Begin typing your search above and press return to search.
రేవంత్ తాజా సవాల్ ను లైట్ తీసుకుంటే కేటీఆర్ కు చిక్కులేనా?
By: Tupaki Desk | 6 April 2022 11:07 AM GMTఒక సవాలు ఇప్పుడు అందరు కనుబొమ్మలు ఎగురేసి.. ఏంటి సంగతి? అన్న పరిస్థితికి వచ్చిందన్న మాట వినిపిస్తోంది. అనూహ్యంగా ఆదివారం తెల్లవారుజామున బంజారాహిల్స్ లోని రాడిసన్ బ్లూ హోటల్ పరిధిలోని పబ్ లో డ్రగ్స్ వినియోగం వెలుగు చూడటం పెను సంచలనంగా మారింది. ఈ సందర్భంగా 148 మందిని పోలీస్ స్టేషన్ కు తరలించారు. దాదాపు ఏడెనిమిది గంటలు స్టేషన్ లో ఉంచిన అనంతరం వారి వివరాలు సేకరించి ఇళ్లకు పంపేయటం తెలిసిందే. ఎప్పటిలానే ఈ ఇష్యూ అధికార.. విపక్షాల మధ్య మాటల యుద్ధానికి తెర తీసింది.
తెలంగాణ అధికారపక్షానికి చెందిన నేతలు కొంచెం తొందరపడి టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిపై గురి పెట్టారన్న మాట వినిపిస్తోంది. తనిఖీలు జరిగిన పబ్ లో రేవంత్ బంధువు ప్రణయ్ రెడ్డి ఉన్న విషయాన్ని ప్రస్తావిస్తూ.. ఆయన్ను ఇరుకున పడేసే ప్రయత్నం చేశారు. దీనిపై తాజాగా రియాక్టు అయిన రేవంత్ రెడ్డి ఘాటు సవాలు విసిరి.. గులాబీ బాస్ తో సహా అందరిని ఉక్కిరిబిక్కిరి చేశారు.
డ్రగ్స్ విచారణకు తన కుటుంబంలోని పిల్లలందరి రక్త నమూనాలు ఇప్పిస్తానని.. సీఎం కేసీఆర్ సైతం తన కుమారుడు కేటీఆర్ నమూనాల్ని ఇప్పిస్తారా? అని ప్రశ్నించిన వైనం ఇప్పుడు కలకలాన్ని రేపుతోంది.
చిన్న పిల్లల్ని అడ్డు పెట్టుకొని నీచ రాజకీయాలకు పాల్పడుతున్నారంటూ కేసీఆర్ సర్కారు మీద నిప్పులు చెరిగారు. ప్రభుత్వం చేసే బ్లాక్ మొయిల్ కు లొంగనని చెప్పిన ఆయన.. "రైడ్ చేసిన సందర్భంలో సూదిని ప్రణయ్ రెడ్డి ఉన్నారని మీరే చెప్పారు. పోలీస్ స్టేషన్ లో కూర్చొబెట్టి ఉదయం పంపించేశారు. మా కుటుంబ సభ్యులు కానీ నేను కానీ ప్రణయ్ ని విడిచిపెట్టమని అడిగామా? కేసు నుంచి తప్పించమని ఒత్తిడి చేశామా?" అని ప్రశ్నించారు.
ఈ ప్రశ్నల వర్షం కురిపిస్తూనే.. పబ్ నుంచి అదుపులోకి తీసుకున్న వారి నుంచి బ్లడ్ శాంపిల్స్.. వెంట్రుకల నమూనాలను సేకరించి.. ఎవరు డ్రగ్స్ తీసుకున్నారో తేల్చే అధికారంలో పోలీసులకు ఉన్నా.. ఎందుకు వదిలేశారన్న కీలక ప్రశ్నను సంధించారు. అంతేకాదు.. పోలీసులకు కేటీఆర్ ఫోన్ చేసి.. చూసిచూడనట్లు చెప్పారన్న ఆరోపణను చేశారు.
ఇదంతా ఒక ఎత్తు అయితే.. తన కుటుంబంలో ఎవరిని తీసుకొచ్చి టెస్టులు చేయించమన్నా చేయిస్తానని.. అదే సమయంలో మంత్రి కేటీఆర్ సైతం బ్లడ్ శాంపిల్ ఇవ్వటానికి సిద్ధపడతారా? అంటూ అడిగిన ప్రశ్న కచ్ఛితంగా ఆయన ఇమేజ్ కు క్వశ్చన్ మార్కులా మారిందంటున్నారు. మిగిలిన సందర్భాల్లో చేసే సవాళ్లకు స్పందించినా.. లేకున్నా ఫర్లేదు కానీ.. తాజా ఉదంతంలో మాత్రం రేవంత్ లేవెనెత్తిన సందేహాన్ని తీర్చాల్సిన అవసరం ఉందన్న మాట వినిపిస్తోంది. మరేం జరుగుతుందో చూడాలి.