Begin typing your search above and press return to search.
ఐపీఎల్ కామెంటేటర్ గా రైనా.. చెన్నై తదుపరి కెప్టెన్ గా ఎవరుండాలన్నాడంటే?
By: Tupaki Desk | 24 March 2022 1:30 AM GMTసురేశ్ రైనా.. 19 ఏళ్ల వయసుకే టీమిండియాలోకి వచ్చి.. ఓ దశలో మూడు ఫార్మాట్లలోనూ జట్టులో చోటు దక్కించుకుని.. మేటి ఫీల్డర్ గా, అద్భుతమైన ఎడమచేతివాటం బ్యాటర్ గా పేరుగాంచాడు. ఇక ఐపీఎల్ ప్రారంభమైన 2008 నుంచి చెన్పై సూపర్ కింగ్స్ జట్టులో కీలక ఆటగాడిగా ఉన్నాడు. చెన్నై కప్ లు గెలవడంలో రైనాది కీలక పాత్ర. అలాంటి రైనా.. 2020 ఆగస్టులో అకస్మాత్తుగా అంతర్జాతీయ కెరీర్ కు వీడ్కోలు పలికి అందరినీ ఆశ్చర్యపరిచాడు. 2021 ఐపీఎల్ లీగ్ లో అనూహ్యంగా జట్టునుంచి బయటకొచ్చి వివాదాస్పదం అయ్యాడు.
హోటల్ రూమ్ విషయంలో జట్టు యాజమాన్యంతో విభేదించాడని, జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు వదిలేశాడని విమర్శలు ఎదుర్కొన్నాడు. దీంతో 2022 సీజన్ కు చెన్నై రైనాను రిటైన్ చేసుకోలేదు. అంతేకాదు.. వేలంలో మరే జట్టూ అతడిని కొనుగోలు చేయలేదు. గుజరాత్ టైటాన్స్ కు జేసన్ రాయ్ దూరమవడంతో ఆ చాన్స్ రైనాకు వస్తుందని అనుకున్నా చివరకు అదీ దక్కలేదు. ఇప్పుడతడు ఐపీఎల్ 2022లో కామెంటేటర్ గా అవతారం ఎత్తనున్నాడు.
కెప్టెన్ కావాల్సినోడు.. కెప్టెన్సీపై జోస్యం చెబుతూ
వాస్తవానికి రైనా కుదురుగా ఉంటే.. వచ్చే సీజన్ కు చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ కావాల్సినోడు. ఎలాగూ మహేంద్ర సింగ్ ధోనికి ఇదే ఆఖరి సీజన్ అంటున్నారు. కాబట్టి రైనాకే ఆ చాన్స్ దక్కేది. కానీ, అతడు దానిని చేజేతులా చెడగొట్టుకున్నాడు. ఇప్పుడనే కాదు. రైనాకు మొదటినుంచి కెరీర్ పట్ల సీరియస నెస్ లేదనిపిస్తుంది. మూడు, నాలుగేళ్లు ఆడే అవకాశం ఉన్నప్పటికీ.. ధోనితో రిటైర్ కావడం, అంతర్జాతీయ కెరీర్ ను సీరియస్ గా తీసుకోకపోవడం, మధ్యలో గాయాలు అతడి భవిష్యత్ ను దెబ్బతీశాయి. ఇప్పడేమో ఐపీఎల్ కెరీర్ ఇలాగుంది. అదంతా వదిలేస్తే.. ఐపీఎల్ లో అత్యంత ఆకర్షణీయమైన జట్టు చెన్నై సూపర్ కింగ్స్ తదుపరి కెప్టెన్ ఎవరో చెప్పాడీ లెఫ్ట్ హ్యాండ్ స్టయిలిష్ బ్యాట్స్ మన్.
ధోని కాకుంటే..
ఐపీఎల్‌లో లీగ్ ప్రారంభమైనప్పటి నుంచి ఒకే ఒక్క ఆటగాడిని మాత్రమే కెప్టెన్‌గా కొనసాగించిన ఏకైక జట్టు చెన్నై సూపర్ కింగ్స్. ఐపీఎల్ ప్రారంభం నుంచి చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్‌గా మహేంద్ర సింగ్ ధోనీ కొనసాగుతున్నాడు. త్వరలో ఐపీఎల్ కి కూడా ధోనీ గుడ్‌బై చెప్పనున్నాడని చాలా కాలంగా చర్చ జరుగుతోంది. అయితే ధోని తర్వాత ఈ సింహాసనాన్ని ఎవరు కైవసం చేసుకుంటారనేది ఇంకా ఖరారు కాలేదు. గత సీజన్ వరకు చెన్నై సూపర్ కింగ్స్ తరపున ఆడిన సురేశ్ రైనా.. ఈ ప్రశ్నకు సమాధానం అందించాడు.
కెప్టెన్‌గా ఎవరంటే?
"రవీంద్ర జడేజా, అంబటి రాయుడు, రాబిన్ ఉతప్ప, డ్వేన్ బ్రావో రాబోయే కాలంలో జట్టుకు కెప్టెన్‌గా ఉండగలరు. వారందరూ సమర్థులు. ఆటను బాగా అర్థం చేసుకుంటారు. వచ్చే సీజన్‌లో ఈ ఆటగాళ్లలో ఎవరైనా ధోనీ స్థానాన్ని భర్తీ చేయగలరు" అని రైనా పేర్కొన్నాడు. కాగా, ధోనీ కెప్టెన్సీలో రైనా సీఎస్‌కే వైస్ కెప్టెన్‌గా ఉండేవాడు. ధోనీ, రైనా మధ్య ఎంతో స్నేహం ఉండేది.
సీఎస్కే అభిమానులు ధోనిని తలా అని పిలుస్తుంటే, రైనాను చిన్న తలా అని పిలుస్తుంటారు. ఐపీఎల్‌లో కామెంటేటర్‌గా అరంగేట్రం గురించి అడిగినప్పుడు, వ్యాఖ్యానించడం నిజంగా కష్టమని చెప్పాడు. అందుకు నేను సిద్ధమేనని చెప్పాడు. తన స్నేహితులు ఇర్ఫాన్ పఠాన్, హర్భజన్ సింగ్, పీయూష్ చావ్లా ఇప్పటికే ఈ ఫీల్డ్‌లో ఉన్నారు. ఈ సీజన్‌లో రవిశాస్త్రి కూడా నాతోపాటు ఉంటారు. కనుక ఇది నాకు తేలికగా ఉంటుందని నేను భావిస్తున్నాను. నేను నా స్నేహితుల నుంచి చిట్కాలను తీసుకుంటూ ముందుకుసాగుతాను అంటూ వెల్లడించాడు.