Begin typing your search above and press return to search.
బెంగాల్ అసెంబ్లీలో బీభత్సం.. బీర్బూమ్ రగడ.. కొట్టుకున్న ఎమ్మెల్యేలు
By: Tupaki Desk | 28 March 2022 9:30 AM GMTఎన్నికల సందర్భంగా హింస.. ఎన్నికల అనంతరం హింస.. ఎన్నికలయిన ఏడాదికీ హింసే.. పశ్చిమ బెంగాల్ లో ఇదీ పరిస్థితి. ఇటీవల బెంగాల్ లోని బీర్బూమ్ లో చోటుచేసుకున్న సజీవ దహన ఘటనలు ఆ రాష్ట్ర రాజకీయాలను కుదిపేస్తున్నాయి. ఒకప్పుడు కాంగ్రెస్ - సీపీఎం, తర్వాత సీపీఎం- తృణమూల్ కాంగ్రెస్, ఇప్పుడు తృణమూల్ కాంగ్రెస్-బీజేపీ.. పార్టీలు మారినా, ప్రత్యర్థులు మిత్రలైనా, మిత్రులు శత్రువులైనా.. ఆ రాష్ట్రంలో ఎప్పుడూ రాజకీయ రగడే.
అసలే అన్ని విధాలుగా చైతన్యవంతమైన ప్రజలు కావడం, దానికి పార్టీలు, మత రాజకీయాలు తోడవడంతో పరిస్థితులు ఎప్పుడూ ఉద్రిక్తంగానే ఉంటున్నాయి. అంతెందుకు గతేడాది ఎన్నికల సందర్భంగా చోటుచేసుకున్న రాజకీయ నాటకీయ పరిణామాలు అందరూ చూశారు. కేంద్ర ప్రభుత్వంలోని బీజేపీ.. రాష్ట్రంలోని సీఎం మమతా బెనర్జీ కొదమ సింహాల్లా తలపడిన ఆ ఎన్నికలు కురక్షేత్రాన్నే తలపించాయి. ఎన్నికల హడావుడి అంతా సద్దుమణిగిన తర్వాత ప్రతీకారేచ్ఛతో హింస చోటుచేసుకుంది. చాలామంది తీవ్రంగా గాయపడ్డారు.
బీర్బూమ్ సెగలు
ప్రస్తుతం బెంగాల్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇటీవల బీర్‌భూం జిల్లాలో చోటుచేసుకున్న హింసాత్మక ఘటనలో 8 మంది సజీవదహనమైన విషయమై సోమవారం అసెంబ్లీలో ప్రతిపక్ష భాజపా చర్చకు పట్టుబట్టింది. రాష్ట్రంలో శాంతి భద్రతలపై ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. దీనిపై సీఎం మమతా బెనర్జీ సమాధానం చెప్పాలంటూ డిమాండ్ చేసింది. అయితే భాజపా నేతల వ్యాఖ్యలను తృణమూల్ ఎమ్మెల్యేలు అడ్డుకున్నారు. ఈ క్రమంలోనే తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. సభలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. బీర్‌భూం సజీవదహనాల ఘటనపై అధికార తృణమూల్ కాంగ్రెస్, భాజపా ఎమ్మెల్యేల మధ్య వాగ్వాదం పెరిగి పెద్దదై తీవ్ర రూపం దాల్చింది. ఎమ్మెల్యేలు పరస్పరం దాడులకు దిగారు. ఇరు పక్షాల ఎమ్మెల్యేలు ఒకరినొకరు తోసుకుంటూ కొట్టుకున్నారు.
సీట్లలోంచి లేచి మరీ..
భాజపా, తృణమూల్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు తమ సీట్ల నుంచి లేచి గొడవకు దిగారు. ఇది కాస్తా ఉద్రిక్తంగా మారింది. ఎమ్మెల్యేలు పరస్పరం తోసుకోవడం, దాడి చేసుకోవడంతో పలువురు గాయపడ్డారు. ఇందుకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్‌మీడియాలో వైరల్‌గా
మారాయి. అనంతరం భాజపా ఎమ్మెల్యేలు సభ నుంచి వాకౌట్ చేశారు. ‘‘అసెంబ్లీలో ఎమ్మెల్యేలకు రక్షణ లేకుండా పోయింది. మా సభ్యులపై టీఎంసీ ఎమ్మెల్యేలు దాడి చేశారు’’ అని భాజపా శాసనసభా పక్ష నేత సువేందు అధికారి ఆరోపించారు. అయితే ఈ వ్యాఖ్యలను తృణమూల్ మంత్రి ఫిర్హాద్ హకీమ్ కొట్టిపారేశారు.
అసెంబ్లీలో గందరగోళం సృష్టించేందుకు భాజపా ప్రయత్నిస్తోందని దుయ్యబట్టారు. మరోవైపు ఘటన నేపథ్యంలో ఐదుగురు భాజపా సభ్యులను స్పీకర్ సభ నుంచి సస్పెండ్ చేశారు. సువేందు అధికారి, మనోజ్ టిగ్గా, నరహరి మహతో, శంకర్ ఘోష్, దీపర్ బర్మాన్‌ను సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించారు.
అసలేం జరిగింది.
ఈ నెల 21న బీర్‌భూం జిల్లాలో బర్షాల్ గ్రామ పంచాయతీ ఉప ప్రధాన్, తృణమూల్ కాంగ్రెస్ పార్టీ నేత భాదు షేక్ హత్య జరిగింది. ఆ కొద్దిగంటలకే రామ్‌పుర్‌హాట్ పట్టణ శివారులోని బోగ్‌టూయి గ్రామంలో హింస చెలరేగింది. ఎనిమిది ఇళ్లు అగ్నికి ఆహుతై 8 మంది సజీవ దహనమయ్యారు. భాదు షేక్ హత్యతో ప్రత్యర్థు ఇళ్లకు టీఎంసీ కార్యకర్తలు నిప్పు పెట్టినట్లు ఆరోపణలు వచ్చాయి.
హత్యకు ముందు వారిని తీవ్రంగా కొట్టినట్లు పోస్ట్‌మార్టం నివేదికలో వెల్లడైంది. ఈ ఘటనను సుమోటోగా స్వీకరించిన కలకత్తా హైకోర్టు కేసు దర్యాప్తును సీబీఐకి అప్పగించింది. ఈ కేసులో ఇప్పటికే తృణమూల్ నేత సహా 22 మందిని పోలీసులు అరెస్టు చేశారు. కాగా, ఘటన అనంతరం బీర్బూమ్ లో పర్యటించిన సీఎం మమతా బెనర్జీ నిందితుల్లో తమ పార్టీ వారున్నా ఉపేక్షించదవద్దని పోలీసులను ఆదేశించారు. ఆ వెంటనే పోలీసులు కొందరు అధికార పార్టీ నేతలను అరెస్టు చేయడం గమనార్హం.