Begin typing your search above and press return to search.

పాలస్తీనాలో భారత రాయబారి మరణంపై సందేహాలు

By:  Tupaki Desk   |   7 March 2022 5:17 AM GMT
పాలస్తీనాలో భారత రాయబారి మరణంపై సందేహాలు
X
అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. పెద్ద వయసు కాని ఒక మధ్యవయస్కుడైన పాలస్తీనాలోని భారత రాయబారి అనుమానాస్పద రీతిలో మరణించిన తీరు ఇప్పుడు షాకింగ్ గా మారింది. ఆయన మరణంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఢిల్లీలో పుట్టి పెరిగిన ఈ ఐఎఫ్ఎస్ అధికారి ముకుల్ ఆర్య పాలస్తీనాలో భారత రాయబారిగా పని చేస్తున్నారు.

రమల్లాలోని భారత ఎంబసీలో ఆయన అచేతనంగా పడి ఉన్న వైనాన్ని గుర్తించారు. ఆయన మరణించినట్లుగా కేంద్ర విదేశాంగ మంత్రి ఎస్ జయశంకర్ ధ్రువీకరించారు. ఆయన మరణంపై తీవ్ర విచారాన్ని వ్యక్తం చేయటంతో పాటు దిగ్భాంత్రికి గురయ్యారు.

ఎంతో తెలివైన.. ప్రతిభావంతుడైన అధికారి ముకల్ అని పేర్కొన్నారు. అతడి కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. భారత రాయబారి ముకుల్ ఆర్యన్ మరణంపై పాలస్తీనా అగ్రశ్రేణి నాయకత్వం దిగ్భ్రాంతిని వ్యక్తం చేయటమే కాదు.. ఆ దేశ అధ్యక్షుడు మహమూద్ అబ్బాస్.. ప్రధాని మహమ్మద్ ష్టాయే భద్రత.. పోలీసు.. ఫోరెన్సిక్ తో పాటు పలు విభాగాల అధికారుల్ని అలెర్టు చేశారు.

భారత రాయబార కార్యాలయానికి చేరుకొని ముకుల్ మరణానికి కారణాలేమిటన్న విషయాన్ని తేల్చాలని ఆయన ఆదేశించారు. అదే సమయంలో.. భారత విదేశీ మంత్రిత్వ శాఖతో సంప్రదింపులు జరుపుతున్నట్లుగా పేర్కొన్నారు. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో అన్ని రకాలుగా సాయం చేయటానికి సిద్ధంగా ఉన్నట్లుగా పాలస్తీనా ప్రభుత్వం వెల్లడించింది. 2008 ఇండియన్ ఫారిన్ సర్వీస్ బ్యాచ్ కు చెందిన ముకుల్.. తన విద్యాభాస్యం మొత్తం ఢిల్లీలోనే చేశారు. ఢిల్లీ వర్సిటీ.. జవహర్ లాల్ నెహ్రూ వర్సిటీలో ఎకనామిక్స్ కోర్సులు చేశారు.

అనంతరం ఇండియన్ ఫారిన్ సర్వీస్ బ్యాచ్ కు చెందిన అతడు.. గతంలో కాబూల్.. మాస్కోలోని రాయబార కార్యాలయంతో పాటు ఢిల్లీలోని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రధాన కార్యాలయంలోనూ పని చేశారు. పారిస్ లోని మునెస్కో భారత శ్వాశత ప్రతినిధి టీంలోనూ సేవలు అందించారు.

ముకుల్ భౌతికకాయాన్ని తరలించేందుకు వీలుగా భారత విదేశీ మంత్రిత్వ శాఖతో సంప్రదింపులు జరుపుతున్నట్లుగా పేర్కొన్నారు. ఏమైనా.. దేశం తరఫున రాయబారిగా పని చేస్తున్న ఒక మధ్య వయస్కుడు అనుమానాస్పదంగా మరణించటం దేనికి నిదర్శనం? అన్నదిప్పుడు పెద్ద ప్రశ్నగా మారింది. దీనికి సమాధానం లభించేదెప్పుడు?