Begin typing your search above and press return to search.
సన్ రైజర్స్ కు కచిచ్ కటీఫ్ వెనుక ఇంత కథ ఉందా...?
By: Tupaki Desk | 18 Feb 2022 3:30 PM GMTడియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 15వ ఎడిషన్ ఆరంభానికి ముందే సన్ రైజర్స్ హైదరాబాద్ కు అనూహ్య దెబ్బ తగిలింది . గత సీజన్ లో దారుణ ప్రదర్శన చేసి.. డేవిడ్ వార్నర్ లాంటి ఆటగాడిని వదులుకుని.. కొత్త సీజన్ కు సన్నద్ధం అవుతున్న సన్ రైజర్స్ కు ముందే అపశకునం ఎదురైంది. మెరుగైన జట్టుతో బరిలో దిగి పరువు కాపాడుకోవాలనుకుంటున్న స్థితిలో అనూహ్యంగా దెబ్బపడింది. ఆ జట్టు అసిస్టెంట్ కోచ్ సైమన్ కటిచ్ పదవికి రాజీనామా చేశాడు.
ఆస్ట్రేలియా మాజీ ఓపెనర్ అయిన కటిచ్.. అంతర్జాతీయ క్రికెట్ లో మెరుగ్గానే రాణించాడు. అయితే, ఇటీవలి మెగా వేలంలో సరైన జట్టును ఎంపిక చేసుకోలేదంటూ కటిచ్.. సన్ రైజర్స్ కు కటీఫ్ చెప్పాడు. దీనికి ఫ్రాంచైజీ ఓనర్ కావ్య మారన్‌ను తప్పుబట్టాడు. ఇది సన్ రైజర్స్ అభిమానులకు నిరుత్సాహకర పరిణామమే. ఎంతో అనుభవజ్ఞుడైన సైమన్ కటిచ్‌ను ఈ సారి సన్‌రైజర్స్ హైదరాబాద్ అసిస్టెంట్ కోచ్‌గా నియమించుకుంది. కటిచ్ గతంలో విరాట్ కోహ్లీ నేతృత్వంలోని రాయల్ చాలెంజర్స్ బెంగళూరుకు ప్రధాన కోచ్‌గా కూడా వ్యవహరించాడు.
ముందుగా అనుకున్నదొకటి.. జరిగిందొకటి..రెండు రోజుల పాటు జరిగిన మెగా వేలంలో చాలా జట్లు ఆటగాళ్ల కోసం కోట్లకు కోట్లు కుమ్మరించాయి. ప్రణాళిక ప్రకారం కావాల్సిన వారిని తీసుకున్నాయి. ఇదే సమయంలో వార్నర్ ను హైదరాబాద్ ఎలాగూ రిటైన్ చేసుకోలేదు కాబట్టి కొనుగోలు చేస్తుందేమోనని చూశారు.
కానీ, అతడి పట్ల విస్మరణ ధోరణినే ప్రదర్శించింది. దీంతోపాటు కొనుగోలులో దక్కించుకున్న మిగతా ఆటగాళ్ల గురించీ కటిచ్ కు అభ్యంతరాలున్నాయి. మొత్తంగా కావ్య మారన్ సరైన జట్టును కొనుగోలు చేయలేదని కటిచ్ అభిప్రాయం. మెగా వేలం కోసం ముందుగా వేసిన ప్రణాళికలన్నీ.. తీరా వేలంలో విస్మరణకు గురయ్యాయని ఆరోపిస్తున్నాడు.
అయితే సైమన్ కటిచ్ తప్పుకోవడంతో ప్రస్తుతం కొత్తఅసిస్టెంట్ కోచ్‌ను వెతికే పనిలో సన్‌రైజర్స్ యాజమాన్యం ఉంది.ఔను జట్టు బాగోలేదు..
మెగా వేలంలో సన్ రైజర్స్ సరైన జట్టును కొనుగోలు చేయలేదనేది వాస్తవమే. ఇది అభిమానులకు తీవ్ర నిరాశ కలిగిస్తోంది. ఆపై కటిచ్ నిర్ణయం మరింతగా కలవరపెడుతోంది. ఈసారి కూడా లీగ్‌లో తమ జట్టు పేలవ ప్రదర్శన తప్పదేమోనని ఆవేదన చెందుతున్నారు. నిజానికి వేలంలో సన్‌రైజర్స్ మెనేజ్‌మెంట్ సరైన ఆటగాళ్లను కొనుగోలు చేయలేదని క్రికెట్ విశ్లేషకుల మాట కూడా. అనేక మంది సోషల్ మీడియా వేదికగా ఈ విషయాన్ని స్పష్టం చేశారు.
