Begin typing your search above and press return to search.
టీడీపీ నేతల గురించి వైసీపీలో ఇప్పుడిదే హాట్ టాపిక్...!
By: Tupaki Desk | 13 March 2022 2:30 AM GMTరాజకీయాల్లో ఏదైనా అనేయొచ్చు.. ఏ కామెంటైనా చేసేయొచ్చు.. అనే నాయకులు పెరిగిపోతున్నారు. తా జాగా ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాల్లో బీజేపీ పుంజుకుంది. పైగా యూపీలో వరుసగా రెండోసారి అధికారం దక్కించుకుంది. ఈ నేపథ్యంలో ఏపీలోని టీడీపీ నాయకులు.. వైసీపీ అధినేత, సీఎం జగన్‌పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.
బీజేపీ జయకేతనం ఎగుర వేయడంతో.. జగన్‌కు భయం పట్టుకుందని.. టీడీపీ కీలక నాయకులు కొందరు వ్యాఖ్యానించారు. బీజేపీ దెబ్బతో జగన్ మరింత కుదేలవుతారని.. వారు చెబుతున్నా రు. అంతేకాదు.. ఇక, కేంద్రం దగ్గర జగన్ ఆటలు ముందుకు సాగవని కూడా అంటున్నారు.
అయితే.. ఈ వ్యాఖ్యల్లో నిజం ఎంత? బీజేపీ ఐదు రాష్ట్రాల్లో సత్తా చాటితే.. ఏపీలో జగన్‌కు ఎందుకు ఇబ్బం దులు వస్తాయి. అనేది కీలక ప్రశ్నగా మారింది. ఎందుకంటే.. ఏపీలో సీఎం జగన్ బలంగా ఉండాలని కోరుకుంటున్న పార్టీ బీజేపీనే! ఆశ్చర్యంగా ఉన్నా.. ఇది నిజం. ఎందుకంటే.. కేంద్రంలోని బీజేపీకి అన్ని విధాలా ఆయన సాయం చేస్తున్నారు. కేంద్రం తీసుకువస్తున్న అన్ని చట్టాలకు.. ఆయన మద్దతు ప్రకటిస్తున్నారు. అదేవిధంగా.. రాజ్యసభ సీట్లను కూడా ఇస్తున్నారు.
ఇక, కేంద్రంలో ఉన్న మంత్రులు ఎప్పుడు ఏపికి వచ్చినా విందు ఇస్తున్నారు. ఇలాంటి జగన్‌ను ఎందుకు ఇబ్బంది పెడతారు. పోనీ.. ఏపీలో బీజేపీ పుంజుకుంది.. జగన్ అడ్డుపడుతున్నారు..అనుకుంటే.. అలాంటి పరిస్థితి కూడా కనిపించడం లేదు.
పైగా.. బీజేపీ పుంజుకుంటే.. జగన్ ఎక్కడైనా అడ్డుపడుతున్నారా? అంటే.. అది కూడా లేదు. అంతేకాదు.. గతంలో టీడీపీ నేతలే.. మోడీని విమర్శించారు. ఆయనపై పార్లమెంటులో అవిశ్వాస తీర్మానం పెట్టారు.
అందుకే.. కదా.. బీజేపీ కేంద్రంలోని పెద్దలు.. టీడీపీని ఆమడ దూరం పెట్టారు. ఈ పరిస్థితులను సరిచేసుకుని.. ముందుకు సాగాల్సిన.. టీడీపీ దీనికి విరుద్ధంగా వ్యవహరించడం.. జగన్‌పై ఆవేశ పడడం వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదని అంటున్నారు పరిశీలకులు. బీజేపీతో చెలిమి కోరుకుంటున్న టీడీపీ.. ఇలాంటి ట్రిక్కులు ప్లే చేయడం వల్ల ఎలాంటి అవకాశం రాదని.. చెబుతున్నారు.