Begin typing your search above and press return to search.
సాహసం ఉంది కానీ అంధకారం తొలగడం లేదు ?
By: Tupaki Desk | 21 Feb 2022 8:30 AM GMTఒక ఎమ్మెల్యే కూడా లేని మన జనసేన కార్యకర్తలు ప్రాణాలు కోల్పోతే 5 లక్షలు ఇన్సూరెన్స్ ఇస్తున్నాం.అలాంటిది వేటకు వెళ్లి మత్స్యకారు లు ప్రాణాలు కోల్పోతే లక్షల కోట్ల బడ్జెట్ ఉన్న వైసీపీ ప్రభుత్వం ఎందుకు భీమా ఇవ్వలేకపోతుంది
- మత్స్యకార అభ్యున్నతి సభలో..పవన్ కల్యాణ్
నీలో సాహసం ఉంటే దేశంలో అంధకారం ఉంటుందా? - పవన్ కల్యాణ్
అవును! ఆయన సాహసం చేస్తున్నారు. స్పష్టమయిన అభిప్రాయాలతో రాజకీయం నడుపుతున్నారు.విద్వేషాలకు ఆనవాలుగా నిలిచే ఏ పనీ చేయరు. అదే సమయంలో విద్వేషాలను ఆయన ప్రోత్సహించరు.నా అభిమానులు అయినా సరే అలాంటివారిని దూరం పెడతాను అని చెబుతారు అదే చేస్తారు.
అయినా పవన్ ఎందుకని వెనుకంజలో ఉంటున్నారు. ఉంటే ఉండనీ కానీ ఆయన చేసిన విధంగా కార్యకర్తలెవ్వరికీ ఇవాళ మిగతా పార్టీలు అండగా ఉండడం లేదు అన్నది వాస్తవం.పవన్ సొంత డబ్బులతో ఎందరినో ఆదుకున్నారు.కొన్ని సందర్భాల్లో త్రివిక్రమ్ కొన్ని సందర్భాల్లో రాం చరణ్ ఆయన చెప్పిన మాటను పాటించి శ్రీకాకుళం ఉద్దానం లాంటి ప్రాంతాలకు ఇంతా ఇతరేతర ప్రాంతాలకు సాయం అందించిన దాఖలాలు ఉన్నాయి. ఒక్క మాటలో చెప్పాలంటే పవన్ మిగతా నాయకులందరి కన్నా పరిణితి ఉన్నవారు అని అంటారు ఆయన అభిమానులు.
ఇక వచ్చే ఎన్నికల్లో పవన్ ను అసెంబ్లీకి పంపుతామని అంటున్నారు ఆయన అభిమానులు.ఆ రోజు ఉద్దానం కేంద్రంగా ఆయన పోటీ చేసి ఉంటే, తప్పక గెలిచేవారని కూడా అంటారు ఆయన అభిమానులు. ఏదయితేనేం ఇప్పుడు పవన్ రాజకీయంగా మరింత ఎదుగుతున్నారు.గెలుపు ఓటములకు అతీతంగా తన పని తాను చేస్తున్నారు.టీడీపీ పొత్తు వద్దే వద్దు అని అభిమానులు అంటున్నారు కానీ ఆ విధంగా పవన్ ఆలోచిస్తున్నారా లేదా అన్నది ఇప్పుడే చెప్పలేం. కానీ పొత్తు కారణంగా ఆ రోజు అంటే 2014 ఎన్నికల్లో టీడీపీ బలపడింది. తరువాత పొత్తు లేని కారణంగా ఈ రోజు బలహీన పడింది అన్నది వాస్తవం.
కనుక టీడీపీ తో జనసేన వెళ్తే కొన్ని చోట్ల అయినా పవన్ మనుషులను గెలిపించే బాధ్యత చంద్రబాబు తీసుకోవాల్సిందే కానీ ఆయన ఆ విధంగా ఉంటారా లేదా అన్నది ఓ సందేహం. ఎందుకంటే పొత్తు ధర్మమే అది ఒకరికొకరు సాయపడుతూ, గెలుపునకు సహకరించుకోవడం.కానీ ఆ వేళ పవన్ పోటీ చేయలేదు.తరువాత పొత్తు లేదు. దీంతో కమ్యూనిస్టులు సీన్ లోకివచ్చారు. అయితే ప్రజాకర్షణ లేని పార్టీల కారణంగా 2019లో పవన్ కేవలం ఒక్కటంటే ఒక్క సీటుకే పరిమితం అయ్యారు.
ఆ ఒక్క ఎమ్మెల్యే (రాజోలు ఎమ్మెల్యే రాపాక వర ప్రసాదరావు) కూడా వైసీపీ గూటికి చేరిపోయారు. కానీ ఇప్పుడు పవన్ గతంలో చేసిన తప్పిదాలే చేయకుండా ప్రయాణిస్తే తప్పక సక్సెస్ అవుతారు. ఆ విధంగా ఆయన పనిచేయాల్సిందే!