స్టార్ ఆటగాళ్లను వదిలేసి, అనామకులను కోట్ల రూపాయలు పోసి కొనుగోలు చేశారని బహిరంగంగానే విమర్శించారు. ఇలాంటి నేపథ్యంలో ఇదే కారణంతో అసిస్టెంట్ కోచ్ సైమన్ కటిచ్ తప్పుకోవడం చర్చనీయాంశంగా మారింది.
రిటైన్ చేసుకున్నది ముగ్గురినే.. మిగతావారి ఎంపికా సరిగా లేదుసన్ రైజర్స్.. విలియమ్సన్, ఉమ్రాన్ మాలిక్, అబ్దుల్ సమద్ లను మాత్రమే రిటైన్ చేసుకుంది. వీరిలో విలియమ్సన్ కెప్టెన్, బ్యాట్స్ మన్. సమద్ కశ్మీరీ హార్డ్ హిట్టర్. ఉమ్రాన్ 150 కిలోమీటర్ల వేగంతో బంతులేయగల పేసర్. ఇతడూ కశ్మీరీనే. అయితే, కొంతకాలంగా విలియమ్సన్ గాయాలతో బాధపడుతున్నాడు.
ప్రస్తుతం దక్షిణాఫ్రికాతో స్వదేశంలో జరుగుతున్న సిరీస్ కూ అతడు అందుబాటులో లేడు. ఐపీఎల్ సమయానికి కోలుకుంటాడని భావిస్తున్నారు. సమద్ టి20 ఆటగాడే కానీ.. నిలకడ తక్కువ. ఉమ్రాన్ ఫర్వాలేదు. ఇలాంటప్పడు బలమైన జట్టును కొనుగోలు చేయాల్సిన సన్ రైజర్స్ వేలంలో పూర్తిగా నిరాశపర్చింది. రాహుల్ త్రిపాఠి, నికోలస్ పూరన్ తప్ప మిగతా జట్టంతా మైదానంలోకి దిగా ఎలా ఆడితే అలా అనుకోవాలి. భువనేశ్వర్, మార్క్రమ్ వంటివారు ఫామ్ కోసం తంటాలు పడుతున్నారు.
వార్నర్ స్థాయి ఆటగాడిని వదిలేసుకున్నప్పడు అతడికి దగ్గరగా ఉండే ఆటగాళ్లనైనా తీసుకోవాల్సింది. కానీ, బి గ్రేడ్, సి గ్రేడ్ వారిని ఎంపిక చేసుకుని లీగ్ బరిలో దిగడం సముచితం కాదనేది విశ్లేషకుల మాట. మరోవైపు ఈ జట్టులోని కుర్రాళ్లలో కొందరు మెరుగ్గా రాణించే అవకాశం ఉంది. అయితే, అది విజయానికి తోడ్పడేంతగా ఉంటే ఇబ్బందేమీ ఉండదు.
సన్‌రైజర్స్ హైదరాబాద్ పూర్తి జట్టు..కేన్ విలియమ్సన్ (కెప్టెన్), ఉమ్రాన్ మాలిక్, అబ్దుల్ సమద్, వాషింగ్టన్ సుందర్, నికోలస్ పూరన్ (వికెట్ కీపర్), మార్కో జాన్సెన్, రొమారియో షెపర్డ్, సీన్ అబాట్, శశాంక్ సింగ్, సౌరభ్ దూబే, ప్రియం గార్గ్, రాహుల్ త్రిపాఠి, అభిషేక్ శర్మ, కార్తీక్ త్యాగి, శ్రేయాస్ గోపాల్, జగదీశ సుచిత్, ఐడెన్ మార్క్‌రామ్, ఫజల్హాక్ ఫరూకీ, టీ. నటరాజన్, భువనేశ్వర్ కుమార్, గ్లెన్ ఫిలిప్స్, విష్ణు వినోద్