Begin typing your search above and press return to search.

టీఢీపీ : న‌ల‌భై వ‌సంతాలు 40 కొత్త ముఖాలు

By:  Tupaki Desk   |   30 March 2022 6:35 AM GMT
టీఢీపీ : న‌ల‌భై వ‌సంతాలు 40 కొత్త ముఖాలు
X
తెలుగు జాతి మ‌న‌ది నిండుగా వెలుగు జాతి మ‌న‌ది అని ఎలుగెత్తిన ఎన్టీఆర్ పాట‌ను మ‌రోసారి త‌ల్చుకుని తీరాలి. క‌దులుదాము రండి మ‌నం జ‌న్మ‌భూమికి త‌ల్లిపాల రుణం కొంత తీర్చ‌డానికి అన్న పాట‌ను కూడా మ‌రో సారి స్మ‌రించాలి.

తెలుగుదేశం పిలుస్తోంది రా క‌ద‌లి రా అని అన్న ఎన్టీఆర్ పిలుపు ఇస్తూ చేసిన సింహ‌గ‌ర్జ‌న‌ను విని తీరాలి. ఆ విధంగా చంద్ర‌బాబు మార్పు రావాలి. లోకేశ్ ఇంకా బాగా ప‌నిచేయాలి. ఇదే సంద‌ర్భంలో బాగా చ‌దువుకున్న యువ‌త‌కు ప్రాధాన్యం అన్న‌ది కేవ‌లం ప్ర‌క‌ట‌న‌ల‌కే ప‌రిమితం కాకూడ‌దు.

అదేవిధంగా జ‌న‌సేన‌తోనూ, బీజేపీతోనూ పొత్తు ఉంటుంది క‌నుక పొత్తుల ధ‌ర్మంలో భాగంగా ఇచ్చిన మాట ప్ర‌కారం అనుకున్న విధంగా సీట్ల కేటాయింపు చేయాలేక‌పోయాం అన్న మాట కూడా చెప్ప‌కూడ‌దు. ఇవ‌న్నీ సాధ్యం అయిన‌ప్పుడే చంద్ర‌బాబు మాట‌కు సార్థ‌క‌త. విలువ. వాట్ నాట్ వాట్ ఎల్స్.

- పార్టీ ఆవిర్బావ దినోత్సవంలో అధినేత కీలక ప్రకటన
- వచ్చే ఎన్నికల్లో కొత్త ముఖాలకు ప్రాధాన్యం
- 40 శాతం టికెట్లు యువతకే కేటాయిస్తాం

న‌ల‌భై వ‌సంతాల పండుగ వేళ అధినేత చంద్ర‌బాబు ఒకింత ఆస‌క్తితో కూడిన ప్ర‌క‌ట‌న చేశారు..ఓ విధంగా ఇది యువ‌త‌కు అరుదైన అవ‌కాశం. సీనియ‌ర్ల‌తో కాలం వెళ్ల‌దీయడం క‌న్నా ఈ విధంగా అయినా యువ‌త‌కు ఛాన్స్ ఇచ్చే మంచి ఫ‌లితాలు ఉంటాయ‌న్న‌ది నిర్వివాదాంశం. ఎలానూ ఇప్ప‌టిదాకా ఉన్న సీనియ‌ర్లకు ఇదే ఆఖ‌రి ఎన్నిక‌లు కావొచ్చు. ఆ మాట‌కు వ‌స్తే చంద్ర‌బాబుకు కూడా ఇవే ఆఖ‌రి ఎన్నిక‌లు కావొచ్చు.

వ‌యోభారం రీత్యా ఆయ‌న మ‌రో సారి 2029 ఎన్నిక‌ల్లో పోటీ చేయ‌వ‌చ్చు చేయ‌క‌పోవ‌చ్చు. క‌నుక పార్టీని బ‌తికించే ప్ర‌య‌త్నాలు ముమ్మరం చేయ‌డంలో త‌ప్పు ఏం లేదు. ఆ విధంగా ఇప్ప‌టిదాకా ఉన్న పాత ముఖాలు కొన్ని మండ‌లికి ప‌రిమితం కావొచ్చు.