Begin typing your search above and press return to search.

ఆరు జూరాల ప్రాజెక్టుల సాటి- మ‌ల్ల‌న్న సాగ‌ర్ కథేంటి?

By:  Tupaki Desk   |   23 Feb 2022 9:30 AM GMT
ఆరు జూరాల ప్రాజెక్టుల సాటి- మ‌ల్ల‌న్న సాగ‌ర్ కథేంటి?
X
ఇవాళ మ‌ల్ల‌న్న సాగ‌ర్ ఎత్తిపోతల ప‌థ‌కంను సీఎం కేసీఆర్ ప్రారంభించ‌నున్నారు.సిద్ధి పేట క‌ల‌ల సాగ‌రంగా పేరున్న ఈ ప‌థ‌కంతో సాగు మ‌రియు తాగునీరు అందించేందుకు ఏర్పాట్లు పూర్త‌య్యాయి.దేశంలోనే మొట్ట‌మొద‌టి సారిగా న‌దిలేని చోట ఎత్తిపోత‌లు చేపట్టిన ఘ‌నత త‌మ‌దేన‌ని అంటున్నారు హ‌రీశ్ రావు.50టీఎంసీల నిల్వ సామ‌ర్థ్యంతో ఈ రిజ‌ర్వాయ‌ర్ నిర్మాణం చేప‌ట్టారు.సేద్య రంగంలో మ‌హాద్భుతం అని ఈ ప్రాజెక్టు గురించి అభివ‌ర్ణిస్తున్నారు.తెలంగాణ వాకిట నీటి ల‌భ్య‌త త‌క్కువ‌గా ఉన్న ప‌ది జిల్లాల‌కు సాగు నీరు అందించేందుకు ఈ ప్రాజెక్టు ఎంత‌గానో ఉప‌యోగ‌ప‌డ‌నుంది అని చెబుతున్నారు ప్ర‌భుత్వ పెద్ద‌లు.

కాళేశ్వ‌రం ఎత్తి పోత‌ల ప‌థ‌కంలో భాగంగా దీనిని నిర్మించారు.సిద్ధిపేట జిల్లా తొగుట, కొండపాక మండలాల సరిహద్దులో సంబంధి త ప్రాజెక్టు ప‌నులు పూర్తి చేశారు.ఇక్క‌డి నుంచి 30 టీఎంసీల నీటిని హైద్రాబాద్ ,సికింద్రాబాద్ న‌గ‌ర వాసుల‌కు తాగునీటి నిమిత్తం ఇవ్వ‌నున్నారు.పారిశ్రామిక అవ‌స‌రాల నిమిత్తం 16 టీఎంసీల నీటిని వాడుకోనున్నారు.గోదావ‌రి జ‌లాల‌ను ఎత్తిపోసేందుకు

నిర్ణయించిన ప్రాజెక్టులో భాగంగా సిద్ధిపేట జిల్లా,రంగనాయకసాగర్‌ నుంచి సొరంగం ద్వారా తుక్కాపూర్‌ పంప్‌హౌస్ చేరిన నీటిని, మ‌ల్లన్న సాగ‌ర్ రిజర్వాయర్‌లోకి ఎత్తిపోశాక ఆయుక‌ట్టుకు నీరు అందించ‌డంతో పాటు ఇత‌ర అవస‌రాల‌నూ తీర్చ‌నున్నారు. మొత్తం12 ల‌క్ష‌ల ఎక‌రాల‌కు ఈ ప్రాజెక్టు ద్వారా నీరంద‌నుంది.

నేరుగా ఈ రిజ‌ర్వాయ‌ర్ ప‌రిధిలో ల‌క్షా 65 వేల ఎక‌రాల‌కు నీరంద‌నుండ‌గా,ఈ ప‌థ‌కం ద్వారా కొండపోచమ్మ, గంధమల, బస్వాపూర్‌ రిజర్వాయర్లను నింపి, త‌ద్వారా అక్క‌డి ఆయ‌క‌ట్టుకూ నీరందించ‌నున్నారు.

నిజాంసాగర్‌, సింగూరు, ఘనపూర్‌ ఆయకట్టు స్థిరీకరణకు కూడా ఈ ప్రాజెక్టే ఆధారం కానుంది. గ‌త ఏడాది ఆగ‌స్టులో ప్రాజెక్టుకు సంబంధించి ట్ర‌యిల్ ర‌న్ పూర్తి చేశారు.అదేవిధంగా ముంపుగ్రామాల‌ను ఇప్ప‌టికే ఖాళీ చేయించి వారికి పునరావాసం సైతం చూపించారు.ఇంకా కొన్ని నిర్వాసిత స‌మ‌స్య‌లు ఉన్నాయ‌ని కూడా తెలుస్తోంది.వీటిని ప‌రిష్క‌రించేందుకు సీఎం దృష్టి సారించాల్సి ఉంది.