Begin typing your search above and press return to search.

ప‌లాస : మంత్రి ఇలాకాలో ఆత్మ‌హత్యా రాజ‌కీయం!

By:  Tupaki Desk   |   19 March 2022 8:30 AM GMT
ప‌లాస : మంత్రి  ఇలాకాలో ఆత్మ‌హత్యా రాజ‌కీయం!
X
మంత్రి సీదిరి అప్ప‌ల్రాజు ఇలాకా ప‌లాస‌లో ఆత్మ‌హ‌త్యా రాజ‌కీయం రాజుకుంటోంది.ఇక్క‌డ మంద‌స మండ‌లంలో టీడీపీ కార్య‌క‌ర్త కోన వెంక‌ట‌రావు ఆత్మ‌హత్య‌కు పాల్ప‌డిన ఘ‌ట‌న చుట్టూ పెను సంచ‌ల‌నాత్మ‌క ప‌రిణామాలే ముడి ప‌డి ఉన్నాయి. పోలీసుల వేధింపుల కార‌ణంగానే ఆయ‌న ఆత్మ‌హత్య‌కు పాల్ప‌డ్డార‌న్న‌ది ఆయ‌న కుటుంబ స‌భ్యుల అభియోగం. ఈ నేప‌థ్యంలో నిన్న‌టి వేళ మాజీ ఎమ్మెల్సీ బుద్దా వెంక‌న్న ప‌లాస‌కు చేరుకుని కోన వెంక‌ట‌రావు సంతాప‌స‌భ‌లో పాల్గొన్నారు.

ఆయ‌న స్వ‌గ్రామం పొత్తంగిలో జ‌రిగిన సంతాప స‌భ‌లో బుద్ధా వెంక‌న్న కీల‌క వ్యాఖ్య‌లు చేశారు.మంత్రి సీదిరి అప్ప‌ల్రాజు,ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీ‌ను,డీఎస్పీ ఒత్తిడి కార‌ణంగానే త‌మ కార్య‌క‌ర్త ఆత్మ‌హ‌త్య చేసుకున్నార‌ని ఆరోపించారు. బాధిత కుటుంబానికి తెలుగుదేశం పార్టీ త‌ర‌ఫున రెండు ల‌క్ష‌లు, త‌న త‌ర‌ఫున యాభై వేలు, గౌతు శివాజీ కుమార్తె ప‌లాస తెలుగుదేశం పార్టీ నియోజ‌క‌వ‌ర్గ ఇంఛార్జి శిరీష త‌ర‌ఫున యాభై వేలు అందించారు. కోన వెంక‌ట‌రావు పిల్ల‌ల‌ను ఎన్టీఆర్ ట్ర‌స్టు ద్వారా చ‌దివిస్తామ‌ని అన్నారు.

ఇదిలా ఉంటే రానున్న కాలంలోనూ మంత్రిగా సీదిరి కొన‌సాగే అవ‌కాశాలే ఎక్కువగా ఉండ‌డంతో త‌మ‌పై వేధింపులు మ‌రింత పెరుగ‌తాయి అన్న ఆందోళ‌న‌లో టీడీపీ ఉంది.మంత్రివ‌ర్గంలో మార్పులు ఉన్నా కూడా సీదిరిని మాత్రం మార్చ‌రు అని తేలిపోయింద‌ని,అదే క‌నుక నిజం అయితే ఇక‌పై క్షేత్ర స్థాయిలో శిరీష నేతృత్వంలో వైసీపీ నియంతృత్వ పోక‌డ‌ల‌పై రాజీ లేని పోరుకు తాము సిద్ధ‌మేన‌ని టీడీపీ అంటోంది.

వ‌చ్చే ఎన్నిక‌ల్లో ప‌లాస నుంచి శిరీష పోటీ చేయ‌నున్నార‌ని బుద్ధా వెంక‌న్న నిన్న‌టి వేళ ప్ర‌క‌టించ‌డంతో వైసీపీ అప్ర‌మ‌త్తం అయింది.ఈ త‌రుణంలో మ‌ళ్లీ త‌మ త‌ర‌ఫున గెలిచేది సీదిరి అప్ప‌ల్రాజేన‌ని వీరంతా డ‌ప్పు కొట్టి మ‌రీ చెబుతున్నారు.వాస్త‌వానికి అప్ప‌ల్రాజు కొన్ని అభివృద్ధి ప‌నుల‌కు ప్రాధాన్యం ఇచ్చినా కూడా నియోజ‌క‌వ‌ర్గ ప్ర‌గ‌తికి నిధుల లోటు అన్న‌ది సుస్ప‌ష్టంగా ఉంది.అందుకే దీనినే ప్ర‌ధానాస్త్రంగా చేసుకుని ఉద్దానం స‌మ‌స్య‌ల‌ను సైతం ప‌రిష్క‌రించ‌లేక‌పోయిన పార్టీగా వైసీపీని చిత్రిస్తూ పోరు బాట‌లో పోనుంది టీడీపీ.

మ‌రోవైపు టీడీపీ కార్య‌క‌ర్త ఆత్మ‌హ‌త్య‌కు సంబంధించి న్యాయ విచార‌ణ‌కు సైతం వైసీపీ ముందుకు రాకపోవ‌డంతో మ‌రిన్ని ఆరోప‌ణ‌లూ వ‌స్తున్నాయి.ఇవే మంత్రి చ‌రిష్మాకు ఆటంకంగా మార‌నున్నాయి.చిన్న స్థాయి నుంచి వ‌చ్చిన నేత‌గా సీదిరికి ఆ రోజు పేరున్న‌ప్ప‌టికీ ఇవాళ అంత‌టి స్థాయిలో గౌర‌వం అన్న‌ది ప్ర‌జ‌ల్లో లేదు అన్న‌ది వాస్త‌వం. అలా అని టీడీపీ కూడా త‌ప్పులు చేయ‌లేదా అంటే చేసింది.

అధికారంలో ఉన్న‌ప్పుడు శివాజీ అల్లుడు, శిరీష భ‌ర్త వెంక‌న్న చౌద‌రి నేతృత్వంలో పెద్ద ఎత్తున ల్యాండ్ మాఫియా జ‌రిగింది అని ఆ రోజు టీడీపీ పై వైసీపీ ఆరోప‌ణ‌లు చేసింది.విడ్డూరం ఏంటంటే అధికారంలోకి రాగానే నాటి ఆరోప‌ణ‌ల‌ను రుజువు చేయాల్సిన బాధ్య‌త‌ను వైసీపీ ఎప్పుడో మ‌రిచిపోవ‌డం.అందుకే అటు సీదిరి కానీ ఇటు శిరీష కాన్నీ అనుకున్నంత సులువుగా రాజ‌కీయ ర‌ణ రంగంలో నెగ్గుకు రావ‌డం ఇప్పుడున్న పరిణామ గ‌తుల్లో క‌ష్టం.