Begin typing your search above and press return to search.
అంతటి వ్యతిరేకతలోనూ యూపీలో కొల్లగొట్టిన యోగి?
By: Tupaki Desk | 10 March 2022 7:46 AM GMTదేశవ్యాప్తంగా ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో అందరిని ఉత్కంఠకు గురిచేసిన ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో మరోసారి బీజేపీదే విజయం అని తేలిపోయింది. మెజార్టీని మించి స్థానాలను ఆ పార్టీ కైవసం చేసుకోబోతోంది. తాజాగా అందుతున్న ఫలితాల్లో బీజేపీ దే హవా నడిచింది.
మరోసారి సీఎం యోగి ఆదిత్యనాథ్ కే సీఎంగా ప్రజల మరోసారి పట్టం కట్టబోతున్నారు. ఇదివరకూ ఎంపీగా గెలిచిన యోగి తొలిసారి తన సొంత నియోజకవర్గం గోరఖ్ పూర్ నుంచి ఎమ్మెల్యేగా పోటీచేశాడు. తాజాగా 12వేలకు పైగా మెజార్టీతో గెలుపు బాటలో ఉన్నారు.
యూపీలో మొత్తం 403 అసెంబ్లీ స్థానాలున్నాయి. ఇందులో బీజేపీకి ప్రభుత్వ ఏర్పాటుకు 202 సీట్లు అవసరం. అయితే ప్రస్తుతం 268 స్థానాల్లో లీడ్ లో ఉంది. ప్రతిపక్ష సమాజ్ వాదీ కేవలం 110కి పైగానే విజయం సాధిస్తోంది. దీంతో యూపీలో బీజేపీ ప్రభుత్వ ఏర్పాటు ఖాయంగా కనిపిస్తోంది.
దేశ రాజకీయాల్లో కేంద్రంలో అధికారంలోకి రావాలంటే అతిపెద్ద రాష్ట్రం ఉత్తరప్రదేశ్ లో గెలుపు చాలా కీలకం. ఈ రాష్ట్రంలో ఎవరిది గెలుపు అయితే వారిదే కేంద్రంలో అధికారం. యూపీ ప్రజల నాడిని బట్టే దేశ రాజకీయాలు ఉంటాయి.
అయితే రైతుల ఉద్యమం, ఉత్తరప్రదేశ్ లో అత్యాచారాలు, రైతులపై కేంద్రమంత్రి కుమారుడు రైతులను తొక్కించి చంపడం వంటి కారణాలు కూడా బీజేపీ ఓటమికి కారణం అవుతాయని అంతా భావించారు. కానీ అలాంటివేమీ పెద్దగా పనిచేయడం లేదని తాజాగా వెలువడుతున్న ఫలితాల సరళిని బట్టి అర్థమవుతోంది.
యోగి ఆదిత్యనాథ్ పై వ్యతిరేకత లేదని.. ఆయన పాలన మెరుగ్గా ఉందని మరోసారి యూపీ ప్రజలు స్పష్టం చేశారు. యూపీ సీఎంగా మరోసారి అవకాశం ఇఛ్చారు. అంతటి వ్యతిరేకతలోనూ యూపీలో బీజేపీని గెలిపించిన యోగి స్టామినా ఈ ఫలితాలు గ్రేట్ అనే చెప్పొచ్చు.