Begin typing your search above and press return to search.
నవాబుల నగరంలో నిషా బతుకులు ?
By: Tupaki Desk | 4 April 2022 3:27 AM GMTమహా నగరం అని రాయడంలో తెలిసిన విద్య కన్నా తెలియని బాధ్యత ఉంది. బిడ్డలంతా ఏమయి పోతున్నారు అన్న బెంగ కూడా ఉంది. నగరంలో వీధి శుభ్రం ఇంటి శుభ్రం మనిషి మలినం. దయనీయమయిన జీవితాలకు నగరం ఎందుకో కొత్త ఆశ్రయాలను ఇస్తుంది. దయనీయత జీవితంలో లేదు నడవడిలో ఉంది.
ప్రవర్తనలో ఉంది. ఇవి కొన్ని వేల కాంతుల మధ్య నడిచి వచ్చే సెలబ్రిటీలకు మాత్రమే వర్తిస్తాయి. వారి నడవడిలో కోట్ల మంది అనునయంగా నడిచే అడుగులు ఉన్నాయని తెలియవు వారికి. వారి మాటలో కోట్ల మంది అనుకరణ ఒకటి అనునయంగా దాగి ఉంటుందని తెలియదా వారికి ?
బిడ్డలంతా ఏమయిపోతున్నారు. నిహారికా తప్పు చేయలేదు.. చేతులెత్తి మొక్కుతున్నా ఈ విషయాన్ని స్పెక్యులేట్ చేయకండి అని అంటున్నారు నాగబాబు. తండ్రి హోదాలో చేస్తున్న విన్నపం ఇది అని ఎలా చెప్పడం? అంటే అక్కడ తాగడం తూగడం లాంటివి చాలా సామాన్యం అయిన విషయాలు వాటిని పెద్దగా పట్టించుకోవద్దు అని చెప్పడమా ? ఓ పెళ్లయిన అమ్మాయి బాధ్యతతో మెలగాల్సిన అమ్మాయి రాత్రి 12 దాటాక లేదా ఒంటిగంటన్నర దాటాక అయినా ఇంటికి చేరకపోవడం సమర్థింపా? పోనీ కెరీర్ కోసమో, ప్రాజెక్ట్ కోసమో ఆ టైంలో బయటకు వస్తే శభాష్ సబల అనొచ్చు. కానీ వచ్చింది పార్టీకే కదా.
మంచి నాన్నల గురించి ఓ చోట చెబుతాడు ప్రకాశ్ రాజ్. పిల్లలకు సంస్కృతి అంటే నేర్పండి అదే గొప్ప కానుక అని అర్థం వచ్చేలా చెబుతాడు. మంచి నాన్న అంటే తప్పులున్న వేళ సమర్థింపు కాదు.
తప్పులున్న వేళ నాన్న చేసే తిరుగుబాటు లేదాదిద్దుబాటు ఇవి కదా కావాలి. మరి ఆ నాన్నేంటి అలా అంటాడు. మా బిడ్డ తప్పు చేయలేదు అని ! అవునా! తప్పు రాత్రివేళ పార్టీలకు వెళ్లడంతోనే మొదలయి ఉంటుంది. అంతకుముందు కూడా ఇలాంటివేవో జరిగే ఉంటాయి. వాటిని నియంత్రించలేని తండ్రులు
ఇప్పుడు మా అమ్మాయి తప్పు చేయలేదు అనే అంటారు. బంజారాహిల్స్ పోలీసులు ఏమయినా చెప్పారా?
జూబ్లీహిల్స్ పోలీసులు ఏమయినా చెప్పారా? నార్కో ఎనాలసిస్ టెస్టులు చేయిస్తారా? వీళ్లంతా విధిగా విచారణకు సహకరిస్తారా?