Begin typing your search above and press return to search.
తెలంగాణ కాంగ్రెస్ కు మరో భారీ షాక్.. జగ్గారెడ్డి రాజీనామా?
By: Tupaki Desk | 19 Feb 2022 4:31 AM GMTతెలంగాణ కాంగ్రెస్ కు మరో భారీ షాక్ తగలనుందా? అంటే ఔననే సమాధానం వస్తోంది. ఏకంగా టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ పదవికి జగ్గారెడ్డి రాజీనామా చేయబోతున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం జరుగుతున్న సమీకరణాలను పరిశీలిస్తే ఈ ప్రశ్నకు ఔననే సమాధానం వస్తోంది.
సంగారెడ్డి కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఆ పార్టీకి రాజీనామా చేసేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. రేపు సంగారెడ్డిలో నిర్వహించనున్న కార్యకర్తల సమావేశంలో ఆయన తన నిర్ణయాన్ని ప్రకటించే అవకాశం ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి.
తనను కోవర్ట్ అంటూ రేవంత్ రెడ్డి వర్గం ప్రచారం చేస్తోందని జగ్గారెడ్డి ఆవేదన వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. ఈనేపథ్యంలోనే పార్టీకి రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నట్లుసమాచారం.
శుక్రవారం పటాన్ చెరు వద్దనున్న ముత్తంగిలో తన అనుచరులతో సమావేశమైన జగ్గారెడ్డి తాను టీఆర్ఎస్ కోవర్టునంటూ సోషల్ మీడియాలో ప్రచారం చేయడం ద్వారా తన వ్యక్తిత్వాన్ని దెబ్బతీసే ప్రయత్నం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అంతర్గత ప్రజాస్వామ్యం ఉంటుందనే కారణంతోనే తాను కాంగ్రెస్ ను ఇష్టపడ్డానని.. కానీ సొంత పార్టీ నేతలే తనపై సోషల్ మీడియాలో, బయటా దుష్ర్పచారం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
కోట్లుఖర్చు చేసి గెలిచి ఇలా కోవర్టు అన్న ముద్ర వేయించుకోవాల్సిన అవసరం ఏముందని.. పార్టీకి రాజీనామా చేసి స్వతంత్రంగా వ్యవహరిస్తానని వారికి చెప్పినట్లు సమాచారం.
టీఆర్ఎస్ లో చేరుదామన్న ప్రతిపాదననూ జగ్గారెడ్డి తోసిపుచ్చినట్టు తెలుస్తోంది. తాను టీఆర్ఎస్ కోవర్టునంటూ సొంత పార్టీ నేతలు చేస్తున్న ప్రచారం నిజం చేసినట్లు అవుతుందని..అందుకే టీఆర్ఎస్ లో చేరను అని అంటున్నారట.. అయితే బీజేపీ జగ్గారెడ్డికి ఏకైక ఆప్షన్ గా ఉంది. ఆయన రాజీనామా చేస్తారా? లేదా? అన్నది వేచిచూడాలి.