Begin typing your search above and press return to search.

భుజాల‌ పై మోసిన నాయ‌కుడే గెంటేశాడు

By:  Tupaki Desk   |   19 March 2022 12:30 PM GMT
భుజాల‌ పై మోసిన నాయ‌కుడే గెంటేశాడు
X
త‌న నియోజ‌క‌వ‌ర్గ ఎమ్మెల్యే కోసం ఆ కింది స్థాయి నేత ఎంత చేయాలో అంత చేశారు. ఆయ‌న ఏ పార్టీలో ఉన్నా అండ‌గా నిల‌బ‌డ్డారు. ప్ర‌జ‌ల మ‌ద్ద‌తు కూడ‌గ‌ట్టి ఓట్లు వేయించారు. కానీ చివ‌ర‌కు భుజాల‌పై మోసిన ఆ నాయ‌కుడే ఇప్పుడా నేత‌ను బ‌య‌టకు గెంటేశారు. దీంతో ప‌రాభ‌వం భ‌రించ‌లేక వైసీపీకి రాజీనామా చేస్తున్న‌ట్లు ప్ర‌క‌టించిన ఆయ‌న క‌న్నీటి ప‌ర్యంత‌మయ్యారు.

ఇదీ క‌లికిరి పంచాయ‌తీ స‌ర్పంచ్ రెడ్డివారి ప్ర‌తాప్‌కుమార్ రెడ్డి క‌థ‌. వైసీపీ ప్రాథ‌మిక స‌భ్య‌త్వానికి రాజీనామా చేస్తున్న‌ట్లు ఆయ‌న ప్ర‌క‌టించ‌డం క‌లికిరి మండ‌లంతో పాటు పీలేరు నియోజ‌క‌వ‌ర్గంలో క‌ల‌క‌లం రేపుతోంది. త‌న రాజీనామా ప్ర‌క‌ట‌న‌తో పాటు అందుకు సంబంధించి విడుద‌ల చేసిన వీడియో సామాజిక మాధ్య‌మాల్లో వైర‌ల్‌గా మారింది.

గ‌త ఏడాది జ‌రిగిన స‌ర్పంచ్ ఎన్నిక‌ల్లో రాష్ట్రస్థాయిలో అత్య‌ధిక మెజారిటీ సాధించిన ఆరుగురిలో ప్ర‌తాప్‌కుమార్ ఒక‌రు. 40 ఏళ్లుగా న‌ల్లారి కుటుంబీకుల‌ను దీటుగా ఎదుర్కొంఊ ప్ర‌స్తుత ఎమ్మెల్యే చింత‌ల రామ‌చంద్రారెడ్డికి ప్ర‌తాప్ వెన్నుదన్నుగా నిలిచారు. కానీ ఇప్పుడు అదే ఎమ్మెల్యే తీరు కార‌ణంగా పార్టీ నుంచి వెళ్లిపోవాల్సి వ‌చ్చింది. రాజీనామా నిర్ణ‌యాన్ని ప్ర‌క‌టిస్తూ ప్ర‌తాప్ భావోద్వేగానికి గురి కావ‌డం అంద‌రినీ క‌లిచివేసింది.

వైసీపీ కార్య‌క‌ర్త‌ల్లో ఆయ‌న‌పై సానుభూతి వ్య‌క్త‌మ‌వుతోంది. ఎమ్మెల్యే ఒంటెద్దు పోక‌డ‌ల కార‌ణంగానే తాను పార్టీ నుంచి వైదొలుగుతున్న‌ట్లు ప్ర‌తాప్ ప్ర‌కటించారు. చింత‌ల ఏ పార్టీలో ఉన్నా ఆయ‌న్ని భూజాల‌కెత్తుకుని మోశామ‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు.

వైఎస్సార్ విగ్ర‌హం ఏర్పాటు కోసం త‌న సొంత స్థ‌లాన్ని ఇచ్చి ఎమ్మెల్యే ప‌రువు నిలబెట్టిన‌ట్లు ప్ర‌తాప్ పేర్కొన్నారు. తాను ఏ ప‌ద‌వీ ఆశించ‌కుండా చింత‌ల కోసం స‌ర్వ‌స్వం ఒడ్డి ప‌నిచేశాన‌ని ఆయ‌న చెప్పారు. ఎమ్మెల్యే నుంచి ఒక్క రూపాయి ఆశించ‌కుండా త‌న స్వ‌శ‌క్తితో స‌ర్పంచ్ అయ్యానని తెలిపారు. ఎంపీటీసీ ఎన్నిక‌ల్లోనూ ఎమ్మెల్యే నుంచి ఆర్థిక స‌హకారం కోర‌లేద‌ని స్ప‌ష్టం చేశారు. మెజారిటీ ఎంపీటీసీల‌ను గెలిపించుకుని న‌ల్లారి కుటుంబం నుంచి తొలిసారి ఎంపీపీ ప‌ద‌వి కైవ‌సం చేసుకునే ద‌శ‌లో ఎమ్మెల్యే తాను ఊహించ‌ని విధంగా ఎంపీపీని ఎన్నిక చేశార‌ని ఆరోపించారు. క‌నీసం త‌న‌ను సంప్ర‌దించ‌లేద‌ని చెప్పారు.

మండ‌ల స‌మావేశం నుంచి సొంత పార్టీ వాళ్లే పోలీసుల‌తో గెంటించార‌ని ఆరోపించారు. ఎమ్మెల్యే పీఏ ఆనంద‌రెడ్డి ఎంపీడీవో కార్యాల‌యంలో కూచుని పోలీసుల‌ను త‌న‌పైకి ఉసిగొల్పార‌ని ఆయ‌న ఆవేద‌న వ్య‌క్తం చేశారు. మ‌రోవైపు ఇప్ప‌టికే వివిధ ప్రాంతాల్లో వైసీపీ ఎమ్మెల్యేల‌పై కింది స్థాయి నేత‌ల్లో తీవ్ర అసంతృప్తి వ్య‌క్త‌మ‌వుతోంది. తాజాగా ప్ర‌తాప్‌రెడ్డి రాజీనామాతో ఆ ప్ర‌భావం మ‌రోసారి బ‌య‌ట‌ప‌డింది.