Begin typing your search above and press return to search.
ఇలాంటి నేతను మళ్ళీ ఆశించగలమా... ?
By: Tupaki Desk | 21 Feb 2022 10:30 AM GMTసమాజం ముందుకు పరిగెడుతోంది. దాంతో అభివృద్ధితో పాటు అనేక మార్పులు కూడా వస్తున్నాయి. అయితే అది ఆరోగ్యకరమా కాదా అంటే అదొక పెద్ద చర్చ. ఇదిలా ఉంటే గత కాలం మేలు వచ్చు కాలం కంటే అన్న నానుడి ఎటూ ఉంది. అది నిజంగా నిజమే. ఎందుకంటే ఈ ప్రకృతిలో అన్నింటికీ ఒక ఎక్స్పైరిడిటీ డేట్ ఉంటుంది. అలాగే విలువలకూ ఉంది అనుకోవాలి. దానికి ఆ రంగం ఈ రంగం అన్న తేడా లేదు.
అలా రాజకీయాల్లో కూడా విలువలు బాగా తగ్గిపోతున్నాయి. అలాంటి తరుణంలో విలువలతో కూడిన రాజకీయం ఎలా చేయాలో చూపించిన నేతగా దివంగత మంత్రి మేకపాటి గౌతం రెడ్డిని చెప్పుకోవాలి. ఆయనది రాజకీయ కుటుంబం. అయినా ఏనాడూ దాన్ని చూపించి తన అహంభావాన్ని చూపించలేదు, దాన్ని ఉపయోగించుకుని నిచ్చెన మెట్లు ఎక్కాలనుకోలేదు
ఇక రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచి కీలకమైన మంత్రిత్వ శాఖలను చూస్తున్న గౌతం రెడ్డి ఏ రోజూ మీడియా ముందు పొల్లు మాటలు మాట్లాడలేదు. ఆయన రాజకీయ ప్రత్యర్ధులను కూడా గట్టిగా విమర్శించలేదు. ఏపీలో రాజకీయం చూస్తే ఉప్పు నిప్పులా వైసీపీ టీడీపీల మధ్య ఉంటుంది. అలాంటి సమయంలో కూడా గౌతం రెడ్డి సహనంతోనే ముందుకు సాగారు తప్ప ఎక్కడా ఘాటు విమర్శలు లేవు.
అందుకే టీడీపీ వారు సైతం ఆయన్ని అజాత శతృవు అంటున్నారు. ఇక రాజకీయాల్లో అధినాయకుడి మెప్పు పొందాలీ అంటే ఎన్ని తిట్లు నోటికి వస్తే అన్నీ తిట్టేయడమే పనిగా కొందరు పెట్టుకుంటున్నారు. మీడియా అటెన్షన్ కూడా తమ మీద ఉండాలని కూడా చూస్తున్నారు. నిరంతరం అలా ప్రచారంలో ఉండాలని భావిస్తున్నారు. కానీ గౌతం రెడ్డి ఇలాంటి వాటికి భిన్నమని ఆయన వ్యవహార శైలి రుజువు చేస్తోంది.
తమ మంత్రిత్వ శాఖకు చెందిన విషయాలు తప్పించి వేరే విధంగా ఆయన మాట్లాడిన దాఖలాలు లేవు ఇక ఎంతలా లో ప్రోఫైల్ మెయింటెయిన్ చేశారో కూడా చూస్తే అర్ధమవుతుంది. తన పని తీరు ద్వారానే తాను ఏంటో తెలియాలనుకున్న యువ నాయకుడు ఆయన. అందుకే ఎపుడూ ఆయన మీడియాలో పెద్దగా కనిపించేవారు కాదు. మొత్తానికి గౌతం రెడ్డి లాంటి వారు రాజకీయాల్లో అరుదు. ఇపుడు అలాంటి వారు ఉంటారా అంటే చెప్పడం కష్టమే. ఆయనలేని లోటు వైసీపీకే కాదు, మొత్తం రాజకీయ వ్యవస్థకే లోటుగా కూడా చెప్పాలి.