Begin typing your search above and press return to search.
పంచాయతీల నెత్తిన బరువు... ఆ బాధ్యత వారిదేనా....?
By: Tupaki Desk | 24 March 2022 2:30 AM GMTపంచాయతీలు అన్నవి పల్లెల్లో ప్రజలకు నేరుగా అందుబాటులో ఉండి సేవ చేసేందుకు ఉద్దేశించినవి. నిజం చెప్పాలంటే సర్పంచ్ పదవి చాలా విలువ అయినది, బాధ్యతతో కూడినది. అలాంటి పంచాయతీలకు రాజ్యాంగం కూడా కీలకమైన విధి విధానాలకు ఖరారు చేసింది. పంచాయయతీలకు అప్పట్లో రాజీవ్ గాంధీ ప్రభుత్వం రాజ్యాంగ సవరణ చేయడం వల్ల నేరుగా ఆర్ధిక సంఘం నిధులు వచ్చే పరిస్థితి ఏర్పడింది. అయితే వాటిని కూడా రాష్ట్ర ప్రభుత్వాలు మళ్ళిస్తున్నాయన్న గగ్గోలు ఉండనే ఉంది.
పంచాయతీల కంటే ప్రజలకు చేరువ చేసే పాలన మరోటి లేదు. కానీ జగన్ సర్కార్ సచివాలయ వ్యవస్థను తీసుకువచ్చింది. దాంతోనే పంచాయతీలు గోల పెట్టాయి. ఎందుకంటే తమ అధికారాలు అన్నీ కూడా వాటికే దఖలు పడుతున్నాయన్నది వారి అభియోగం. గ్రామ సచివాలయాల అధికారాల్ని వీఆర్వోలకు అప్పగిస్తూ గతంలో తీసుకున్న నిర్ణయం వివాదాస్పదమైంది. హైకోర్టు ఉత్తర్వుల అనంతరం ఈ వివాదం సద్దుమణిగినా కూడా ఈ రోజుకూ తేలని విషయం అంటూ ఉంటే అది పంచాయతీలకు సరిసమానంగా సచివాలయ వ్యవస్థ ఎందుకు ఉండడం అన్నది.
దేశవ్యాప్తంగా పంచయతీలకు ఒక స్ట్రక్చర్ ఉంది. రాజ్యాంగం ప్రకారం ఆ వ్యవస్థలు ఏర్పాటు అయి ఉన్నాయి. వాటికి వేరే రూపం ఇవ్వాలనుకున్నా లేక వాటి అధికారాలు తగ్గించాలనుకున్నా కూడా రాజ్యాంగం ప్రకారం కుదిరే వీలు అయితే లేదు. కానీ పంచాయతీలను పక్కన పెడుతూ ఈ రోజుకూ సచివాలయాలే ముందున్నాయి. ఏపీలో అది కొట్టొచ్చినట్లుగా కనిపిస్తోంది.
అన్ని సేవలు, అన్ని కార్యక్రమాలూ సచివాలయ వ్యవస్థ ద్వారానే జరిగిపోతున్నాయి. సర్పంచులు ఉత్సవ విగ్రహాలు అవుతున్నారు. ఇవన్నీ పక్కన పెడితే పంచాయతీలకు ఉన్నవే అరకొర నిధులు. అలాంటి పంచాయతీల మీద సచివాలయాల భారాన్ని మోపాలని ప్రభుత్వం చూస్తోందని ప్రచారం అయితే పెద్ద ఎత్తున సాగుతోంది.
దానికి ఉదాహరణగా పశ్చిమ గోదావరి జిల్లాలో సచివాలయాల బిల్లులు కొన్ని పంచాయతీలకు అప్పచెబుతూ అధికారుల నుంచి ఆదేశాలు వచ్చినట్లుగా ప్రచారం సాగుతోంది. విషయానికి వస్తే 2019లో ఏర్పాటు అయిన సచివాలయాలకు ఒక్కోదానికి రెండు కంప్యూటర్లు, ఒక ప్రింటర్ ని ప్రభుత్వం కొనుగోలు చేసి ఇచ్చింది. వీటి ఖర్చు ఎనభై వేల రూపాయలు. ఆ బిల్లులను ఇపుడు ప్రతీ సచివాలయం నుంచి చెల్లించాలని వెండర్ల నుంచి వత్తిడి ఉంది.
అయితే ఈ బిల్లులను ఇపుడు పంచాయతీలకు పంపుతున్నారుట. ఒక గ్రామ పరిధిలో రెండు మూడు సచివాలయలు ఉంటే కచ్చితంగా రెండు లక్షల రూపాయల మొత్తం అన్న మాట ఇది. మరి ఈ బిల్లులను పంచాయతీలే చెల్లించాలని పంచాయతీ అధికారుల నుంచి ఆదేశాలు వస్తున్నాయని తెలుస్తోంది. కానీ తాము ఈ బిల్లులను ఎందుకు చెల్లించాలని సర్పంచులు గోల పెడుతున్నారు. అలాగే పంచాయతీ కార్యదర్శులు కూడా ఇదేమి దారుణమని వాపోతున్నట్లుగా సమాచారం.
మరి పశ్చిమ గోదావరి జిల్లాలో ఈ విధంగా పంచాయతీలకు ఆదేశాలు వచ్చినట్లుగా చెబుతున్నారు. మరి ఏపీ మొత్తం మీద ఇలాగే అమలు చేసేందుకు చూస్తున్నారా అన్నది మరో చర్చ. అదే కనుక జరిగితే అసలే అంతంతమాత్రం ఆదాయాలతో గ్రామాలకు కనీస మౌలిక సదుపాయాలను కూడా సమకూర్చుకోలేని పంచాయతీలు ఇపుడు ఈ పెను భారాన్ని ఎలా తట్టుకుంటాయని అంటున్నారు. మరి పంచాయతీలకు సచివాలాయాలు అదనపు బాధ్యతగా అప్పగిస్తున్నారా అన్న డౌట్లు అయితే అందరిలో ఉన్నాయి. చూడాలి మరి ఏం జరుగుతుందో.