Begin typing your search above and press return to search.

కాంట్రాక్టు ఆటగాళ్లు.. నేరుగా మీడియాతో మాట్లాడొద్దు : బీసీసీఐ

By:  Tupaki Desk   |   22 Feb 2022 10:32 AM GMT
కాంట్రాక్టు ఆటగాళ్లు.. నేరుగా మీడియాతో మాట్లాడొద్దు : బీసీసీఐ
X
జర్నలిస్టు ఇంటర్వ్యూ అడగడం.. దానికోసం క్రికెటర్ వృద్దిమాన్ సాహాకు బెదిరింపు తరహాలో మెసేజ్ లు పంపడం మరో మలుపు తిరిగింది. సాహా- జర్నలిస్టు మధ్య వ్యవహారంతో కాంట్రాక్టు క్రికెటర్లు మీడియాతో ఎలా ఉండాలనేదానిపై బీసీసీఐ మార్గదర్శకాలు ఇచ్చింది. శ్రీలంకతో టెస్టు సిరీస్ కు ఇటీవల ప్రకటించిన జాతీయ జట్టులో సాహాకు చోటుద్కని సంగతి తెలిసిందే. దీనిపై సాహా.. ఏకంగా కోచింగ్ సిబ్బందిపై ఆరోపణలక దిగాడు. హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ తనను రిటైర్ కమ్మని చెప్పాడంటూ సాహా బాంబు పేల్చిన సంగతి తెలిసిందే. మధ్యలో బీసీసీఐ అధ్యక్షుడు సౌరభ్ గంగూలీనీ సాహా వివాదంలోకి లాగాడు. అయితే, దీనిని ద్రవిడ్ తనదైన తరహాలో అడ్డుకున్నాడు.

సాహా దేశానికి చేసిన సేవలు చాలా అమూల్యమంటూ మాజీ కీపర్ గొప్పదనాన్ని కీర్తించాడు. ఇదంతా కొనసాగుతుండగానే.. సాహా -జర్నలిస్టు వివాదం వెలుగులోకి వచ్చింది. 'భారత క్రికెట్ జట్టుకు నేను చేసిన సేవలకు గాను ఒక జర్నలిస్ట్ నుంచి ఎదురైన అనుభవం ఇది. జర్నలిజం ఇంత దిగజారిపోయింది' అంటూ సాహా ఆవేదన వ్యక్తం చేశాడు. అయితే సాహా ట్వీట్‌కు స్పందించిన అభిమానులు, మాజీ క్రికెటర్లు అతనికి మద్దతు తెలిపారు. సదరు జర్నలిస్ట్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ జర్నలిస్టు వివరాలు చెప్పాలంటూ, బోర్డు అండగా నిలవాలంటూ మాజీ క్రికెటర్లు మాట్లారు. అయితే, అతడి ఎవరనేది తాను వెల్లడించనంటూ సాహా హుందాగా స్పందించాడు.

ఈ నేపథ్యంలో టీమిండియా కాంట్రాక్ట్ ఆట‌గాళ్లు మీడియాతో నేరుగా సంప్ర‌దింపులు జ‌రిపే అంశానికి సంబంధించి స‌రికొత్త మార్గ‌ద‌ర్శ‌కాల‌ను అమ‌లు చేసే యోచ‌న‌లో ఉన్న‌ట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన గైడ్‌లైన్స్ వివ‌రాలు ఇలా ఉన్నాయి. త్వ‌ర‌లో లంకతో ప్రారంభంకానున్న సిరీస్ నుంచే కొత్త గైడ్‌లైన్స్‌ను ఆచ‌ర‌ణ‌లోకి తీసుకురావాలని భార‌త క్రికెట్ బోర్డు నిర్ణ‌యించిన‌ట్లు స‌మాచారం.

రెండు దశాబ్దాల కిందట మ్యాచ్ ఫిక్సింగ్ తోనే చర్యలు

వాస్తవానికి 2000 సంవత్సరానికి ముందు క్రికెటర్లు మీడియాతో నేరుగా మాట్లాడే అవకాశాలుండేవి. అయితే, ఎప్పడైతే మ్యాచ్ ఫిక్సింగ్ ఉదంతం వెలుగులోకి వచ్చిందో అప్పటినుంచి ఆటగాళ్లపై ఆంక్షలు అధికమయ్యాయి. క్రికెటర్లు నేరుగా మీడియాతో మాట్లాడే అవకాశమే లేకపోయింది. అధికారిక ప్రసారదారు లేదా బీసీసీఐ విడుదల చేసే అంశాల వారీగానే తప్ప ప్రత్యక్షంగా క్రికెటర్లతో మాట్లాడి వివరాలు తెలుసుకునే చాన్సే లేకుండా పోయింది.

