఖేరీ ఎంపీ అజయ్ మిశ్రా అలియాస్ టెని కొడుకు ఆశిష్ మిశ్రా ప్రధాన నిందితుడు. దాదాపు 4 నెలలు జైల్లో ఉన్న తర్వాత ఆశిష్ మిశ్రాకు కోర్టు ఇటీవలే బెయిల్ మంజూరు చేసింది. ఇది నక్షత్రసింగ్ కుటుంబానికి మరింత కలవరం పెడుతోంది.
ఈ క్రమంలోనే నక్షత్రసింగ్ కుటుంబానికి యూపీ పోలీసులు భద్రత ఏర్పాటు చేశారు. కానీ తమకు న్యాయం లభిస్తుందనే ఆశ వారిలో రోజురోజుకూ సన్నగిల్లుతోంది. ప్రభుత్వం మీద ఆశలు పెట్టుకోలేమని.. ప్రభుత్వం గుడ్దిది అని.. వాళ్లు ఏదీ చూడాలనుకోవడం లేదు.. వినాలనుకోవడం లేదని నక్షత్రసింగ్ కొడుకు జగదీప్ సింగ్ అన్నారు.
ఇప్పటికీ ఘటన జరిగి 5 నెలలు అయ్యింది. ఇప్పటివరకూ న్యాయం జరగలేదు. న్యాయం జరిగి ఉంటే ఆయనకు బెయిల్ ఎందుకు వస్తుందని నక్షత్రసింగ్ భార్య జశ్వంత్ కౌర్ ప్రశ్నించారు. తమకు న్యాయం లభించలేదని రైతులు ఆగ్రహంతో ఉన్నారు. అజయ్ మిశ్రాకుమారుడి నాలుగు నెలల్లోనే బెయిల్ రావడంతో తమ పట్ల, పక్షపాతం చూపుతున్నారనే విషయం రైతులకు అర్థమవుతోందని ఎస్పీ నేతలు విమర్శిస్తున్నారు.
యూపీ అసెంబ్లీ నాలుగో దశ పోలింగ్ లో భాగంగా లఖీంపూర్ ఖేరిలో ఫిబ్రవరి 23న ఓటింగ్ జరుగబోతోంది. ఈ ఆంశం ఇప్పుడు ఎన్నికల ప్రచారాన్ని వేడెక్కిస్తోంది. ఎస్పీనేత అఖిలేష్ రైతులను తొక్కించి చంపిన బీజేపీపై తీవ్ర విమర్శలు చేస్తున్నారు.