Begin typing your search above and press return to search.

నాడు నేడు : బ‌కాయిలు చెల్లించండి జ‌గ‌న్ ?

By:  Tupaki Desk   |   23 Feb 2022 8:31 AM GMT
నాడు నేడు : బ‌కాయిలు చెల్లించండి జ‌గ‌న్ ?
X
ముందంతా అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా చేప‌ట్టిన ప‌నులు ఇప్పుడు ఆగిపోయాయి. రెండో విడ‌త‌లో క‌నీస స్థాయిలో కూడా ప‌నుల్లేవు.మ‌రోవైపు కొత్త విద్యా విధానం ప్రకారం ప్రాథ‌మిక విద్యలో మూడు నాలుగు ఐదు త‌ర‌గ‌తుల‌ను హై స్కూల్లో క‌లిపేస్తుండ‌డంతో బ‌డుల సంఖ్య మ‌రియు అభివృద్ధిపై ఎటువంటి స్ప‌ష్ట‌తా లేకుండా పోతోంది. పాఠ‌శాల‌లు ఎన్ని అవస‌రం అవుతాయి ఎన్ని ర‌ద్ద‌వుతాయో కూడా తెలియ‌డం లేదు.ఇవ‌న్నీ నాడు నేడు అమ‌లుకు ప్ర‌తిబంధ‌కాలు అయితే ఎప్ప‌టిలానే నిధుల లేమి ఒక‌టి వెన్నాడుతోంది.ముందున్నంత చొర‌వ‌తో ఇవాళ నిధుల విడుద‌ల లేదు. దీంతో పథ‌కం అమ‌లుపై నీలినీడ‌లు క‌మ్ముకుంటున్నాయి.

ప్ర‌భుత్వ పాఠ‌శాల‌ల‌కు మ‌హ‌ర్ద‌శ క‌ల్పించేందుకు నిర్దేశించిన నాడు నేడు కార్య‌క్ర‌మంకు సంబంధించి ఇప్ప‌టికే కొన్ని చోట్ల ప్ర‌శంస‌లు వ‌స్తున్నాయి.విద్యా సంస్థ‌ల్లో మౌలిక వ‌స‌తులు మెరుగు ప‌డ్డాయ‌న్న మాట కూడా బ‌లీయంగా వినిపిస్తోంది.దీంతో పాటు కొన్నిచోట్ల పాఠ‌శాలల రూపురేఖ‌లే మారిపోయాయి అని కూడా చాలా మంది అబ్బుర‌ప‌డుతున్నారు.

ఇదే స‌మ‌యంలో ప్ర‌భుత్వ పాఠ‌శాల‌లు మ‌రికొన్ని కొత్త రూపు సంత‌రించుకోనున్నాయి అని కొందరు సంబ‌ర‌ప‌డ్డారు కానీ రెండో ద‌శ‌లో చేప‌ట్టబోయే పనుల సంఖ్య‌ను ఇప్ప‌టికే కుదించారు. ముందుగా నిర్దేశించిన ల‌క్ష్యం అనుసారం నిధులు కేటాయించేందుకు అవ‌కాశం లేద‌ని తెలుస్తోంది.దీంతో ముందు ఆశించిన రీతిలో రెండో విడ‌త‌లో ప‌నులు చేప‌ట్ట‌డం అన్న‌ది సాధ్యం కాద‌ని కూడా తేలిపోయింది.

ఇక మొద‌టి విడ‌త‌కు సంబంధించి 15715 సూళ్ల‌కు మోక్షం ద‌క్కింది.వీటిలో మౌలిక వ‌స‌తుల క‌ల్ప‌న‌తో పాటు త‌ర‌గ‌తుల ఆధునికీక‌రణ అన్న‌ది నిర్దేశించిన నిబంధ‌న‌ల‌కు అనుగుణంగా ప‌నులు శ‌ర‌వేగంగా జ‌రిగాయి.కానీ ప‌నులు చేప‌ట్టిన వారికి ఇప్ప‌టికి మూడు వంద‌ల కోట్ల‌కు పైగా బిల్లులు పెండింగ్ లో ఉన్నాయ‌ని తెలుస్తోంది.అదేవిధంగా రెండో విడ‌త లో ప‌నులు కూడా పెద్ద‌గా ఎక్క‌డా పూర్తి స్థాయిలో ప్రారంభం కాలేద‌ని ప్ర‌ధాన మీడియా చెబుతోంది.

దీంతో ప్ర‌భుత్వ బ‌డుల‌కు సంబంధించి ముందున్నంత శ్ర‌ద్ధ ఇప్పుడు సీఎం తీసుకోవడం లేద‌ని ఆరోప‌ణ‌లు వినిపిస్తున్నాయి.