Begin typing your search above and press return to search.
వైసీపీలో సగానికి సగం సీట్లు కట్... ?
By: Tupaki Desk | 15 March 2022 10:39 AM GMTఎన్నికల వేడి అయితే ఏపీలో నిండుగా కమ్ముకుంది. రెండేళ్ల క్రితమే అది రాజుకుంది. టీడీపీ అయితే దూకుడు చేస్తోంది. జనసేన ఆవిర్భావ సభతో పొలిటికల్ హీట్ ని పీక్స్ కి తీసుకుపోయింది. ఈ నేపధ్యంలో అధికార పార్టీ కూడా ఎన్నికలకు కసరత్తు చేస్తోంది.
2019 ఎన్నికల్లో 151 సీట్లను గెలుచుకుని అపూర్వ విజయాన్ని సొంతం చేసుకున్న వైసీపీ 2024లో కూడా ఆ మ్యాజిక్ రిపీట్ చేయాలనుకుంటోంది. దాని కోసం తాను నమ్ముకున్న ప్రశాంత్ కిశోర్ స్ట్రాటజీలనే మళ్లీ ముందు పెట్టుకుంటోంది.
వచ్చే ఎన్నికల్లో కూడా పీకే సూచనలు, వ్యూహాల ప్రకారమే వైసీపీ నడవాలనుకుంటోంది. పీకే అంటే జగన్ కి బాగా గురి. దాంతో వరసబెట్టి సర్వేల మీద సర్వేలు చేయిస్తూ ఏపీలో పరిస్థితి మీద వైసీపీ అధినాయకత్వం ఎప్పటికపుడు రిపోర్టులు తెచ్చుకుంటోంది.
ఇవన్నీ ఇలా ఉంటే ఏపీలో వైసీపీ మీద జనాభిప్రాయం ఎలా ఉంది. ఎమ్మెల్యే పనితీరు ఎలా ఉంది అన్న దాని మీద పీకే ఇచ్చిన నివేదికలు వైసీపీ హై కమాండ్ దగ్గర ఉన్నాయని అంటున్నారు. వాటి ఆసరాతోనే వచ్చే ఎన్నికల్లో గెలవడానికి వైసీపీ చూస్తోంది అని అంటున్నారు.
ఇక పీకే టీమ్ లేటెస్ట్ గా ఇచ్చిన రిపోర్టుల్లో సగానికి సగం మంది ఎమ్మెల్యేల పనితీరు బాగాలేదని వచ్చిందట. దాంతో వారిని వచ్చే ఎన్నికల్లో తప్పించకపోతే పరాజయం తప్పదని అంటున్నారు.
అంటే వైసీపీలో జగన్ మినహాయిస్తే 150 మంది ఎమ్మెల్యేలు ఉంటే ఇందులో సగం అంటే 75 మంది ఎమ్మెల్యేలకు వచ్చే ఎన్నికల్లో టికెట్లు దక్కే సూచనలు అయితే లేవు అని అంటున్నారు. మరి అదే జరిగితే వారి పరిస్థితి ఏంటి అన్నది కూడా చర్చగా ఉంది.
ఎన్నికల్లో గెలుపు గుర్రాలకే టికెట్ అని వైసీపీ అధినాయకత్వం ఎమ్మెల్యేలకు మరోసారి స్పష్టంగా చెప్పబోతోంది అంటున్నారు. గత రెండున్నరేళ్ళుగా వైసీపీ ఎమ్మెల్యేలతో భేటీలు వేయని అధినాయకత్వం తాజాగా విస్తృత స్థాయిలో సమావేశాన్ని నిర్వహిస్తోంది.
ఈ సమావేశం లో మరో మారు పనితీరు మార్చుకోవాలని హెచ్చరికలు ఉంటాయని అంటున్నారు. లేకపోతే మాత్రం వారికి టికెట్లు దక్కే సూచనలు అయితే లేనే లేవనే చెబుతున్నారు. మరి ఇంత పెద్ద ఎత్తున ఎమ్మెల్యేలను టికెట్లు లేకుండా చేసి ఇళ్ళకు పంపితే ఆ ప్రభావం పార్టీ విజయావకాశాల మీద పడుతుందా అంటే అది కూడా చూడాల్సిందే. మొత్తానికి వైసీపీ ఎమ్మెల్యేలలో పీకే సర్వే రిపోర్టు అయితే గుండెల్లో రైళ్ళు పరిగెట్టిస్తోంది అంటున్నారు.