తాజాగా సాహా- జ‌ర్న‌లిస్ట్ మ‌ధ్య వివాదంతో టీమిండియా కాంట్రాక్ట్ ఆట‌గాళ్లు మీడియాతో నేరుగా సంప్ర‌దింపులు జ‌రిపే అంశానికి సంబంధించి స‌రికొత్త మార్గ‌ద‌ర్శ‌కాల‌ను అమ‌లు చేసే యోచ‌న‌లో ఉన్న‌ట్లు తెలుస్తోంది.

ఇంటర్వ్యూ కోసం ఓ జర్నలిస్ట్ తీవ్ర ఒత్తిడి తెచ్చాడని ఆరోపిస్తూ సాహా ట్వీట్ చేసిన విషయం తెలిసిందే. దీనికి సంబంధించిన వాట్సాప్ స్క్రీన్ షాట్లను సైతం అతను షేర్ చేశాడు. ఇంటర్వ్యూకు అంగీకరించకపోవడంతో సదరు జర్నలిస్ట్ బెదరింపులకు దిగాడని సాహా పేర్కొన్నాడు. ఈ విష‌యాన్నిట్విట్ట‌ర్ వేదిక‌గా వెల్ల‌డించాడు.ఇవీ కొత్తగా తేనున్న మీడియా గైడ్ లైన్స్

- బీసీసీఐ కాంట్రాక్టు ఉన్న ఆటగాళ్లతో మీడియా నేరుగా మాట్లాడ‌కూడ‌దు.

- బీసీసీఐ మీడియా (Media) మేనేజర్ ద్వారానే ఆటగాళ్లు-మీడియా మధ్య సమాచారం బదిలీ జ‌ర‌గాలి.

- పబ్లిక్ ఫంక్షన్లు, ప్రెస్ కాన్ఫరెన్స్ లలో ఆటగాళ్లు మీడియాతో మాట్లాడే వెసులుబాటు య‌ధాత‌థంగా కొన‌సాగ‌నుంది.

- బీసీసీఐకి సమాచారం ఇవ్వకుండా అనుచిత వ్యాఖ్యలు చేసే ఆటగాడిపై నిషేధం లేదా జరిమానా విధించే అవకాశం ఉంది.

- బీసీసీఐ మీడియా మేనేజర్ అనుమతి లేకుండా ఆటగాళ్ల ఇంటర్వ్యూలు, బైట్స్ తీసుకునే జర్నలిస్టులను ఏడాది పాటు బ్లాక్ లిస్ట్ లో పెట్టే అవ‌కాశం ఉంది.

- అండర్-19 క్రికెటర్లకు కూడా ఈ నిబంధ‌న‌లు వర్తిస్తాయి.

ఇంటర్వ్యూ కోసం ఓ ప్ర‌ముఖ జర్నలిస్టు బెదిరించినట్లు టీమిండియా సీనియ‌ర్ వికెట్‌కీప‌ర్ సాహా సంచ‌ల‌న‌ ఆరోప‌ణ‌ల నేప‌థ్యంలో ఈ తరహా ఘటనలు పునరావృతం కాకూండా ఉండేందుకు బీసీసీఐ పటిష్టమైన చర్యలు చేపట్టే దిశగా అడుగులు వేస్తుంది. ఇందులో భాగంగానే మీడియాకు కొత్త గైడ్‌లైన్స్‌ విధించేందుకు సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది.

4 రకాల కాంట్రాక్టులు

బీసీసీఐ ప్రస్తుతం నాలుగు రకాల కాంట్రాక్టు విధానాన్ని అవలంబిస్తోంది. కొన్నేళ్ల కిందటి వరకు మూడు గ్రేడ్ లే ఉండేవి. ఏ, బీ, సీ లుగా వీటిని విభజించి ఆటగాళ్ల ప్రదర్శనను బట్టి గ్రేడ్ లు కేటాయించేవారు. అత్యున్నంతగా ఆడుతున్నవారికి.. బహుశా మూడు ఫార్మాట్లలోనూ

శాశ్వత సభ్యులకు ఏ గ్రేడ్ ఇస్తోంది. మిగిలినవారికి బి, సి కేటాయిస్తోంది. వీరిలోనూ విశేషంగా రాణిస్తున్నవారికి ప్రత్యేకంగా ఏ+ గ్రేడ్ర్ ను రూపొందించింది. కోహ్లి, రోహిత్, బుమ్రా వంటి సూపర్ స్టార్ ప్లేయర్లకు ఈ గ్రేడ్ దక్కుతోంది.