Begin typing your search above and press return to search.
వివాదాల సీదిరి... మూడేళ్లలోనే సీన్ టోటల్ రివర్స్...!
By: Tupaki Desk | 15 Feb 2022 2:48 AM GMTకేవలం తన వర్గాన్ని ప్రోత్సహించడం.. వారితో జేజేలు కొట్టించుకోవడానికే మంత్రి పరిమితమవుతున్నార నే విమర్శలు ఎక్కువ అయ్యాయి. ఆయన నోటి దురుసు కూడా పెరిగిందని.. నియోజకవర్గంలో టాక్ వినిపిస్తోంది. అంతేకాదు.. ఏదైనా సమస్యలపై ప్రజలు తనదగ్గరకు వచ్చినా.. తీరిక లేదంటూ.. వారిని పంపేస్తున్నారన్న విమర్శలు ఇటీవల ఎక్కువుగా వినిపిస్తున్నాయి.
మరీ ముఖ్యంగా భూ కబ్జాలకు సంబంధించి వస్తున్న ఆరోపణలకు కూడా మంత్రి రియాక్ట్ కాకపోవడంతో.. ఇక్కడి గిరిజనులు మరింత ఇబ్బంది పడుతున్నారు. ఇటీవల నియోజకవర్గం పరిధిలోని మందస మేజర్ పపంచాయతీ పరిధిలో ఉన్న మేఘమాల గిరిజన సమీపంలో రెవెన్యూ, ఫారెస్టు, నీటిపారుదల శాఖలకు చెందిన వందలాది ఎకరాల భూమితోపాటు.. దళితులకు ప్రభుత్వం ఇచ్చిన భూములను కూడా కొందరు ఆక్రమిస్తున్నారనే ఫిర్యాదులు వచ్చాయి.
కొందరు రెవెన్యూ అధికారుల అండతో అక్రమార్కులు సదరు భూములనను సొంతం చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారట. ఈ విషయాలపై.. పత్రికల్లోనూ కథనాలు వచ్చాయి. ఈ క్రమంలో బాధితులు.. మం త్రిని కలిసి తమ గోడు చెప్పుకొనేందుకు ప్రయత్నించారు. అయితే.. ఈ సమస్యలను పరిష్కరించాల్సిన మంత్రి సీదిరి మాత్రం కనీసం వారి గోడును వినేందుకు కూడా సమయం కేటాయించలేదన్న ఆరోపణలు ఉన్నాయి.
మరోవైపు.. భూములు కాజేసిన వారు కూడా మంత్రి చుట్టూ తిరుగుతున్నారు. అయినా.. మంత్రి మాత్రం తనకు ఏమీ తెలియనట్టే వ్యవహరిస్తున్నారన్న చర్చ స్థానికంగా వినిపిస్తోంది. ఇక, అభివృద్ది విషయాన్ని ఆయన అసలు పట్టించుకోవడమే మానేశారు.
అంతేకాదు... ప్రజలకు చేరువగా ఉండాల్సిన మంత్రి నియోజకవర్గానికి తక్కువుగా టైం కేటాయిస్తున్నారని కూడా అంటున్నారు. ఇక పోలీసులపైనా.. దూకుడుగా వ్యవహరిస్తూ.. అధికారులను కూడా బెదిరిస్తు న్నారనే వార్తలు వస్తున్నాయి. మరి సీదిరి ప్రజలకు సేవ చేయడానికి వచ్చారా? లేక.. తనకు జేజేలు కొట్టించుకునేందుకు తన వర్గాన్ని పెంచి పోషించుకునేందుకు మంత్రి పదవిని చేపట్టారా? అనేది చర్చకు దారితీస్తోంది.
నియోజకవర్గంలో అనేక సమస్యలు ఉన్నాయి. అయినప్పటికీ.. వాటిని గాలికి వదిలేసి.. మీడియాలో హైలెట్ అయ్యేందుకు ప్రయత్నిస్తున్నారనే విమర్శలు వినిపిస్తుండడం గమనార్హం.