Begin typing your search above and press return to search.
యుద్ధం వస్తే రష్యా ను ఉక్రెయిన్ ఢీ కొట్టగలదా? సైనిక సామర్థ్యం ఎంత?
By: Tupaki Desk | 21 Feb 2022 5:03 AM GMTఉక్రెయిన్ ను ఆక్రమించుకోవాలి అనే ఆలోచనతో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిని ఆ దేశ సరిహద్దుల్లో భారీగా సైన్యాన్ని మోహరించారు. లక్షల సంఖ్యలో ఆ దేశ బలగాలు సరిహద్దులకి చేరుకున్నాయి. అంతేగాకుండా ఇప్పటికే రష్యా అనేక సార్లు ఉక్రెయిన్ ను బయపెడుతూ వచ్చింది. ఖండాతర క్షిపణులను ప్రయోగించినట్లు ఇప్పటికే అధికారులు ప్రకటించారు. కానీ మరోపైపు యుద్ధాన్ని నివారించేందుకు కూడా ఇతర దేశాలు సన్నాహాలు చేస్తున్నాయి.
అమెరికా పెద్దన్న పాత్ర తీసుకోని జర్మనీని రంగంలోకి దింపి యుద్ధాన్ని కొంతమేర పోస్ట్ పోన్ చేయగలిగింది. అయితే దాడి చేయడానికి తాము సిద్దంగా లేము అని రష్యా అధ్యక్షుడు పుతిని ప్రకటించినా కానీ తిరిగి దాడులకు ప్రయత్నిస్తున్నారు అనే విషయం అయితే స్పష్టంగా తెలుస్తోంది. ఇలాంటి నేపథ్యంలోనే తిరిగి అమెరికాతో పాటు ఇతర దేశాలు కూడా రష్యా వైఖరిని తప్పు పడుతున్నాయి.
దాడి జరిగితే రష్యాపై వ్యాపార ఆంక్షలు కఠినతరం చేస్తామని ఇప్పటికే అమెరికా ప్రకటించింది. అంతేగాకుండా మరి కొన్ని దేశాలు కూడా అదే బాటలో నడుస్తాయిని స్పష్టం చేశాయి. కానీ రష్యా మాత్రం ఎక్కడా తగ్గడం లేదు. ముఖ్యంగా రష్యాకు వ్యాపార భాగస్వామి అయిన జర్మనీ కూడా దౌత్య ఒప్పందాలు చేసుకుని.. యుద్ధాన్ని నివారించడానికి చాలా ప్రయత్నాలు చేసింది. కానీ అందుకు పుతిన్ సరే మిరా అన్నారు. దీంతో మరల యుద్ధం కచ్చితంగా వస్తుందని అమెరికా తెగేసి చెప్పింది.
ఇదిలా ఉంటే ఉక్రెయిన్ కూడా యుద్ధం జరిగితే వ్యవహరించాల్సిన తీరుపై పౌరులను మానసికంగా సిద్ధం చేస్తోంది. ఎలాంటి పరిస్థితుల్లో అయినా దేశ ప్రజలు అందరూ కలిసి ఉండేలా చర్యలు చేపడుతోంది. ప్రజల ఐక్యతను గుర్తు చేసేందుకు రష్యా దాడి చేస్తుందని గతంలో భావించి ఫిబ్రవరి 16 ను దేశ ఐక్యత దినంగా ప్రకటించింది. ఇలాంటి సమయాల్లో ఉక్రెయిన్ కు ప్రజల సహకారం కూడా భాగానే ఉంది.
అధ్యక్షుడు చెప్పిన విధంగా ప్రజలు, సైనికులు వ్యవహరిస్తున్నారు. సైనిక బలగాలను ఇప్పటికే ఆ దేశ అధ్యక్షుడు సిద్ధంగా ఉంచారు. కచ్చితంగా దాడి అనివార్యం అయినప్పుడు చేపట్టాల్సిన చర్యల గురించి ఆ దేశ సైనిక అధికారులతో చర్చించారు. ఇదిలా ఉంటే ఏ దేశ సైనిక బలగాలు ఎంత అనేది ఇప్పుడు ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో రష్యా సైనిక బలగం ఎంత? ఉక్రెయిన్ సైనిక బలగం ఎంత? ఆయుధాలు ఎన్ని ఉన్నాయి? అలాంటి విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.
ఉక్రెయిన్ దగ్గర ఉన్న సైనిక సిబ్బంది (యాక్టివ్) సుమారుగా రెండు లక్షల వరకు ఉంటుంది. ఇదే సమయంలో రష్యా దగ్గర ఉన్న సైనిక సిబ్బంది 8 లక్షల యాభై వేలకు పైగా ఉంటుంది. యుద్ధ ట్యాంకులు విషయానికి వస్తే రష్యా దగ్గర 12,420 ఉన్నాయి. ఇదే క్రమంలో ఉక్రెయిన్ దగ్గర 2,596 యుద్ధ విమానాలు ఉన్నాయి. సాయుధ వాహనాల సంఖ్య ఉక్రెయిన్ దగ్గర 12 వేల 3 వందలు ఉంటే.. రష్యా దగ్గర 30 వేలకు పైగా ఉన్నాయి.
యుద్ధ విమానాలు సంఖ్యలోనూ రష్యా ఆధిపత్యాన్ని కొనసాగిస్తుంది. రష్యా దగ్గర 772 యుద్ధ విమానాలు ఉంటే ఉక్రెయిన్ దగ్గర 69 మాత్రమే ఉన్నాయి . ఎటాకింగ్ హెలికాప్టర్ రష్యా వద్ద 544 ఉండగా.. ఉక్రెయిన్ వద్ద కేవలం 34 ఉన్నాయి. నౌకలు రష్యా దగ్గర 605 ఉంటే ఉక్రెయిన్ దగ్గర 38 మాత్రమే ఉన్నాయి. విధ్వంసక నౌకలు రష్యా దగ్గర 15 ఉండగా.. ఉక్రెయిన్ దగ్గర అసలు ఏమీ లేవు.