Begin typing your search above and press return to search.
పోయి పోయి అనిల్ తోనే పెట్టుకున్నారుగా..!
By: Tupaki Desk | 27 Nov 2022 12:30 PM GMTఅసలే ఇమేజ్ తక్కువ.. సో, అప్పుడు ఎవరైనా ఏం చేస్తారు? ఉన్న ఇమేజ్ పోగొట్టుకునేందుకు కాకుండా.. కాపాడు కునేందుకు ప్రాధాన్యం ఇస్తారు. అయితే, దీనికి భిన్నంగా రాష్ట్ర బీజేపీ నాయకులు కొత్త విషయా లు కెలుకుతున్నారు.
ఏదోసాధించాలని చేస్తున్న ఈ ప్రయత్నంలో ఉన్నది కూడా పోగొట్టుకుంటున్నారనే టాక్ వినిపిస్తోంది. మరి ఇది ఎంత వరకు వారికి ప్లస్ అవుతోంది? అంటే.. అంతా మైనస్సేనని అంటున్నా రు సొంత పార్టీ నాయకులే.
ఉదాహరణకు తాజాగా రెండు విషయాలను ప్రస్తావించిన బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు.. ఆ రెండు విష యాల్లోనూ ఫుల్లుగా బద్నాం అయ్యారు. ఒకటి.. వైసీపీ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాల నిధులు.
రెం డు నెల్లూరు సిటీ ఎమ్మెల్యే వ్యవహారం. ఈ రెండు విషయాలను డైరెక్ట్‌గా.. సోము వీర్రాజు జోక్యం చేసుకు న్నారు. కేంద్రం ఇస్తున్న నిధులను సీఎం జగన్ తన విలాసాలకు ఖర్చు చేస్తున్నారు..అంటూ ఆయన కామెంట్లు చేశారు. చిన్న పాటి దూరాలకు కూడా హెలికాప్టర్లు వాడుతున్నారని అన్నారు.
అయితే, ఈ వ్యాఖ్యలకు సొంత పార్టీ నుంచి కూడా మద్దతు రాలేదు. దీంతో సోము చేసిన వ్యాఖ్యలు అక్క డితో ఆగిపోయాయి ఇక, నెల్లూరు సిటీ ఎమ్మెల్యే అనిల్‌కుమార్ యాదవ్ స్వామి దీక్షలో ఉండి.. ముస్లింలు నిర్వహించిన కార్యక్రమానికి వెళ్లారని, వారు ధరించే టోపీ పెట్టుకున్నారని, వస్త్రాన్ని కప్పుకొన్నారని.. ఇది హిందూ మతాన్ని అగౌరవ పరచడమేనని సోము సహా పలువురు యాగీ చేశారు. ఇది తమకు మైలేజీ ఇస్తుందని అనుకున్నారు.
అయితే, అనూహ్యంగా ఇది బెడిసి కొట్టింది. ముస్లింల విషయంలో సోము వీర్రాజు నేర్చుకోవాల్సి ఉందం టూ.. మాజీ మంత్రి విరుచుకుపడ్డారు. శబరిమల వెళ్లిన వారు.. ఫస్ట్ దర్శించుకునేది దర్గాయేనని, ఈ విషయం కూడా సోము తెలియదా? అని ఆయన ప్రశ్నించారు.
దీంతో ఈ ప్రయోగం కూడా విఫలమైంది. పైగా.. సోముకు మద్దతుగా ఈ విషయంలో ఎవరూ మాట్లాడకపోవడం గమనార్హం. ఒక్క ఆయన బ్యాచ్‌గా ఉన్న విష్ణువర్ధన్‌రెడ్డి తప్ప ఎవరూ దీనిని పట్టించుకోలేదు. సో... పోయిపోయి అనిల్‌తో పెట్టుకుని పరువు పోగొట్టుకున్నారని సొంత పార్టీలోనే నాయకులు గుసగుసలాడుతుండడం గమనార్హం.