Begin typing your search above and press return to search.

స‌జ్జ‌ల‌, సాయిరెడ్డి ఇళ్ల‌కు వైసీపీ ఎమ్మెల్యేల క్యూ..రీజ‌న్ ఇదే!

By:  Tupaki Desk   |   15 March 2022 10:50 AM GMT
స‌జ్జ‌ల‌, సాయిరెడ్డి ఇళ్ల‌కు వైసీపీ ఎమ్మెల్యేల క్యూ..రీజ‌న్ ఇదే!
X
బెల్లం ఎక్క‌డ ఉంటే..చీమ‌లు అక్క‌డ ఉంటాయ‌ని సామెత‌.ఇప్పుడు వైసీపీలోనూ ఇదే జ‌రుగుతోంద‌ని అంట‌న్నారు ప‌రిశీల‌కులు. వైసీపీ ఎమ్మెల్యేలు, ముఖ్యంగా ప‌ద‌వుల‌పై ఆశ‌లు పెట్టుకున్న వారు.. ఇప్పుడు.. ప్ర‌భుత్వ స‌ల‌హాదారు.. కీల‌క పాత్ర పోషిస్తున్న సజ్జ‌ల రామ‌కృష్నారెడ్డి, పార్టీ కీల‌క నేత‌,ఎంపీ విజ‌య‌సాయి రెడ్డి ఇళ్ల‌కుక్యూ క‌డుతున్నార‌ట‌.

వారి ద‌ర్శ‌న భాగ్యం క‌లిగితే చాలు. మా మొర వింటే అంత‌క‌న్నా చాలు! అని.. అనుకుంటున్నార‌ట‌. దీంతో అస‌లు ఎందుకు ఇలా జ‌రుగుతోంది? అనే చ‌ర్చ వైసీపీలో జోరుగా సాగుతోంది.

విష‌యంలోకి వెళ్తే.. త్వ‌ర‌లోనే మంత్రి వ‌ర్గాన్ని ప్ర‌క్షాళ‌న చేయాల‌ని.. ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ భావిస్తున్నారు. గ‌త 2019లో ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేసే స‌మ‌యంలోనే ఆయ‌న 90 శాతం మంది మంత్రుల‌ను మారుస్తాన ని చెప్పారు.

అయితే.. రెండున్న‌రేళ్ల‌కే మారుస్తాన‌ని అన్నా.. క‌రోనా నేప‌థ్యంలో కొంత ఆల‌స్యం అయింది. దీంతో ఇప్పుడు ఉగాది నాటికి.. మార్పు ఖాయ‌మ‌నే సంకేతాలు ఇచ్చారు. అయితే.. గ‌తంలో మాదిరిగా పూర్తి బాధ్య‌త త‌నే తీసుకోకుండా.. మంత్రుల‌ను ఎంపిక చేసే బాధ్య‌త‌ను స‌జ్జ‌ల‌కు, విజ‌యసాయిరెడ్డికి అప్ప‌గించిన‌ట్టు తెలుస్తోంది.

అంటే.. ఇప్పుడున్న నాయ‌కుల్లో ఎవ‌రికి మంత్రి ప‌ద‌వులు ఇస్తే..మేలు జ‌రుగుతుంది? కూడిక‌లు ఎలా ఉండాలి? సామాజిక వ‌ర్గాల స‌మీక‌ర‌ణ ఎలా ఉండాలి? మైన‌స్‌లు ఎలా ఉండాలి..? అనే కీల‌క అంశాల‌ను.. జ‌గ‌న్‌.. వీరి చేతుల్లో పెట్టారు. దీంతో వీరు మంత్రి వ‌ర్గ కూర్పు చేర్పుల‌పై దృష్టి పెట్టారు. వీరు ముందుగా.. ఒక నివేదిక త‌యారు చేసి.. త‌ర్వాత‌.. దానిని సీఎం కు అందిస్తారు.

దీని ప్ర‌కారం.. ఆయ‌న మంత్రి వ‌ర్గాన‌న్ని ప్ర‌క్షాళ‌న చేయ‌నున్నారు. దీంతో ఇప్పుడు.. పార్టీలో ఆశావ‌హులు అంద‌రూ కూడా.. దేవుడి ప్ర‌స‌న్నం కోసం.. ముందుగా పూజారి క‌రుణ కోసం.. వేచి చూసే భ‌క్తుల మాదిరిగా.. స‌జ్జ‌ల‌, సాయిరెడ్డిల‌ను ప్ర‌సన్నం చేసుకునే ప‌నిలో ప‌డ్డార‌ట‌. అందుకే ఇప్పుడు వారి చుట్టూ తిరుగుతున్నార‌ని అంటున్నారు వైసీపీ నాయ‌కులు.