Begin typing your search above and press return to search.
తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ ఇలా ఉండనుందా?
By: Tupaki Desk | 7 March 2022 5:30 AM GMTమరికాసేపట్లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 2022-23 సంవత్సరానికి సంబంధించిన రాష్ట్ర బడ్జెట్ ను ఈ రోజు (సోమవారం) అసెంబ్లీలో ప్రవేశ పెట్టనున్నారు. రోటీన్ కు భిన్నంగా.. సంప్రదాయానికి విరుద్ధంగా బడ్జెట్ సమావేశాలకు ముందు గవర్నర్ ప్రసంగంతో మొదలు కావాల్సిన అసెంబ్లీ సమావేశాలు.. ఈసారి అందుకు భిన్నంగా గవర్నర్ ప్రసంగం లేకుండా సాగుతుండటం తెలిసిందే. ఈ అంశంపై అటు ప్రభుత్వం.. ఇటు గవర్నర్ తమ వాదనలు వినిపించటం తెలిసిందే. ప్రభుత్వ తీరును తప్పు పడుతూ శనివారం గవర్నర్ కార్యాలయం నుంచి ఒక ప్రకటన విడుదల కావటం.. ప్రభుత్వ తీరును తప్పు పట్టటం తెలిసిందే.
ఇక.. ఈ రోజు కేసీఆర్ సర్కారు ప్రవేశ పెట్టనున్న బడ్జెట్ విషయానికి వస్తే.. గత ఆర్థిక సంవత్సరంలో రూ.2.30లక్షల కోట్లుగా ఉన్న బడ్జెట్ ఈసారి రూ.2.70లక్షల కోట్ల వరకు ఉంటుందని చెబుతుంటే.. మరికొందరు మరో అడుగు ముందుకేసి ముచ్చటగా రూ.3లక్షల కోట్ల వరకు ఉంటుందన్న అంచనా వేస్తున్నారు.
కరోనా నేపథ్యంలో రాష్ట్ర ఆదాయం దారుణంగా దెబ్బ తినటంతో గత ఏడాది రాష్ట్ర బడ్జెట్ విషయంలో కాస్త రాజీ పడాల్సి వచ్చింది. కరోనా అనంతర పరిస్థితి బాగుండటం.. రాబడి కూడా భారీ పెరుగుతున్న వేళ.. బడ్జెట్ లెక్కలు కాస్త ఎక్కువగానే ఉండొచ్చన్న మాట వినిపిస్తోంది.
గత ఏడాది కంటే రాష్ట్ర వ్రద్ధిరేటు పెరిగిన నేపథ్యంలో గత ఏడాది కంటే ఈసారి బడ్జెట్ రూ.35వేల కోట్ల వరకు పెరగనుందని చెబుతున్నారు. సొంత పన్నుల రాబడిలో వ్రద్ధిరేటు 20 శాతం అంచనా వేసుకున్న ప్రభుత్వం.. పన్నేతర రాబడి.. రుణాలపై ధీమాతో భారీ బడ్జెట్ ను సిద్ధం చేసినట్లుగా చెబుతున్నారు. ఈసారి బడ్జెట్ లో ప్రభుత్వానికి తలనొప్పిలా మారిన ఉద్యోగాల భర్తీకి అవసరమైన కార్యాచరణ ఉంటుందని అంచనా వేస్తున్నారు.
వచ్చే ఏడాది చివర్లో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఇదే ఈసారి పూర్తిస్థాయి బడ్జెట్ గా చెప్పాలి. దీన్ని ఎన్నికల బడ్జెట్ కింద కసరత్తు చేస్తున్నట్లు చెబుతున్నారు. సంక్షేమం.. వ్యవసాయానికి పెద్దపీట వేయటంతో పాటు.. కేసీఆర్ సర్కార్ ఫ్లాగ్ షిప్ పథకాలైన రైతుబంధు.. దళిత బంధులకు పెద్ద ఎత్తున నిధుల్ని కేటాయింపులు చేస్తారని చెబుతున్నారు. దళితబంధుకు రూ.20వేల కోట్లు.. రైతుబంధుకు రూ.15వేల కోట్లు కేటాయించి.. అసరా పించన్లకు గతం కంటే రూ.3వేల కోట్లను పెంచుతున్నట్లుగా చెబుతున్నారు.
ఈసారి బడ్జెట్ లో సంక్షేమ పథకాలకు ఇబ్బంది లేకుండా నిధుల్ని సమకూర్చటంతో పాటు హైదరాబాద్ డెవలప్ మెంట్ కు.. జలమండలికి నిధుల్ని పెంచనున్నారు. పరిశ్రమలు.. ఆర్టీసీ తోడ్పాటు కూడా ఉంటుందని చెబుతున్నారు. అసరా ఫించన్లకు రూ.14వేల కోట్ల మేర కేటాయింపులు ఉంటాయని.. విద్యుత్ సబ్సిడీలకురూ.11వేల కోట్లు కేటాయిస్తారని చెబుతున్నారు.
రైతుల రుణమాఫీ.. కల్యాణలక్ష్మీ.. షాదీముబారక్.. మహిళా సంఘాలకు వడ్డీ లేని రుణాల నిధుల్ని పెంచనున్నారు. హైదరాబాద్ మెట్రోకు ఎలాంటి తీపి కబురు ఉంటుందన్నది ఆసక్తికరంగా మారింది. కరోనా అనంతరం వ్రద్ధి రేటు బాగుండటం.. పన్ను రాబడి కూడా ఆశించిన దాని కంటే మెరుగ్గా ఉన్న పరిస్థితుల్లో.. తాజా బడ్జెట్ భారీగా ఉండే అవకాశమే ఎక్కువన్నమాట వినిపిస్తోంది.