Begin typing your search above and press return to search.
సోనియా, రాహుల్ నోటివెంట.. తెలుగు సినిమా పాపులర్ డైలాగ్
By: Tupaki Desk | 14 March 2022 11:29 AM GMTపుష్ప.. తగ్గేదెలే.. పుష్ప అంటే ఫ్లవర్ అనుకుంటివా..? ఫైర్.. ఇటీవల ఎక్కడ చూసినా ఇవే డైలాగులు. ఆఖరికి పత్రికల హెడ్డింగుల్లోనూ ఇవే శీర్షికలు. పుష్ప సినిమా డైలాగులు అంతగా చొచ్చుకెళ్లాయి మరి. వాస్తవానికి పుష్ప అనే కాదు.. చాలా సినిమా డైలాగులు జనంలోకి వారి నుంచి పత్రికల్లోకి వస్తుంటాయి. ఇది ఎప్పటినుంచో చూస్తున్నదో. "నా పేరు శివమణి.. నాక్కొంచెం మెంటల్" అంటూ నాగార్జున చెప్పిన డైలాగ్ కానీ, దాన్నే కొంచెం మార్చి, అదే పోలీసు వేషధారి అయిన పవన్ కల్యాణ్ తో 'నాక్కొంచె తిక్కుంది.. కానీ దానికో లెక్కుంది' అంటూ చెప్పించిన డైలాగులు మీడియా, ప్రజల్లో పాపులర్ అయ్యాయి. ఇవేమిటి.. ఒకప్పటి గొప్ప హిట్ సినిమాలుగా నిలిచిన ఎన్నో సినిమాల్లోని డైలాగులు పత్రికల పతాక శీర్షికల్లో నిలిచేవి.
"పడమటి సంధ్యారాగం"శీర్షిక ఎన్నిసార్లు మీడియాలో వచ్చిందో లెక్కేలేదు. ముత్యాల ముగ్గు సినిమాలోని రావు గోపాల్రావు పలికిన డైలాగులు.. శీర్షికలైన సందర్భాలు లెక్కే లేదు. ఇకపోతే.. దాసరి నారాయణరావు సినిమాల్లోని డైలాగులు, పాటలు కూడా పత్రికల వారికి అక్కరకొచ్చాయి. "ఆషాఢ మాసాన.. ఆకాశ దేశాన" అంటూ మేఘ సందేశం సినిమాలో సాగే పాటు సగం సగంగా.. పూర్తిగా మీడియా హెడ్డింగులుగా వాడుకుంది.
కాంగ్రెస్ అగ్రనేతల నోట ఆ మాట ఇటీవలి కాలంలో అంటే. పుష్ప సినిమాకు ముందు వచ్చినవాటిలో జాతి రత్నాలు సూపర్ హిట్ గా నిలిచిన సంగతి అందరికీ తెలిసిందే. ఫుల్ లెంగ్త్ కామెడీ ఎంటర్ టైనర్ అయిన ఈ సినిమాలో హీరో నవీన్ పొలిశెట్టి, అతడి స్నేహితులుగా రాహుల్ రామక్రిష్ణ, ప్రియదర్శి పండించిన హాస్యం అంతాఇంతా కాదు. అమాయకులుగా.. మంచివారుగా.. స్నేహాన్ని ప్రేమించే వారుగా ఈ త్రయం చేసిన కామెండీ ఆకట్టుకుంది. జాతిరత్నాలు జోగిపేట బేస్డ్ గా సాగే సినిమా కాబట్టే భాషంతా తెలంగాణ యాసలో సాగింది. ఇది కూడా సినిమాకు అదనపు బలమైంది.
" నా వల్లే ప్రాబ్లమైతే నే వెళ్లిపోతరా"
జాతిరత్నాలు సినిమాను కొన్ని ఎక్కువ రోజులు ఆడించిన డైలాగ్ "నావల్ల ప్రాబ్లమైతే నే వెళ్లిపోతరా"అనే డైలాగ్. రాహుల్ రామక్రిష్ణ పలికిన ఈ డైలాగ్ సినిమాలో నవ్వులు పూయించింది. ఏదో ఒక తప్పు పని చేయడం.. నవీన్ పొలిశెట్టి, ప్రియదర్శి చేతిలో తిట్లు తినడం సినిమాలో రాహుల్ కేరెక్టర్ తీరు. దీంతో హర్టయ్య అతడు "నా వల్లే ప్రాబ్లమైతే నే వెళ్లిపోతరా" అంటూ స్నేహితులను బెదిరిస్తుంటాడు. సినిమా అంతటిలో పదేపదే ఈ డైలాగ్ అతడి నోటి నుంచి వస్తుంది. చివర్లో అతడికి ఈ ఊతపదం తన తల్లి నుంచి వచ్చిందని తెలుసుకుని హీరో నవీన్, ప్రియదర్శి ఆశ్చర్యపోతారు. ఇప్పుడిదంతా ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే.. ఇటీవలి ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఓటమి తర్వాత ఆదివారం నాడు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) సమావేశమైంది.
ఇందులో కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ పార్టీ, ప్రియాంకా గాంధీ పదవులకు రాజీనామా చేస్తారని వదంతులు వచ్చాయి. పరిస్థితులు కూడా అందుకుతగ్గట్లే గరంగరంగా సాగాయి. కానీ, పార్టీ అత్యున్నత నిర్ణాయక మండలి అయిన సీడబ్ల్యూసీ.. సోనియా నాయకత్వంపై సంపూర్ణ విశ్వాసం ప్రకటించింది. దీనికిముందు నేతల భేటీ సందర్భంగా కొంత డ్రామా సాగినట్లు అనిపించింది.
నేతలంతా నాయకత్వాన్ని బలపర్చినా, గాంధీలు మాత్రం ఓ దశలో నాయకత్వంపై విరక్తి ప్రదర్శించినట్లు కనిపించింది. దీనికితగట్టే ఎన్నికల వైఫల్యాలను తమ మీద వేసుకున్నారు వారు. జాతి రత్నాలు సినిమాలోని రాహుల్ రామక్రిష్ణ డైలాగ్ ను వల్లె వేస్తూ.. "మా వల్లే పార్టీకి నష్టమంటే ఎలాంటి త్యాగానికైనా సిద్ధమని" గాంధీ కుటుంబం ప్రతిపాదన చేసినట్లు సమాచారం. చివరకు సీడబ్ల్యూసీ నేతలు అదేమీ లేదనడం.. సంస్థాగత ఎన్నికల ద్వారా కొత్త అధ్యక్షుడు ఎన్నికయ్యే వరకు సోనియానే చీఫ్ గా కొనసాగమనడం అంతా ఓ డ్రామాలా సాగిపోయింది. పార్టీని బలోపేతం చేసే బాధ్యతను ఆమెకే అప్పగించడంతో సమస్య సద్దుమణిగింది.